Cloud Kitchen : తక్కువ పెట్టుబడితో డబుల్ లాభం అందించే వ్యాపారం ఈ క్లౌడ్ కిచెన్…! దీనిని ఎలా స్టార్ట్ చేయాలి..ఎంత పెట్టుబడి కావాలి పూర్తి వివరాలు…!

Cloud Kitchen : తక్కువ పెట్టుబడితో డబుల్ లాభం అందించే వ్యాపారం ఈ క్లౌడ్ కిచెన్…! దీనిని ఎలా స్టార్ట్ చేయాలి..ఎంత పెట్టుబడి కావాలి పూర్తి వివరాలు…!

Cloud Kitchen : కొవిడ్​ కారణంగా ఎన్నో వ్యాపార రంగాలు ఆర్థికంగా తీవ్ర నష్టాలో కూరుకుపోయాయి. మరికొన్నిసంస్థలు అయితే దాదాపు మూతపడే పరిస్థితి కూడా వచ్చాయి. ఐతే అన్నిటిలో ఎక్కువగ నష్టాలలో కూడుకుపోయిన రంగం హోటల్ అని చెపొచ్చు ..ఇలా నష్టాలలో నుంచి పుట్టుకొచ్చిన ఐడియా నే క్లౌడ్ కిచెన్.ఈ క్రమంలో హోటల్ రంగంపై ఆసక్తి ఉన్నవారికి అండగా ఉంటూ ఉపాధిని అందిస్తోంది Cloud Kitchen​. వీటి ద్వారా ఔత్సాహికులు ఉపాధి ఏర్పరుచుకుంటూ విభిన్న వంటకాల ద్వారా భోజన ప్రియులను ఆకర్షిస్తున్నారు. మరి ఈ క్లౌడ్​ కిచెన్స్​ ఎలా ఉంటాయో వాటిని నడపడానికి ఎం ఏం నైపుణ్యం కావాలో ఇపుడు తెలుసుకుందo…

క్లౌడ్‌ కిచెన్‌లకు ప్రతి నెల అద్దె కట్టడం తప్ప పెద్ద స్థాయిలో పెట్టుబడులేమీ ఉండవు, లేదా మీ సొంత స్థలంలో ఐనా ఇది స్టార్ట్ చేయొచ్చు,ఎంతో నాణ్యమైన రుచితో పదార్థాలను తక్కువ ధరకు అమ్మడంతో డిమాండ్‌ కూడా ఎక్కువగానే ఉంటోంది.కేవలం చిన్న వ్యాపారులే కాదు, పేరు పొందిన పెద్ద రెస్టారెంట్లు కూడా వేరు ప్రాంతాల్లోని Cloud Kitchen లలో తమ వంటకాలను వండి ఆన్‌లైన్‌లో అమ్మెస్తున్నారు.దీని వాలా కస్టమర్లకి హోటల్ దూరంగా ఉన్న..హోటల్ రుచి మాత్రం దగ్గర ఉంటుంది అన్న భావనతో ఇలా పెద్ద హోటల్స్ కూడా ఈ రంగం లోకి వచ్చాయి.అంతర్జాతీయ సంస్థ యూరోమానిటర్‌ వెల్లడించిన ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 4000 క్లౌడ్‌ కిచెన్‌లు అందుబాటులో ఉన్నాయి. ముందు ముందు ఈ సంఖ్య మరింత పెరుగుతుంది అని అంచన కూడా వేస్తున్నారు నిపుణులు.

నేటి యోవతకి క్లౌడ్ కిచెన్ ఒక మంచి ఎంపిక గా చెపొచ్చు..ఇప్పటికే చాల మంది యువత ఈ క్లౌడ్ కిచెన్ పెట్టి సక్సెస్ అవుతున్నారు..కొందమంది దీనిని పార్ట్ టైం బుసినెస్ గా కూడా నడిపిస్తున్నారు..జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా ఏదన బుసినెస్ ఒప్షన్ కోసం ఎదురు చూస్తున వారికీ ఈ బిసినెస్ గొప్ప అవకాశం..ఇందులో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను పొందొచ్చు.ఈ బిసినెస్ కోసం మీరు 50,000/- రూపాయల పెట్టుబడితో దీనిని స్టార్ట్ చేయొచ్చు..మరిన్ని వివరాలు క్రింద క్లుప్తంగా తెలియజేసాం చదవండి..!

Cloud Kitchen: తక్కువ పెట్టుబడితో నష్ట భయం పెద్దగా లేకుండా.. మంచి లాభాలు వచ్చే వ్యాపారం చేయాలని అనుకుంటున్నారా? ఒక వేళ మీరు పట్టణ ప్రాంతాల్లో వ్యాపారం చేయాలని భావిస్తున్నట్లయితే Cloud Kitchen బిజినెస్ మంచి ఐడియా. కస్టమర్లకు ఎలాంటి ఆహారం అందించాలనే విషయంలో క్లారిటీ ఉండి.. మంచి చెఫ్, ఆకట్టుకునే ప్యాకేజింగ్, చక్కటి మార్కెటింగ్ వ్యూహాలను అమలు చేస్తే.. స్వల్ప కాలంలోనే మీ కంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగితే మంచి లాభాలు సొంతం చేసుకోవచ్చు..

Cloud Kitchen: తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు వచ్చే వ్యాపారాల్లో క్లౌడ్ కిచెన్ ఒకటి. ఈ బిజినెస్ మంచిగా క్లిక్ అయితే నెలకు రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు మీరు ఇంట్లో ఉంటూనే సంపాదించొచ్చు. రెస్టారెంట్ పెట్టాలంటే.. మంచి లొకేషన్, ఇంటీరియర్, లుక్ మొదలైనవి ముఖ్యం పాత్ర వహిస్తాయి. వర్కర్లు కూడా ఎక్కువగా కావాలి. కానీ Cloud Kitchen బిజినెస్‌ను ఓ చిన్న రూంలో నుంచే దీనిని స్టార్ట్ చేయొచ్చు. మీ ఇంట్లోనే ఈ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. దీనికి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం లేదు. కరోనా దెబ్బకు బైటికి వెల్లి తినేవారి సంఖ్య చాల మేరకు తగ్గిపోయింది. అదే సమయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఫుడ్ బుక్ చేసుకోవడం కూడా పెరిగింది. దీంతో కోవిడ్ తర్వాత క్లౌడ్ కిచెన్ వ్యాపారం ఊపందుకుంది. 2019లో మన దేశంలో Cloud Kitchen బిజినెస్ మార్కెట్ విలువ 400 మిలియన్ డాలర్లు కాగా.. 2024 నాటికి 3 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని అంచనా. Cloud Kitchen బిజినెస్ చేయడానికి ఏమేం అవసరం, ఎంత పెట్టుబడి కావాలి..? ఈ వ్యాపారంలో సమస్యలేంటి..? ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ చూద్దాం..

Cloud Kitchen వ్యాపారం ఐడియాలో కస్టమర్లెవరూ మీ వద్దకు రారు. కాబట్టి ఈ వ్యాపారం డైన్ ఇన్ అవసరం లేదు. కిచెన్‌లో వంట చేసి ఆన్‌లైన్ ద్వారా కస్టమర్లకు డెలివరీ చేయడమే Cloud Kitchen యొక్క ముఖ్య ఉద్దేశం. క్లౌడ్ కిచెన్ వ్యాపారం ప్రారంభించడానికి ముఖ్యమైంది రీసెర్చ్. మీరు ఉండే ఏరియాలో ఎలాంటి ఫుడ్‌కు డిమాండ్ ఉంది..? జనాలు ఇష్టాయిష్టాలు,వారు తినే ఆహారపు అలవాట్లు, ఇప్పటికే ఎలాంటి ఫుడ్ ఎంత ధరలో అందుబాటులో ఉందని మొదలైన వివరాల అన్నిటిని క్లుప్తంగా సేకరించాలి. ఉదాహరణకు హైదరాబాద్‌లోని అమీర్‌పేట లాంటి ఏరియాలో ఇలాంటి వ్యాపారం చేయాలంటే.. అక్కడ ఎక్కువగా ఉండేది యువత కాబట్టి వారు ఎలాంటి ఆహారాన్ని ఎక్కువగా తినడానికి ఇష్టపడుతున్నారో అని ముందుగా తెలుసుకోని ఒక ప్రణాలికను సిద్ధం చేసుకోవాలి.వారు ఏ ఆహారాన్ని ఎక్కువగా తింటున్నారో అలాంటి ఆహారాన్నే మీరు రుచికరంగా, నాణ్యంగా, తక్కువ ఖర్చులో అందించే ప్రణాలికను పెట్టుకోవాలి..

క్లౌడ్ కిచెన్‌కు లొకేషన్‌తో సంబంధం లేదు. కానీ రోడ్డుకు కొంచెం దగ్గరగా ఉంటే బెటర్. జొమాటో, స్విగ్గీ డెలివరీ ఆప్షన్ ఉండేలా చూసుకోవడం కలిసొస్తుంది. ప్రజల రద్దీ ఎక్కువ ఉండే, ప్రాంతానికి దగ్గరగా.. తక్కువ అద్దెకు లభించేలా 500 చదరపు అడుగుల స్థలం Cloud Kitchenకు వ్యాపారానికి సరిపోతుంది.అలాగే పార్కింగ్ కోసం ఇబంది లేకుండా స్థలాన్ని ఎంచుకోవాలి..ఎందుకంటే క్లౌడ్ కిచెన్ ఆన్లైన్ వ్యాపారం కాబట్టి బండ్లు ఎక్కువగా నిలుచు స్థలం ఉండాలి..

Cloud Kitchen కోసం కంపెనీ రిజిస్ట్రేషన్‌తోపాటు.. ఫుడ్ అండ్ హెల్త్ డిపార్ట్‌మెంట్ నుంచి fssai (ఫసాయ్) లైసెన్స్ తీసుకోవడం తప్పనిసరి. ఈ లైసెన్స్ పొందటానికి పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. Youtube లో సెర్చ్ చేస్తే.. ఈ లైసెన్స్ ఎలా పొందలో వివరిస్తూ బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. దీంతోపాటు ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలి. తర్వాత గూగుల్‌లో బిజినెస్ రిజిస్టర్ చేసుకోవాలి. వ్యాపారపరంగా ఇదెంతగానో ఉపకరిస్తుంది. తర్వాత జీఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా తీసుకోవాలి. స్విగ్గీ, జొమాటోలతో కలిసి పని చేస్తే.. ఇదేం తప్పనిసరి కాదు. కానీ ఈ డెలివరీ రంగంతో చేతులు కలపాలంటే ఫసాయ్ లైసెన్స్ కచ్చితంగా కావాలి. పోలీసుల నుంచి ఎన్వోసీ తీసుకోవడం తప్పనిసరి. కాస్త పెద్దగా ఈ బిజినెస్ చేస్తుంటే కమర్షియల్ గ్యాస్ కనెక్షన్, కమర్షియల్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కూడా అవసరం పడుతుంది..

ప్రస్తుత ట్రెండ్ ప్రకారం.. వ్యాపారం ఏదైనా సరే సోషల్ మీడియా పేజీ ఉండాల్సిందే. మీరు చేసేది ఫుడ్ బిజినెస్ కాబట్టి.. సోషల్ మీడియా ద్వారా మరింత మంది కస్టమర్లను చేరొచ్చు. కాబట్టి సోషల్ మీడియా పేజీలు, వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసుకొని అందులో మీ వంటకాలను క్రెయేటివ్గా ఫొటో తీసి పెట్టండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌, ట్విట్టర్‌లలో ఇలా వివిధ అకౌంట్ ఓపెన్ చేయాలి అన్నిటిలో వీలైనంత మార్కెటింగ్ స్ట్రాటజీ ని ఉపయోగించిచాలి. రెగ్యులర్‌గా అప్‌డేట్స్ ఇస్తుంటే.. ఆటోమెటిగ్గా మీ వ్యాపారం గురించి ప్రజలకు తెలుస్తుంది. డిజిటల్ మార్కెటింగ్ ద్వారా తక్కువ ఖర్చుతో, తక్కువ సమయంలో ఎక్కువ మందికి చేరువ చేయొచ్చు.

తర్వాత క్లౌడ్ కిచెన్ ఏర్పాటుకు అవసరమైన సామాగ్రి, ఫుడ్ కంటెయినర్లు కొనుగోలు చేయాలి. ముందుగా Cloud Kitchen కోసం ఓవెన్లు, బర్నర్లు, వంటపాత్రలు మొదలైనవి కొనుగోలు చేయాలి. లేదంటే ఇప్పటికే నడుస్తోన్న Cloud Kitchenను అద్దెకు కూడా తీసుకొని.. దాన్ని మీ అవసరాలకు అనుగుణంగా కూడా మార్చుకోవచ్చు. Cloud Kitchen ప్రారంభించే వారికి వంట చేయడంతోపాటు అకౌంటింగ్, మార్కెటింగ్, ముడి పదార్థాల కొనుగోలు తదితర విషయాలలో ప్రాథమిక అవగాహన తప్పనిసరి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top