గుడ్లు తినడం వల్ల లాభాలేంటి.? గుడ్డు మాంసాహారమా? శాకాహారమా?అసలు సైన్స్ ఏమి అంటుందేంటే..! Egg in Telugu.

గుడ్లు తినడం వల్ల లాభాలేంటి?గుడ్డుమాంసాహారమా?శాకాహారమా? అసలు సైన్స్ ఏమి అంటుందేంటే..! Egg in Telugu.

బరువు తగ్గించే ఆహారపదార్థాలు ఎక్కువగా మీ డైట్‌లో కార్బోహైడ్రేట్స్‌ని తగ్గించడంపై దృష్టిపెడుతుంది.కాబట్టి గుడ్లు పోషక విలువలకి ‘స్టోర్ హౌజ్‘ అని చెప్పొచ్చు.

Egg in Telugu: ప్రధానంగా ప్రోటీన్, ఇతర పోషకాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఒక గుడ్డులో మనకు 75 కేలరీలు, 7 గ్రాముల ప్రోటీన్, 5 గ్రాముల కొవ్వు, 1. 6 గ్రాముల సంతృప్త పరిచేటువంటి కొవ్వు, ఇనుము , విటమిన్స్, ఖనిజాలు ఉంటాయి. జీవక్రియను పెంచి, రోగ నిరోధకశక్తిని అందించడంలో ప్రోటీన్ కీ ముఖ్య పాత్రను పోషిస్తుంది. కానీ,EGGs ని మిగతా ఆహారానికి బదులుగా వీటిని తీసుకోవడం వల్ల బరువు పెరగడంతో పాటు అతిగా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కొంతమందిలో ఎక్కువ గుడ్లు తినడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.

Egg in Telugu:గుడ్డులో ఫాట్ పెర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుందని, దీనిని తినడం వల్ల హృదయానికి మంచిది కాదని అంటారు. కానీ, అందులోవాస్తవం లేదంటారు నిపుణులు. వారానికి 6 గుడ్లు తినడం వల్ల హృదయ జబ్బులు తగ్గుతాయని, కొన్ని పరివోధనల్లో తేలింది. గుడ్లలో ఎక్కువగా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ హృదయ ఆరోగ్యాన్ని కాపాడతాయి. కాబట్టి ఎటువంటి అపోహలు వద్దని చెబుతున్నారు నిపుణులు.

ముందుగా చెప్పుకున్నట్లుగా గుడ్డులో అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఎముకలు, కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మీ బాడీ బలంగా మారాలన్నా కచ్చితంగా రోజూ కోడిగుడ్డు తీసుకోవాల్సిందే. గుడ్డులో ఉండేటువంటి పొటాషియం, కాల్షియం, ఐరన్‌లు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల రక్తహీనత సమస్య దూరమవుతుంది.

కోడిగుడ్డులో ఉండేటువంటి పచ్చసొనలో క్యాలరీలు, ప్రోటీన్స్, విటమిన్ B6, విటమిన్ K ఇలాంటి అనేకమైన పోషకాలు ఉన్నాయి. కోడిగుడ్డులో సెలీనియం ఉంటుంది. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ శక్తి పెరుగుతుంది. ఈ కారణంగా బాడీ హెల్త్ గా ఉండడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకి కూడా దూరంగా ఉండొచ్చు.

ఇందులోని ప్రత్యేక గుణాలు మెదడుని చురుకుగా ఉంచుతాయి. అందుకే చదివే పిల్లలకి రోజూ ఒక గుడ్డు తినిపించడం మంచిది. ఓన్లీ పిల్లలకే కాదు, మెదడు కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు పెద్ద వాళ్ళు కూడా తినాలి. ముఖ్యంగా గర్భిణీలు రోజూ గుడ్లు తింటే తల్లి, బిడ్డ ఆరోగ్యం మెరుగ్గా ఉండేలా చేస్తుంది.

పచ్చసొన అదికంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీని ప్రకారం నిపుణులు. రోజుకి రెండు గుడ్లు సరిపోతాయని చెబుతున్నారు.

Egg in Telugu: మరికొంతమంది పోషకాహార నిపుణులు పరిశోధనలు చేసి , మనం తీసుకునే ఆహారాన్ని3 భాగాలుగా విభజిస్తే, ఒకసారి చేసే భోజనంలో గుడ్లు, మరోసారి చేసే, భోజనంలో లీన్ మీట్, మూడోవసారి చేసే భోజనంలో శాకాహార ప్రోటీన్ తీసుకోవడం ఉత్తమం అని చెబుతన్నారు. అందుకే ప్రతి సారి ఆహారం తీసుకునేటప్పుడు గుడ్లును చేర్చడం సరైంది కాకపోవచ్చని వారు చెబుతున్నారు. బచ్చలికూర, అవకాడో, పుట్టగొడుగులు, పచ్చి బఠానీలు ఇలాంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.

అయితే, మంచిది కదా అని ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే ఏ ఆహారమైనా సరే , ఔషధంలా కాకుండా విషంలా మారుతుంది. కాబట్టి జాగ్రత్తగా సరైన మోతాదులో తీసుకోవాలి. అంతే కాకుండా,ముఖ్యంగా EGGS తినే విషయంలో ముందుగా వైద్యులని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. మీ ఆరోగ్యం, మీ వయసుని బట్టి ఎన్ని గుడ్లు తింటే, మంచిదో వైద్యులని అడిగి తెలుసుకోని తినడం మంచిది.

Egg in Telugu: ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు గుడ్డులో పుష్కలంగా ఉంటాయి. మాంసకృత్తులు, తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు, B కాంప్లెక్స్‌ విటమిన్లు, D విటమిన్‌, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి.అయితే గుడ్డు అనేది శాఖాహారమా లేక మాంసాహారమా అనే డౌట్ మాత్రం ప్రతి ఒక్కరిలోను ఉంది. అయితే , సైన్స్‌లో శాకాహార ఆహారానికి నిర్ధిష్ట నిర్వచనం ఉంది. జంతు మాంసం లేని ఆహారాన్ని శాఖాహారం అని అంటారు. ఈ కోణంలో చూస్తే, మాత్రం గుడ్డును శాఖాహారంగానే పరిగణించాలి. ఇలాంటి ఆహారం తీసుకునే వ్యక్తులను ఓవో-వెజిటేరియన్స్‌ అంటారు.

సైన్స్‌ను పక్కనపెట్టినట్లయితే,భారతీయులు మాత్రం గుడ్డును మాంసాహారంగానే పరిగణిస్తారు. అందుకే శాఖాహారులు వీటిని తినరు. సైన్స్ కోణం పరంగా చూస్తే, గుడ్లు రెండు రకాలు. ఫలదీకరణం గుడ్లు, ఫలదీకరణం చేయని గుడ్లు. మొదటి రకం గుడ్డులోంచి కోడి పిల్ల బయటకు వస్తుంది. ఇక రెండో రకం గుడ్డు కేవలం ఆహారం కోసం ఉపయోగించేటువంటి గుడ్లు.అంటే వీటి నుండి కోడి పల్లలు రావు.అని అర్థం.

కోడి పెట్ట మరియు కోడి పుంజుల యొక్క పునరుత్పత్తి చర్య జరపడం వల్ల పెట్టినటువంటి కోడి గుడ్డును ఫలదీకరణ గుడ్డు అంటారు. కోడి పుంజు యొక్క సహకారంలేకుండా పెట్టిన గుడ్డును ఫలదీకరణం చేయని గుడ్డు అంటారు. గుడ్ల లోపల కోడి పిల్లలు డెవలప్ చెందనటువంటి గుడ్లను కోళ్ల ఫారంలలో సేద్యం చేస్తారు. ఇటువంటి గుడ్డను శాఖాహారంగా పరిగణించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

అయితే కొన్ని గుడ్లలో అప్పుడప్పుడు రక్తపు చుక్కలు కనిపిస్తాయి. సైన్స్ భాషలో దీనిని మీట్ స్పాట్ అంటారు. గుడ్డు ఫలదీకరణం చెందిందని దీని అర్థం కాదు. కోడి శరీరంలో గుడ్డు తయారవుతున్నప్పుడు రక్తనాళాలు దెబ్బతింటాయి. దాని ఎఫెక్ట్ వల్లనే గుడ్డులో బ్లడ్ డ్రాప్స్ కనిపిస్తాయి.

Egg in Telugu: సైన్స్ ప్రకారం నుండి చూస్తే,మాత్రం కోడి గుడ్డు పెట్టినంత మాత్రాన అది మాంసాహారం కాదు. జంతువుల నుంచి వచ్చే ప్రతిదీ మాంసాహారంగా పరిగణించకూడదు. దీనికి మరో మంచి ఉదాహరణ పాలు. గుడ్డు అనేది మాంసాహారమైతే, మరి పాలు కూడా గేదెల నుంచి వస్తాయి కదా! అప్పుడు పాలను కూడా మాంసాహారంగానే పరిగణించాలి.కదా..! అలా ఎందుకు పరిగణించము.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీరు Egg in Telugu ని ఎక్కువగా తినేవారు మాత్రం కచ్చితంగా వైద్యుల సలహా తీసుకొని , వాడడం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top