ECIL హైదరాబాద్ సంస్థలో 115 ఉద్యోగ అవకాశాలు . పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక. రూ.55,000 వరకు జీతం. ECIL Recruitment 2024.
ECIL Recruitment 2024 : Hyderabad లోని అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ కి చెందిన Electronics Corporation of India Limited (ECIL).భారీగా జాబ్ Notification విడుదల చేసింది. హైదరాబాద్‌తో పాటు పలు జోనల్ కార్యాలయాల్లో పనిచేసేందుకు ఒప్పంద ప్రాతిపదికన 115 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఇందులో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ తదితర పోస్టులున్నాయి. అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థులు Online విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. August 8న దరఖాస్తులకు చివరితేది. అభ్యర్థులు పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మరియు Apply చేసుకోవడానికి https://www.ecil.co.in/ వెబ్సైట్లో చూడవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 115
ప్రాజెక్ట్ ఇంజినీర్- 20 టెక్నికల్ ఆఫీసర్- 53 జూనియర్ టెక్నీషియన్ (గ్రేడ్-2)- 42
ఇతర ముఖ్యమైన సమాచారం :
అర్హత: సంబంధిత డిపార్ట్మెంట్ లో ITI, BE/ B.Tech ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
జీతం: నెలకు Project Engineer Post కు రూ.40,000- రూ.55,000.Technical Officer కు రూ.25,000- రూ.31,000.Junior Technician Post లకు రూ.22,528- రూ.27,258 వేతనం ఉంటుంది.
వయోపరిమితి: పోస్టును అనుసరించి ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుకు 33, టెక్నికల్ ఆఫీసర్‌కు, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, ఇంటర్వ్యూ, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: August 8, 2024.
Notification :
ecil-01-08-2024