అంబేడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు.. నోటిఫికేషన్ విడుదల : BRAOU Admission Notification. 2024
BRAOU Admission Notification 2024-25 : హైద్రాబాద్ (HYDERABAD)లోని డా.బీ ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU)లో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి Distance Education విధానంలో UG , PG , Diploma, సర్టిఫికెట్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి Applications లను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు Online విధానంలో Apply చేసుకోవచ్చు. ఆగస్టు 18 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
BRAOU Admission Notification 2024-25 : డా. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీజీ (ఎంఏ/ఎంకాం/ఎమ్మెస్సీ) కోర్సులు, బీఎల్‌ఐఎస్సీ, ఎంఎల్‌ఐఎస్సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం BRAOU యూనివర్సిటీ జులై 27వ తేదీన నోటిఫికేషన్ విడుదల చేసింది.
అయితే ఈ విద్యాసంవత్సరం కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ప్రవేశాలు చేపట్టనుంది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అయిన బుర్రా వెంకటేశం గారు తెలంగాణలోని Study Center లలో మాత్రమే ప్రవేశాలు చేపట్టాలని, శనివారం యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు ఉత్తరం రాశారు. దీంతో అంబేడ్కర్ యూని వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది.
అయితే,ఆయా కోర్సుల్లో Admissions కు సంబంధించి August 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని యూనివర్సిటీ (BRAOU) తెలిపింది.
BRAOU Admission Notification 2024-25 :తెలంగాణలోని స్టడీ సెంటర్లలో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సుల వివరాలను https://www.braouonline.in/ లేదా https://braou.ac.in/ వెబ్‌సైట్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. Second Year , Third Year విద్యార్థులు Tuition fee చెల్లించాలని, Degree, PG లో 2015-16 నుంచి 2023-24 వరకు అడ్మిషన్ పొంది, ఫీజు సకాలంలో చెల్లించనివారు ఆగస్టు 18వ తేదీలోపు ఫీజు చెల్లించాలని సూచించడం జరిగింది.