Types of Bank Accounts: సేవింగ్స్ మరియు కరెంట్ అకౌంట్స్ కి మధ్య తేడా ఏంటో తెలుసా..?
Types of Bank Accounts: సేవింగ్స్, కరెంట్ ఖాతాలు రెండూ కూడా డిపాజిట్లు, లావాదేవీలు చేయడం కోసం ఉపయోగిస్తాం. కానీ ఈ Accounts Management మాత్రం ఒకదానికొకటి చాలా Different గా ఉంటాయి. అందుకే రెండింటి మధ్య వ్యత్యాసాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
కొన్నిసార్లు వ్యాపారం, అందుకు సంబంధించిన Financial Payments, రసీదులు, Other Transactions చేయాల్సి ఉంటుంది. అలాంటి వారు తరచుగా బ్యాంకు ఖాతాను యాక్సెస్ చేస్తారు. అలాంటి సమయంలో సేవింగ్స్ ఖాతా ఉంటే కష్టం అవుతుంది. మరి, కరెంట్ ఖాతాలు అంటే ఏమిటి? పొదుపు ఖాతాల అంటే ఏమిటి? అవి ఎలా పని చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Savings Account అనేది Limited Transaction లను అనుమతించే డిపాజిట్ ఖాతా. అయితే కరెంట్ ఖాతా Daily Transactions కోసం క్రియేట్ చేసింది. అంటే మీరు ఏదైనా Business చేస్తే, మీకు ఈ Current Account సరిగ్గా సరిపోతుంది అన్నమాట.
నెలనెలా శాలరీ వచ్చే ఉద్యోగులు లేదా నెలవారీ ఆదాయం ఉన్నటువంటి వారికి ఈ Savings Accounts పని చేస్తాయి. ఇందులోని డబ్బులను ఎఫ్డీగా మలుచుకుంటూ కావాల్సినప్పుడు ఉపయోగించకోవచ్చు. కానీ లావాదేవీలకు లిమిట్ ఉంటుంది.
వడ్డీ ఎలా ఉంటుంది:
Types of Bank Accounts సేవింగ్స్ ఖాతా దాదాపు 4 శాతం వడ్డీని పొందుతుంది. కానీ కరెంట్ ఖాతాకు అలాంటి వడ్డీ లభించదు. కరెంట్ ఖాతా నిజానికి వడ్డీ రహిత డిపాజిట్ ఖాతా. కానీ, మన ప్రతి లావాదేవీలని ఆన్టైమ్లో చూసుకునేటువంటి వీలు ఉంటుంది. దీనికి ప్రత్యేక ఛార్జీలు ఆయా బ్యాంకులను బట్టి ఉంటుంది.
ఓవర్ డ్రాయింగ్:
Types of Bank Accounts ఒక Account నుంచి మీ వద్ద ఉన్న దానికంటే ఎక్కువ డబ్బును విత్డ్రా చేసినప్పుడు, మీ ఖాతా Overdraw అయినట్లు బ్యాంకు చెప్పుతుంది. కానీ Savings Account విషయంలో బ్యాంకులు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యాలను అందించవు. అయితే Current Account లకు ఈ ఓవర్ డ్రాయింగ్ పద్ధతి ఉంటాయి.
మినిమం అమోంట్:
Savings Account తెరవడానికి అవసరమైన Minimum Amount సాధారణంగా తక్కువగా ఉంటుంది. కానీ కరెంట్ ఖాతాలలో ఇది చాలా ఎక్కువ. అయితే అదే విధంగా కూడా వినియోగదారులకు సదుపాయాలు ఉంటాయి.