Bike Mileage Tips: చిన్న పొరపాటే,అని అనుకుంటే,మీ బైక్ పెట్రోల్‌ను వాటర్ లాగా తాగేస్తుంది..!అయితే,ఇలా చేయండి.!!
బైక్ నడిపే వారు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. లేదంటే మాత్రం పెట్రోల్ ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. బైక్ మైలేజ్ రావాలంటే ఏం చేయాలో అనుభవజ్ఞులైన మెకానిక్ లు చెప్పిన కొన్ని చిట్కాలేంటో తెలుసుకుందాం.
Bike Mileage Tips మామూలుగా ద్విచక్ర వాహనాలు ప్రతి ఇంటిలో ప్రతి ఒక వ్యక్తికి నిత్యవసర వస్తువుగా మారాయి ఈ బైక్స్.అయితే మంచి మైలేజ్ రావాలి అంటే ఏం చేయాలి? 1 లీటర్ పెట్రోల్ పోయించుకుంటే, కొన్ని కిలోమీటర్ల అయినా రావడం లేదు అని, కొందరు ద్విచక్ర వాహనాన్ని నడిపేవారు చెబుతున్నారు.
మరి మంచి మైలేజ్ రావాలంటే ఏం చేయాలి? ద్విచక్ర వాహనాన్ని ఎలా ఉపయోగించాలి? చాలా సంవత్సరాలు అనుభవం కలిగిన ద్విచక్ర వాహనాల మెకానిక్‌లు చెప్పిన సలహాలు మరియు సూచనలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
Bike Mileage Tips ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ప్రతి వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని తన జీవన విధానంలో అది కూడా ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది. లేబర్ పని చేసే వ్యక్తి నుండి పెద్ద ఉద్యోగము చేసే, వ్యక్తి వరకు ఈ ద్విచక్ర వాహనాన్ని వాడుతున్నారు.టైంకి తమ తమ పనుల వద్దకు చేరుకోవాలంటే, ద్విచక్ర వాహనం ఎంతో అవసరం. Private Employees, టీచర్స్, పోలీసులు, మహిళలు, కార్మికులు పలు వర్గాల ప్రజలు ఎక్కువగా ద్విచక్ర వాహనాలను వాడుతున్నారు.
అయితే ద్విచక్ర వాహనాన్ని వాడడమే కాకుండా ఎలా వాడాలి? ఏ విధంగా వాడాలి? అనేది చాలా మందికి తెలియదు. కచ్చితంగా ప్రతి 2,000 కిలోమీటర్లకు ఇంజిన్ ఆయిల్ మార్చుకోవాలి. ముందుగా Black Smoke రాకుండా ఎయిర్ ఫిల్టర్ ను పదే పదే పరిశీలించుకోవాలి. క్లచ్, బ్రేకులు, టైర్లు చెక్ చేసుకోవాలి. Engine Oil ను కూడా తరచుగా పరిశీలించి, మార్చుకోవాలని, ప్రతి సారి టైర్లలో గాలిని కూడా చెక్ చేయాలని, టైర్‌లో సరిపడ గాలి ఉంచుకోవాలని కూడా తెలిపారు.
ఎక్కువగా హాఫ్ క్లచ్‌పై బండి నడిపితే, బైక్ యొక్క మైలేజ్ తగ్గుతుందని, అతివేగంతో వెళ్లిన మైలేజ్ తగ్గుతుందని చాలా వరకు 45,50 స్పీడ్ తో బైక్ నడిపితే మైలేజ్ బాగా వస్తుందని అనుభవజ్ఞులైన మెకానిక్ లు తెలియజేయడం జరిగింది.
గమనిక : కాబట్టి ద్విచక్ర వాహనాలని నడిపే,వారు తమ బైక్ లు ఎక్కువ కాలం మైలేజ్ రావాలంటే, పైన చెప్పిన టిప్స్ ని ఫాలో అవ్వండి.