ఇందులోని ఈ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే..అస్సలు దీన్ని వదిలిపెట్టరు ! Vankaya in Telugu.
Gutti Vankaya in Telugu గుత్తి వంకాయ కూరను ఇష్టపడిన వ్యక్తులంటూ ఎవరుంటారు చెప్పండి. మంచి మసాలాను వంకాయలు దట్టించి, నూనెలో వేయించి, కాడతో సహా తింటుంటే, చూడు ఆ రుచి భలే మజాగా ఉంటుంది కదా.. చెప్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతుంటాయి కదా.. అంతటి రుచికరమైంది మరి Vankaya..తాజా కూరలలో రాజా ఎవరంటే, వంకాయ నే కదా! మరి. ఇంత రుచికరమైన వంకాయను తినకుండా ఉండమంటే, ఎవరికీ నచ్చదు. కానీ కొందరు వంకాయ కూర తింటే, లేని పోనీ ఆరోగ్య సమస్యలు వస్తాయని , వంకాయను తినేందుకు వెనకాడతారు.
Brinjal in Telugu : ఎందుకంటే, అందరికీ వంకాయ పడదు. స్కిన్ అలర్జీలతో బాధపడేవారు వంకాయలను దూరంగా ఉండటమే మంచిది. అలాంటప్పుడు వంకాయను ఎలా ఆరోగ్యకరమైన కాయగూర అంటారనేగా మీ సందేహం కదా. ఎందుకంటే.. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఆ ఒక్క కారణం తప్పా.. మిగతా విషయాల్లో వంకాయ చాలా ఉత్తమమైనది.అదేపనిగా కాకుండా వారానికి ఒకసారి ఈ వంకాయ కూరను ఆహారంతో కలిపి తీసుకోవచ్చు.పెద్ద ఆరోగ్య సమస్యలు ఏమి రావనే చెప్తున్నారు. నిపుణులు.
Vankaya in Telugu మనం తినే కూరగాయలన్నింటిలో లెక్కలేనన్ని పోషకాలు ఉంటాయి. ప్రతి దాని యొక్క స్వయం ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కొంతమంది మాత్రం తరచుగా వీటిని పక్కన పెట్టేస్తారు.ఇవి మనకి వద్దు అని పెద్దవాళ్లని, చిన్నవాళ్లకి చెప్పి పక్కన పెట్టమానడం ఆనవాయితీగా అయిపొయింది. కానీ మన ఇలా చేయడమే అతి పెద్ద తప్పు. ఎందుకంటే,వంకాయలో ఫైటోన్యూట్రియెంట్స్, విటమిన్ c, ఫైబర్ వంటి ఎన్నో లెక్కలేని పోషకాలు దాగి ఉన్నాయి. ఇది మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఇది మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుందో ఇక్కడ తెలుసుకుందాం.
ఆరోగ్య ప్రయోజనాలివే :
❂ టైప్-2 రకం మధుమేహం ఉన్న రోగులకు రక్తంలోని చక్కెర్ల (గ్లోకోజ్) స్థాయిని తగ్గించడంలో ఈ వంకాయ బాగా పనిచేస్తుంది.
❂ Vankaya లో పిండి పదార్థాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి.
❂ వంకాయలోని పొటాషియం శరీరంలోని హైడ్రైట్లను తొలగించి హృదయ సమస్యలను నివారిస్తుంది.
❂ వంకాయ శరీరంలో కొవ్వులను కరిగిస్తుంది.
❂ రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
❂ వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B3, B6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు ఇతర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
❂ వంకాయ శరీరంలోని అదనపు ఐరన్‌ను తొలగిస్తుంది.
❂ వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.
❂ వంకాయ శరీరంలోని విషతుల్యాలను, వ్యర్థాలను తొలగిస్తుంది.
❂ శరీరానికి అందే కెలోరీలను బర్న్ చేసి బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
❂ వంకాయ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
❂ ఆస్తమా, ఉబ్బుసం, మలబద్ధకం, పేగు సంబంధిత సమస్యలు, పుండ్లు, పెద్ద పేగు క్యానర్సన్లు తగ్గించడంలో కీలకంగా పనిచేస్తుంది.
❂ ఈ వంకాయ మన శరీరానికి పడితే చర్మంపై ముడతలు లేకుండా యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా బాగా పనిచేస్తుంది.
❂ జుట్టు బలోపేతం కావడానికి వంకాయ చాలా బాగా సహకరిస్తుంది. జుట్టు ఎదుగుదలకు అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది.
❂ మలేరియా వ్యాధితో బాధపడుతున్న వారికి కాల్చిన వంకాయకు కొంచెం చక్కర పట్టించి ఇవ్వాలంటారు.
❂ నిద్రలేమి సమస్యతో బాధపడేవారు పడుకోడానికి దాదాపు నాలుగు గంటల ముందు కాల్చిన వంకాయని తినడం మంచి మార్గం.
❂ వంకాయ గుత్తి మూలశంక (పైల్స్), హేమరాయిడ్స్ నివారణ వైద్యంలో ఉపయోగిస్తారు.
❂ కీళ్ల నొప్పుల నుంచి ఉపశాంతి కోసం వంకాయను దంచి కట్టుల్లో కూడా వాడతారు.
❂ వంకాయ శరీర వాసనను నివారిస్తుంది.
❂ Vankaya in Teluguలో ఉండేటువంటి ఫైబర్ శరీరంలోని విషాన్ని, రసాయనాలను గ్రహించి పెద్ద పేగు క్యాన్సర్ నుంచి కాపాడుతుంది.
❂ శరీరంలోని కణాలు.క్యాన్సర్ కారకమయ్యే గడ్డలుగా ఏర్పడకుండా ఈ వంకాయ కాపాడుతుంది.
❂ వంకాయలో సోడియం తక్కువ. కాబట్టి.. బీపీ సమస్యతో బాధపడేవారు తినొచ్చు.
❂ పంటి సమస్యలను నివారిస్తుంది.
❂ వంకాయలోని ఫైటో-న్యూట్రీషియన్స్ మన మెదడు పనితీరును పెంచడమే కాకుండా కణ త్వచాలను సురక్షితంగా ఉంచడమే కాకుండా మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉండటానికి సహాయపడతాయి.
❂ వంకాయలో ఐరన్ ,క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. వీటిని రోజూ తింటే ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది.
❂ వంకాయలో యాంటీఆక్సిడెంట్లు ,మాంగనీస్ పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్లు అనేక సమస్యల బారిన పడకుండా కణాలను రక్షిస్తాయి. Vankaya in Telugu ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. అదేవిధంగా మీ శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్‌ను సంతులనం చేయడం ద్వారా మొదటి అవయవాలు రక్షించబడతాయని నిర్ధారిస్తుంది. Vankaya in Telugu ముఖ్యంగా క్యాన్సర్ కణాల నుండి మనల్ని రక్షించబడుతుందని నిర్ధారిస్తుంది.
❂ వంకాయలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. అలాగే మనం రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి పెరుగుతుంది. ఇది శరీరాన్ని అలసట లేకుండా ఉంచడంలో సహాయపడుతుంది.
గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు సేకరించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఈ వంకాయను ఎక్కువగా తినేవారు వైద్యుల సలహా మేరకు తినడం ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.