Gavvalu in Telugu : ఇవి మీ ఇంట్లో ఉంటే, అదృష్టం మీ వెంటే..! Kaudi Shells.
Gavvalu in Telugu : హిందూ సంప్రదాయంలో గవ్వలను పూజించే ఆచారం ఎంతో కాలంగా వస్తుంది. వీటి వల్ల సంపద పెరుగుతుందని అంటారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో, అసలు గవ్వలకు నిజంగానే అంత మహిమ ఉందా…?
Gavvalu in Telugu : సముద్రంలో సహజ సిద్ధంగా లభించేటువంటి వాటిల్లో గవ్వలు, శంఖాలు, ఆల్చిప్పలు ఇలా అనేక రకాలు ఉన్నాయి. అయితే,గవ్వలకు, శంఖాలకు హిందూ సాంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది.గవ్వలను సాక్షాత్తు, లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. అందుకనే మన ఇంట్లో పెద్దలు ఉంటే , సాయంత్రం ఆరు గంటల సమయంలో గవ్వలను ఆడనివ్వరు.ఆ శబ్దం ఆ సమయంలో వినిపించరాదని, అంతేకాదు,ఇప్పటికీ కొన్ని ఏరియాలలో పురాతన కాలం నుంచి వస్తున్న ఆనవాయితీని పాటిస్తూ, దీపావళి రోజున గవ్వలను ఆడుతూ,ఉంటారు. కొన్ని కంట్రీస్ లలో గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా కూడా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది.
Kaudi Shells : సముద్రంలో జన్మించిన లక్ష్మీదేవికి ఈ గవ్వలు చెల్లెల్లు అని, శంఖాలు సోదరులనీ భావిస్తుంటారు. గవ్వల గలగల శబ్దం వినడం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని విశ్వాసం. అయితే ఈ గవ్వలతో లక్ష్మీదేవికే కాదు శివునికి కూడా ప్రత్యేకమైన సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో ఈ గవ్వలుకూడ ఉంటాయి. పరమ శివుని జటాజూటంలోను మరియు ఆయన వాహనమైన నందీశ్వరుని మెడలోనూ కూడా ఈ గవ్వలే అందమైన ఆభరణాలుగా అలంకరించబడి ఉంటాయి. ఈ గవ్వలు పిల్లలు ఆదుకునే, అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను మరియు తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతాయి.కనుక మన హిందూ సంప్రదయంలో గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో చాలా సంబందాలు ఉన్నాయి అనేది నిజం.
మనకు అదృష్టం కలిసి రావాలంటే, ఇంట్లో గవ్వలను పెట్టుకుని పూజించాలని చెప్తుంటారు. సముద్రం యొక్క ఒడ్డున సహజంగా లభించే ఈ గవ్వలకు నిజంగానే అన్ని శక్తులు ఉన్నాయా, అనే సందేహం అందరిలోనూ ఉంటుంది. గవ్వలను పూజగదిలో ఉంచడంతో పాటు, ఇంటి గుమ్మాలకు అలంకరణలుగా వాడటం, డబ్బులు పెట్టుకునే ,పర్సుల్లో ఉంచుకోవడం వంటివి చేస్తుంటారు. అయితే, వీటి గురించి మన భారతీయ హిందూ సంప్రదాయంతో పాటుగా, Feng Shui అనే చైనా శాస్త్రంలోనూ కూడా అనేక Interesting విషయాలను కూడా చెప్పారు.
Gavvalu in Telugu : గవ్వలను సాక్షాత్తు లక్ష్మీ దేవి స్వరూపంగా భావిస్తుంటారు. కాబట్టి ఇలాంటి గవ్వలను గృహంలో ఉంచుకోవడం ద్వారా ధనాన్ని ఆకర్షిస్తాయని కొందరు చెప్తారు. డబ్బును నిల్వచేసే బీరువాలలో, లాకర్లు మరియు వ్యాపారాలు చేసే చోటు.ఇలా అనేక చోట్ల వీటిని తెచ్చి పెట్టుకుంటారు.
Gavvalu in Telugu : ఎక్కడైతే వీటిని పూజిస్తారో అక్కడ లక్ష్మీ దేవి కొలువై ఉంటుందనేది కొందరి నమ్మిక. అయితే, ఈ గవ్వలను కన్నులు ఉన్న ముఖం వైపును డబ్బులకు తగిలేలా ఉంచుకోవాలని, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇక Feng Shui నియమాల ప్రకారం.. వీటిని ఎక్కడ ఉంచితే , అక్కడ అదృష్టం వచ్చి ఉంటుందని, చెప్తారు. అందుకే అక్కడి బీచుల్లో ఈ గవ్వలను విరివిగా అమ్ముతుంటారు. వీటిలో ఎన్నో రకాల గవ్వలు ఉంటాయి. అయితే, పసుపు రంగులో ఉండేవి అన్నింటిలోనూ శ్రేష్ఠమైనవిగా చెప్తారు. ఇక మార్కెట్లో కొన్ని రకాల నకిలీ అంటే Plastic గవ్వలు కూడా లభ్యమవుతున్నాయి. కాబట్టి వీటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వివాహం కానీ యువతీ యువకులు గవ్వలను వారి దగ్గర ఉంచుకోవడం వల్ల అతి త్వరగా వివాహ ప్రాప్తి కలుగుతుందని పెద్దలు చెప్పే మాట. అంతేకాదు ఉద్యోగాలకు సంబంధించిన ఇంటర్వ్యూలు, ముఖ్యమైన పనుల కోసం బయటకు వెళ్లేవారు కూడా గవ్వలను దగ్గర ఉంచుకోని వెళ్తే, మంచి జరుగుతుందని నమ్మిక. పిల్లలకి దృష్టి దోష నివారణకు గవ్వలను వారికి మెడలో కడతారు. కొత్తగా కొన్న వాహానాలకు నల్ల దారంతో గవ్వలని కట్టి దృష్టి దోషం లేకుండా చేసే, ఆనవాయితీ,ఈ ఆధునిక కాలంలో కూడా కొనసాగుతుంది.
Gavvalu in Telugu : కొత్తగా ఇంటి నిర్మించే,టైం లో ఎటువంటి అడ్డంకులు రాకుండా ఉండడానికి ఈ గవ్వలను ఇంట్లో ఎక్కడో ఒకచోట కడుతుంటారు. ఇక కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే, వారు గుమ్మానికి తప్పనిసరిగా ఒక తెల్లని గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అని పెద్దల నమ్మిక.
గవ్వలని పసుపు రంగు వస్త్రంలో పూజ గదిలో లో ఉంచి, లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే, ధనాకర్షణ కలుగుతుంది. డబ్బులు దాచే, పెట్టెలో గవ్వలను డబ్బులుకు తగులుతూ ఉంచటం వలన కూడా ధనాభివృద్ధి కలుగుతుందని నమ్మిక. పెళ్లి సమయములలో వదూవరుల యొక్క ఇద్దరి చేతికి ఈ గవ్వలు కడితే, ఎటువంటి నర దృష్టి వారిపై పడకుండా కాపురం చక్కగా సాగుతుంది. పూర్వకాలంలో మంత్రికే తాంత్రిక విద్య సమయంలో,వశీకరణ మంత్ర పఠన సమయంలోను ఈ గవ్వలను వారి చేతిలో ఉంచుకునేవారని పలు కథనాల ద్వారా తెలుస్తోంది. గవ్వల గలగలలు ఉన్న చోట లక్ష్మీదేవి స్థిర నివాసంగా ఉంటుంది.