Castor Oil in Telugu : ఆముదంతో ఆరోగ్యం….వామ్మో ఇన్ని రకాల ప్రయోజనాలా…..!
Castor Oil in Telugu : ఇప్పుడంటే ఆముదం నూనె వాడకం తగ్గిపోయింది కానీ.. పూర్వం మన పూర్వికులు అయితే, ఆముదాన్ని ఎక్కువగా ఉపయోగించే వారు. ఆయుర్వేదంలో ఆముదం కి అనేక రకాలైన పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు,ఔషధ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
ఆముదాన్ని సంస్కృత భాషలో పంచాగుల, ఏరండ అని పిలుస్తారు. ఆముదం మొక్కల్లో ప్రతి భాగం కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుంచి బైట పాడొచ్చు..ఎన్నో ప్రయోజనాలు కూడా వీటిని వాడటంతో పొందవచ్చు. ఆముదం లో ఎర్ర ఆముదం మరియు తెల్ల ఆముదం రెండు రకాలు ఉంటాయి.
అముదాన్నిబాగా మరుగ బెట్టి తీసిన నూనె ద్వారా అనేక లాభాలను మనం పొందొచ్చు.ఆముదం ని జుట్టుకి, పేదలకు, వంటలలో,మొక్కల వాపులకి ఇలా అనేక సమస్యలకు దీనిని వాడొచ్చు.ఆముదాల్లో, ఎర్ర ఆముదం, తెల్ల ఆముదం, పెద్ద ఆముదం, చిట్టి ఆముదం అని కూడా రకాలు ఉంటాయి. ఆముదంతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆముదం నూనెతో కలిగే ప్రయోజనాలు Castor Oil in Telugu
నులి పురుగుల నివారణ
పిలలో మరియు పెద్దలలో,కడుపులో నులి పురుగులను నివారించడంలో ఆముదం ఆకులు చాలా సహాయపడతాయి. ఆముదం ఆకులు మెత్తగా చేసి తొలుత కడుపు పై బాగా రుద్దాలి. ఇలా కడుపుపై రుద్దడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు అన్ని కూడా మలం ద్వారం నుండి బయటకు పోతాయి.ఈ సమస్య వున్న చిన్న పిల్లలలో ఇది బాగా పనిచేస్తుంది.
మూల వ్యాధి
ఆముదం యొక్క ఆకులు మరియు కర్పూరాన్ని కలిపి మెత్తగా నూరాలి. వీటిని మెత్తగా నూరిన మిశ్రమాన్ని కట్టుకోవాలి ఇలా కట్టుకోవడం వల్ల మూల వ్యాధి నుంచి బైట పడొచ్చు.
నెలసరి సమస్యలు
మహిళలు సాధారణంగా నెలసరి సమయంలో పలు సమస్యలని ఎదుర్కొంటూ ఉంటారు. కొంత మంది స్త్రీలలో నెలసరి సరైన సమయానికి రాదు. ఈ సమస్య ఉన్న అడవారు ఆముదం ఆకులను కచ్చా పచ్చాగా దంచి.. వేడి చేసి పొత్తి కడుపుపైన పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారికీ నెల సరి సరైన సమయంలో వస్తుంది.
జుట్టు పొడుగ్గా పెరుగుతుంది
ఈరోజుల్లో ఉన్న వత్తిడిలకు చాల మంది జుట్టు సమస్యలకు లోనవుతున్నారు. అలంటి వారి ఈ ఆముదం నూనెని వాడటం వల్ల ఆ సమస్యల నుంచి బైట పడొచ్చు.ఆముదం నూనె వాడటం వల్ల జుట్టు వత్తుగా పెరుగుతుంది. అలాగే మృదువుగా కనిపిస్తుంది..జుట్టు సమస్యలకు ఆముదం పని చేసినంతగా మరి ఇంకే నూనె పనిచెయ్యదు, అనడంలో ఎలాంటి ఆతిశయోక్తి లేదు.
చర్మం ఆరోగ్యంగా ఉంటుంది
ఆముదం నూనెలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఎక్కువ మోతాదులో ఉంటాయి.ఆముదం చర్మానికి వాడటం వల్ల చర్మ సౌందర్యం పెంపొందుతుంది. అలాగే చర్మ పై మచ్చలు పొడి బారిన చర్మం వంటి సమస్యల నుంచి దురం పెడుతుంది.ఇది పెదలవులకు వాడటం వల్ల అవి ఎరగా మృదువుగా అవుతాయి.
మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి
చాల మంది ఈరోజుల్లో కీళ్ల మరియు మోకాళ్ల నొప్పులతో బాద పడుతుంటారు.. అలాంటివారు ఆముదం ఆకులకు నువ్వుల నూనె రాసి కాస్త గోరువెచ్చగా వేడి చేయాలి. ఆ తర్వాత ఆ ఆకుని మీకు నొప్పులు ఉన్న చోట ఉంచి కట్టు కట్టుకోవాలి. ఇలా చేస్తే వల్ల కీళ్ల, మోకాళ్ల నొప్పులు, పక్షవాతం మొదలైన సమస్యల నుంచి బైట పడొచ్చు
Castor Oil in Telugu గమనిక : ఇందులోని సమాచారం నిపుణుల ద్వారా సేకరించడం జరిగింది. వీటిని వాడే ముందు డాక్టర్ల సూచనలను పాటించడం మేలు…