Conocarpus : అస్సలు ఈ చెట్లని తెలంగాణ ప్రభుత్వం ఎందుకు నిషేధించింది ? కారణాలు ఇవే…
తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అనేక కార్యక్రమాలను చేపట్టారు Conocarpus…అందులో భాగంగా హరితహారం కార్యక్రమం ఒకటి…ఈ కార్యక్రమం లో భాగంగా పలు పట్టణాల్లో సుందరీకరణ కోసం రోడ్లకు ఇరువైపులా, డైవడర్ మధ్యలో కోనోకార్పస్ మెుక్కలను నాటారు. అయితే గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఈ మెుక్కలపై నిషేదం విధించింది. అసలు ఈ చెట్లను ఎందుకు నిషేధించింది ? మరి ఈ చెట్లు అంత డేంజరా? ఈ చెట్ల వల్ల వచ్చే అనర్ధాలేంటి ?
తెలంగాణ ప్రభుత్వం హరిత హారం పేరుతో మొక్కల నాటే కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది. తెలంగాణ నగరంలో పచ్చదనం పెంపొందించి.. అడవుల శాతాన్ని 24 నుంచి 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో మెుక్కలు నాటడం కార్యక్రమం చేపటింది.నగరంలో ప్రజల్ని కూడా పెద్ద ఎత్తున మొక్కలు నాటేలా ఉతేజపరిచింది . ఊరూరా పల్లె ప్రకృతి వనాలు మరియు నర్సరీలు ఏర్పాటు చేసి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి అవి సక్రమంగా ముందుకు సాగేలా ప్రోత్సహించింది. పూలు మరియు పండ్లతో పాటు కలపనిచ్చే చెట్లను రహదారులకు ఇరువైపులా నాటింది. చెట్ల వల్ల పర్యవరణానికి మరియు మనవాళికి లాభాలే తప్ప ఎలాంటి నష్టాలూ దరి చేరవు. ఐతే ఈ హరిత హారంలో భాగంగా నాటిన ఒక మొక్క మాత్రం అందరిలోనూ ఆందోళన కలిగిస్తోంది.
అందం, ఆకర్షణ, చిక్కటి పచ్చదనంతో ఉండే Conocarpus మెుక్కలను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిషేదించింది. జీహెచ్ఎంసీ పరిధితో పాటు గ్రామాల్లో అలాగే నర్సరీల్లో పెంచవద్దంటూ ఉత్తర్వులు విడుదల చేసింది. వాతావరణంలో ఏర్పడే వేడిని తగ్గిస్తుందని.. గార్డెనింగ్ అనువుగా ఉంటుందని పట్టణాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కోనోకార్పస్ మొక్కలను అధిక స్థాయిలో రోడ్లకు ఇరువైపుగా పెంచారు. అయితే ఈ చెట్ల పెంపకం ద్వారా పర్యావరణ మరియు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పర్యావరణ, వృక్షశాస్త్ర నిపుణలు చెప్తున్నారు.
ఈ చెట్లు సౌత్ అమెరికా ఖండానికి చెందిన మెుక్కగా వృక్షశాస్త్ర నిపుణలు తెలియజేసారు. ఇది తీర ప్రాంతాల్లో ఏపుగా మరియు పచ్చదనంతో కోన్ షేపులో పెరుగుతుందని వెల్లడించారు. ఈ చెట్ల వల్ల అనేక ప్రమాదం ఉందని చెప్పారు. శ్వాస సంబంధ సమస్యలు మరియు ఎలర్జీ సమస్యలు వస్తాయని వెల్లడించారు. Conocarpus వల్ల పర్యావరణ ఇంకా ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మెుక్క వేర్లు బలంగా భూమిలోపలికి చొచ్చుకెళ్లి భూగర్బ జలాలను ఎక్కువగా వాడుకొని పైపు లైన్లు, ఇతర నిర్మాణాలకు నష్టం కలిగిస్తుందని కూడా గమనించారు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఈ మెుక్కపు ఆంక్షలు, నిషేదం ప్రకటించాయి….
ఈ చెట్లు ఆకర్షణీయంగా మాత్రమే ఉంటాయని.. ఎలాంటి ఉపయోగం లేదని తెలియజేసారు. పక్షులు కూడా గూడు నిర్మించుకోలేవని వృక్షశాస్త్ర నిపుణలు స్పష్టం చేసారు. ఇరాక్ మరియు ఇరాన్ వంటి దేశాలు ఈ మెుక్కపై పరిశోధనలు చేసి ఆంక్షులు విధించారని చెప్పారు . ఈ చెట్ల వల్ల స్కిన్, ఊపిరితిత్తులు చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పారు. దగ్గు, కఫం, అలర్జీలు, ఆస్తమా వంటి మొదలైన సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కోనోకార్పస్ వల్ల దుష్ప్రభావాలు ఎక్కువగా ఉండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం ప్రకటించింది. హరితహారంలో ఈ చెట్లను నాటకూడదని అధికారులకు లిఖి తపూర్వక ఉత్తర్వులు జారీ చేసింది. అయితే చాలా ప్రాంతాలలో ఇప్పటికే ఈ చెట్లను నాటారు. ఈ నేపథ్యంలోనే కోనోకార్పస్ మొక్కలపై వృక్షశాస్త్ర నిపుణలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మొక్కలపై రాష్ట్రంలో పూర్తి స్థాయిలో నిషేధం విధించాలని వృక్షశాస్త్ర నిపుణలు మరియు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.