Bsnl Fancy Number Bsnl 4G : Bsnl ఫాన్సీ నెంబర్ కావాలంటే ఇలా చేయండి…!
Bsnl Fancy Number Bsnl 4G : భారతదేశం యొక్క ఏకైక ప్రభుత్వ టెలికం సంస్థ, ఐతే మన అందరికి తెలుసు ఒక్కపుడు bsnl మాత్రమే అన్ని నెట్వర్క్స్ తో పోలిస్తే ఎక్కువగా వాడుకలో ఉండేది.కానీ కాలక్రమేనా దీనిని వాడే వినియోగ దారులు తగ్గి పోయారు. bsnl నెట్వర్క్ పతనం కావడానికి అనేక కారణాలు ఉన్నాయి, నెట్వర్క్ స్పీడ్ లేకపోవడం కావొచ్చు, bsnl లో జరిగిన అనేక స్కామ్లు కావొచ్చు. ఇందులో 4G నెట్వర్క్ అందుబాటులో వున్న సరే సర్వర్స్ వీక్ గా ఉండటం ఇలా మొదలైన అనేక అంశాలు bsnl ఎదుగుదలని ఆపేసింది అని చెపొచ్చు. మన భారత దేశం లో అర్బన్ ఏరియాల కన్న గ్రామీణ ప్రాంతాలే ఎక్కువగా ఉంటాయి. ఐతే గ్రామీణ ప్రాంతాలలో సరిగా మొత్తానికే సిగ్నల్ రాకపోవడం కొంత వరకు వినియోగ దారులలో నిరుత్సహన్ని మిగిల్చింది.ఇలా అనేక కారణాలతో,మొదట్లో దిగ్విజయంగా సాగిన తర్వాత కాల క్రమేణ దీని ఎదుగుదల క్రమంగా పతనానికి దారి తీసింది…
ఇపుడున్న పరిస్థితితులలో చాలా నెట్వర్క్స్ అందుబాటులోకి వచ్చాయి, కానీ అన్ని కూడా గత నెల రోజులుగా రీఛార్జ్ ధరలను ఆమాంతoగా ఒకదానితో మరొకటి పోటీ పడి మరి ఆకాశానికి తాకేల ధరలను పెంచేస్తున్నాయి. ఇతర నెట్వర్క్స్ అన్నిటితో వినియోగదారులు విసిగిపోయారనే చెపొచ్చు. ఐతే bsnl ఎప్పుడు కూడా తన రీఛార్జి ధరలను వినియోగ దారులకు అనుకూలంగానే అందిస్తుంది, అలాగే bsnl టెలికం యొక్క ముఖ్య ఉదేశ్యం సర్వీస్ కాబ్బట్టి, దీని రీఛార్జి ధరలను ప్రజలకు అందుబాటులోనే ఉంచుతుంది, మరియు మునపటి కంటే కూడా నెట్వర్క్ ని స్పీడ్అప్ చెయ్యడంతో bsnl కి నూతన వినియోదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. దీనితో bsnl పూర్వ వైభవం మళ్ళి పొందుతుంది, ఈ క్రమేణా bsnl సంస్థ నూతన వినియోగ దారులకు ఫాన్సీ నంబర్స్ పైన అనేక ఆఫర్లను ప్రకటిస్తుంది..
Bsnl Fancy Number Bsnl 4G
ఫాన్సీ నంబర్స్ అంటే చెప్పడానికి మరియు గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటాయి.ఫాన్సీ నంబర్స్ ని వానిటీ నంబర్స్ ( Vanity Numbers ) అని కూడా పిలుస్తారు. వీటిని మనం కాస్త అధిక డబ్బులను చెలించి తీసుకోవాల్సి ఉంటుంది..ఫాన్సీ నంబర్స్ లలో మీరు మీకు నచ్చిన క్రమ సంఖ్యను ఎంచుకోవచ్చు. ఉదాహరణకు మొబైల్ నెంబర్ ని గమనిస్తే పది సంఖ్యలతో ఉంటుంది, ఆ పది సంఖ్యలలో మొదట 7,8,9 ఆలా మీకు నచ్చిన సంఖ్యలతో మీరు మొబైల్ నంబర్లను ఎంచుకోవచ్చు…కేవలం మొదటి ఒకే సంఖ్య కాకుండా మొదటి మూడు సంఖ్యలు, లేదా చివరి మూడు సంఖ్యలు…ఇలా 3 కాకుండా మొదట మరియు చివర 2 సంఖ్యలు ఇలా మీకు నచ్చిన విధంగా వీటిని మీరు ఎంచుకోవచ్చు…మీరు ఎలా అనుకుంటే ఆలా మీరు ఈ నంబర్స్ ని ఎంచుకోవచ్చు..మీ బర్త్ డే, మ్యారేజ్ డే ఇలా మొదలైన ముఖ్య తేదీ నంబర్స్ తో కూడా మీరు ఫాన్సీ నంబర్స్ ని ఎంచుకోవచ్చు…
Bsnl Fancy Number Bsnl 4G ఇలా ఫాన్సీ నంబర్స్ ని ఎంచుకోవడం వల్ల నంబర్స్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటాయి, ముఖ్యంగా ఆఫీస్లకు ఫాన్సీ నంబర్స్ మంచి ఎంపిక, కాస్త ధర ఎక్కువైనా, ఈ నంబర్స్ ఈస్జిగా గుర్తుపెట్టుకోవడానికి సులువుగా ఉంటాయి. ఈ నంబర్స్ చూడడానికి కూడా ఒక ప్రొఫెషనల్ లుక్ లో ఉంటాయి. ఏదైన బిసినెస్ చేసే వారికీ కూడా క్రమ సంఖ్యలో మొదట గాని చివర గాని ఎంచుకోవచ్చు. ఇలా అనేక రకాల ఆఫర్స్ తో bsnl మళ్ళి వినియోగ దారులను ఆకట్టుకుంటుంది . మరి మీకు కూడా bsnl ఫాన్సీ నంబర్స్ కావాలంటే ఇక్కడ చూసేయండి.
Bsnl Fancy Number Bsnl 4G ఫాన్సీ నెంబర్ ని ఎంచుకునే విధానం
మొదటగా ఈ కింది వెబ్సైటు ని సందర్శించి
https://cymn.bsnl.co.in/cymnportal/Home.do
సౌత్ జోన్ ఎంచుకోవాలి > ఆంధ్ర ప్రదేశ్ / తెలంగాణ > క్యాప్చా ఎంటర్ చేయాలి >
ఎంటర్ చేశాక మరొక విండో ఓపెన్ అవుతుంది అందులో ఛాయస్ నంబర్స్ మరియు ఫాన్సీ నంబర్స్ అనే రెండు రకాల కాటగిరీలు ఉంటాయి
- అందులో మొదటిదాన్ని ఎంచుకుంటే Select అనే ఆప్షన్ వస్తుంది అందులో
- Search with series
- Search with start number
- search with End number
- search with Sum of the numbers
- అనే ఆప్షన్స్ వస్తాయి , అందులో కొన్ని లిస్ట్ నంబర్స్ వస్తాయి మీకు నచ్చిన నెంబర్ ని ఎంచుకుని Reserve అనే ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి.
- తర్వాత మనం వాడుతున్న మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఎంటర్ చేసాక సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ,
- మనం ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కి ఒక OTP వస్తుంది.
- ఆ OTP ఎంటర్ చేసి confirm చేయాలి అప్పుడు succes అనే పాప్ అప్ వస్తుంది.
- తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది దానిని తీసుకుని మీకు దగ్గరలోని bsnl ఆఫీస్ కి గాని లేదా ఏదైనా bsnl రిటైలర్ ని సంప్రదించి మీరు ఆ SIM కార్డు ని పొందవచ్చు .
ఇదేకాకుండా మీరు ఇంకా మంచి నెంబర్ ఎంచుకోవాలి అనుకుంటే మంచి ఫాన్సీ నెంబర్ ఎక్కువ ధరలో కూడా పొందవచ్చు
https://eauction.bsnl.co.in/index.aspx?id=51&type=GSM/MOBILE
Bsnl Fancy Number Bsnl 4G ని మీరు e auction పద్ధతిలో కూడ ఎంచుకోవచ్చు. ఐతే ఇక్కడ మీరు డబ్బులు చెల్లించి నంబర్స్ ని ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇందులోని నంబర్స్ మరింత చెప్పటనికి మరియు గుర్తుపెట్టుకోవడానికి మరింత సులువుగా ఉంటాయి.క్రింద ఇచ్చిన వెబ్సైటు లో మీరు ఈ నంబర్స్ ని ఎంచుకోవచ్చు.
ఈ వెబ్సైటు ని సందర్శించి > e – auction అనే ఆప్షన్ ని ఎంపిక చేసుకుని ప్రీమియం నంబర్స్ నీ e auction ని బిడ్డింగ్ రూపంలో పొందవచ్చ.Bsnl Fancy Number Bsnl 4G
- ఈ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది, అందులో మీకు
- Pattern – 1, Pattern -2,Pattern -3 బాక్స్ లు కనిపిస్తాయి.
- అందులో మీకు ప్రతి మొబైల్ నెంబర్ కి ఒక ధర ఇవ్వడం జరుగుతుంది.
- మీరు మీకు నచ్చిన నెంబర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు.
- ఎంచుకున్న తర్వాత మీకు ఆ బాక్స్ ల క్రింద కుడి వైపున, Location -1 మరియు email.id అడ్రెస్ లు పొందుపరిచి ఉంటాయి.
- వాటిలో మీరు ఏదో ఒక ఆప్షన్ న్ని ఎంచుకొని మెయిల్ చేయాలి.
- తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది దానిని తీసుకుని మీకు దగ్గరలోని bsnl ఆఫీస్ కి గాని లేదా ఏదైనా bsnl రిటైలర్ ని సంప్రదించి మీరు ఆ SIM కార్డు ని పొందవచ్చు .