Chia Seeds in Telugu : ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే…అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు…2024

Chia Seeds in Telugu : ఈ గింజలు నీటిలో నానబెట్టి ఉదయం తాగితే…అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు…

​రాత్రిపూట Chia Seeds in Telugu నీటిలో నానబెట్టి, ఉదయం పూట ఖాళీ కడుపుతో తాగితే అనేక ఆరోగ్య ఉపయోగాలను పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఆ ప్రయోజనాలేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ పూర్తిగా చదవండి…

​Chia Seeds in Telugu : చాలా మంది బరువు తగ్గాలనుకునేవారు వారి డైట్‌లో కచ్చితంగా చియా సీడ్స్‌ ని ఉపయోగిస్తారు. ఈ విత్తనాలు కేవలం బరువు తగ్గాడానికే కాదు.. మన ఆరోగ్యాన్ని రక్షంచడానికి ఉపయోగపడతాయి. చియా సీడ్స్‌లో పోషకాలు మెండుగా ఉంటాయి. ఈ విత్తనాలలో ఫైబర్, ప్రొటీన్‌, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌, కాల్షియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్‌ మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంచాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చియా సీడ్స్‌ను సలాడ్స్‌, స్మూతీలో వేసుకుని చాలా మంది చాల ఇష్టంగా తింటూ ఉంటారు. అయితే, చియా సీడ్స్‌ నీటిలో నానబెట్టి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు చియా విత్తనాలలో ఉండే సున్నితమైన కొవ్వులు, రాన్సిడ్‌లు కాకుండా రక్షిస్తాయి. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరానికి రక్షణ అందిస్తాయి.

చియా విత్తనాలలో ఫైబర్ మెండుగా ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయానే ఖాళీ కడుపుతో తాగితే.. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది , పేగు కదలికలను నియంత్రిస్తుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ ఎంతో అవసరం. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ కారణంగా మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచడంలో దోహదపడుతుంది . మీరు ఎక్కువగా తినకుండా కాపాడుతుంది.

చియా గింజలు ఎక్కువ మొత్తంలో కరిగే ఫైబర్ ఉంటుంది…ఇది చియా సీడ్స్ వాటి బరువు కంటే.. 10-12 రెట్లు నీళ్లు పీల్చుకునేలా చూస్తుంది. వాటిని జెల్‌ రూపం చేస్తుంది. ఉదయం పూట ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన చియా విత్తనాలు తింటే.. మీకు సంపూర్ణత్వ భావన పెరుగుతుంది, ఆహారాన్ని అధిక మొత్తంలో తినకుండా నెమ్మదిస్తుంది. దీని ద్వారా మీరు తక్కువ కేలరీలు తినేలా చేస్తుంది. ఇలా చేయడం ద్వారా మీరు త్వరగా బరువు తగ్గుతారు.

చియా విధానాలలో 14% ప్రోటీన్‌తో తయారవుతాయి. వీటిలో అమైనో యాసిడ్ ప్రొఫైల్‌‌ కూడా పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గడానికి, కండరాల పెరుగుదల, రిపేర్‌కు ఈ ప్రొటీన్‌ మన శరీరానికి చాల అవసరం పడుతుంది. ప్రోటీన్-రిచ్ ఫుడ్స్ తింటే.. మిమ్మల్ని సంతృప్తిగా ఉంచుతుంది మరియు మీరు కేలరీలు తీసుకోవడం తగ్గిస్తారు.

చియా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ – ఆల్ఫా-లినోలెనిక్‌ యాసిడ్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాల వరకు మేలు చేస్తాయి. ఉదయం పూట ఖాళీ కడుపుతో చియా విత్తనాలు నానబెట్టిన నీటిని తాగితే.. గుండె జబ్బులు వచ్చే ముప్పు ని నియంత్రిస్తుంది.​

చియా గింజల్లో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చియా విత్తనాల్లో రోజువారీ సిఫార్సు చేసిన కాల్షియంలో 18 శాతం కలిగి ఉంటాయి. కాల్షియం మీ ఎముకలు మరియు దంతాలను స్ట్రాంగ్‌గా ఉంచుతుంది.

చియా విత్తనాలు ఇన్సులిన్ సెన్సిటివిటీని, బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. చియా విత్తనాలు భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. షుగర్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో చియావిత్తనాలు చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని డాక్టర్లు సూచిస్తున్నారు.

మన శరీరంలోని అనారోగ్యాలకు ఎక్కువ స్థాయి ఇన్ఫ్లమేషన్‌ ప్రధాన కారణం. ప్రతిరోజూ 37 గ్రాముల చియా విత్తనాలను తీసుకోవడం వల్ల హెచ్‌ఎస్-సిఆర్‌పి వంటి ఇన్‌ఫ్లమేటరీ మార్కర్లను 40% తగ్గించవచ్చని ఒక అధ్యయనం పేర్కొంది. ఆ అధ్యయనంలో 20 మంది డైయాబెటిక్ పేషెంట్స్‌కు 3 నెలల పాటు చియా విత్తనాలు ఇచ్చారు. రోజూ ఖాళీ కడుపుతో నీటిలో నానబెట్టిన చియా విత్తనాలను తీసుకంటే.. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను నియంత్రించవచ్చు.

రాత్రంతా నీటిలో నానబెట్టిన ఒక చెంచా చియా విధానాలను మీ ఉదయం పూట నిమ్మ, తేనె వాటర్‌లో మిక్స్‌ చేసుకుని తాగొచ్చు. ఈ డ్రింక్‌ శరీరం నుంచి విషాన్ని, వ్యర్థపదార్థాలను తీసేస్తుంది . ఈ డ్రింక్‌ బెల్లీ ఫ్యాట్‌ను కరిగించడానికి ఉపయోగపడుతుంది.

Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ​ Chia Seeds in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top