BSNL 5G : బీఎస్‌ఎన్‌ఎల్‌ 5G సిమ్‌కార్డులు షురూ…! 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల వివరాలు…

BSNL 5G : బీఎస్‌ఎన్‌ఎల్‌ 5G సిమ్‌కార్డులు షురూ…! 5G నెట్వర్క్ ఉన్న ప్రాంతాల వివరాలు…

BSNL 5G : కొన్ని ప్రైవేట్ టెలికం లు రీఛార్జి ధరలను పెంచడం తో, వినియోగ దారుల కన్ను ప్రభుత్వ నెట్వర్క్ ఐనా బీఎస్‌ఎన్‌ఎల్‌ పైన పడ్డాయి, దీనితో bsnl టెలికం సంస్థ వినియోగదారులను మరింత ఆకర్షించేలా పనులను చేపడుతుంది..ఇందులోని భాగమే ఈ Bsnl 5G సిం కార్డును అందుబాటులోకి తేవడానికి సిద్ధమైతుంది.
BSNL launched 5G ready SIM Cards :BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్‌. బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలికం ప్రస్తుతం కొన్ని స్టేట్ లల్లో ‘5జీ-రెడీ సిమ్‌ కార్డ్‌’లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది.

ఇవి రాబోయే నెట్‌వర్క్ అప్‌గ్రేడ్‌కు ఎంతో సహకారంగా ఉంటాయని చెపింది. ప్రస్తుతానికి కొత్త సిమ్ కార్డులు మొదలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళలో అందుబాటులో ఉంటాయని సంస్థ ప్రతినిధులు తెలియజేసారు.BSNL ఇప్పటికీ చాలా నగరాలలో 3జీ నెట్‌వర్క్‌నే అందిస్తోంది. కొన్ని టైర్‌-1, టైర్‌- 2 నగరాలతోపాటు కొన్ని పట్టణ ప్రాంతాలలో 4జీ సేవలను ప్రారంభించింది. అయితే.. ఈ మధ్య కాలంలో జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ఐడియా..వంటి ప్రైవేట్‌ టెలికం నెట్‌వర్క్‌ ఆపరేటర్లు తమ రీఛార్జ్‌ ప్లాన్ల ధరలను ఎక్కువ చేసాయి.

BSNL 5G ఈ తరుణంలో ఆ నెట్‌వర్క్‌ వినియోగదారులు మార్కెట్‌లో చౌకగా రీచార్జ్‌ ప్లాన్లు అందించే BSNLవైపు ఎక్కువ మొత్తం లో మొగ్గుచూపుతున్నారు. కానీ BSNLలో 4G సర్వీసే కొన్ని ప్రాంతాలకు పరిమితమైంది. దాంతో కొనుగోలుదారులు కొంత వెనకడుగు వేస్తున్నారు. ఈ అంశాన్ని గమనించిన BSNL టెలికం ప్రతినిధులు 4G సదుపాయాన్ని వేగంగా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ముందు భవిష్యత్తులో రాబోయే 5జీ నెట్‌వర్క్‌ కోసం ప్రత్యేకంగా సిమ్‌కార్డులను తీసుకునే అవసరం లేకుండా ‘5G -రెడీ సిమ్‌కార్డు’లను అందిస్తున్నట్లు BSNL ఇప్పటికే వెల్లడించింది.

కొనుగోలుదారులు ఈ సిమ్‌కార్డ్‌ను లేటెస్ట్‌ స్మార్ట్‌ఫోన్లతోపాటు ఫీచర్‌ఫోన్లలో వాడుకునేందుకు వీలుగా రెగ్యులర్‌, మైక్రో, నానో వేరియంట్లలో తీసుకొస్తున్నారు. Airtel ,Jio మాదిరిగానే BSNL 4G వినియోగదారులు 5G కనెక్టివిటీని యాక్సెస్ చేయడానికి కొత్త సిమ్‌ కార్డ్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ 5G రెడీ సిమ్‌నే వాడుకోవచ్చని BSNL సంస్థ పేర్కొంది. కొనుగోలుదారులకు మరింత మెరుగైన నెట్‌వర్క్‌ కనెక్టివిటీని అందించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు చెప్పింది.

BSNL 5G రెడీ.. వీడియో కాల్‌ను పరీక్షించిన టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా (Jyotiraditya Scindia)
ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL తన నెట్‌వర్క్‌ సేవల్ని విస్తరిస్తోంది. ఇప్పటికే 4G నెట్‌వర్క్‌ సేవల్ని కొన్ని నగరాల్లో అందుబాటులోకి తీసుకొచ్చిన టెలికాం సంస్థ.. తాజాగా తన 5G సేవల ట్రయల్స్‌ను స్టార్ట్ చేసింది. ఈ మేరకు BSNL 5G నెట్‌వర్క్‌ సేవల్ని కేంద్ర టెలికాం మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరీక్షించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన ‘ఎక్స్‌’ వేదికగా షేర్‌ చేశారు.

BSNL తన 5G నెట్‌వర్క్‌ టెస్ట్‌ను C – డాట్‌ క్యాంపస్‌లో నిర్వహించింది. ఇందులో పాల్గొన్న కేంద్ర మంత్రి 5G ఎనేబల్డ్‌ వీడియో కాల్‌ చేశారు. నెట్‌వర్క్‌ ఎలా పనిచేస్తుందో పరిశీలించారు. మాటలు, వీడియో స్పష్టంగా వస్తోందని చెప్పారు.దీని సంబంధిత వీడియోను డిజిటల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top