Rose Water for Face : కాంతి వంతమైన చర్మానికి రోజ్ వాటర్ ఒక్కటే మేలు..!
Rose Water for Face : అందంగా మెరిసిపోవాలని ప్రతి ఒక ఆడవారు తాపత్రయ పడుతుంటారు. అలాంటి మహిళా కోసం రకరకాల బ్యూటీకి సమందించిన ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి వాడటం వల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా వున్నాయి.ఐతే ఆ ప్రొడక్ట్స్ అన్నిటిని తలదనేలా ఈ రోజ్ వాటర్, ముఖ్యంగా ముఖ అందాన్ని రెట్టింపు చేయడంలో రోజ్ వాటర్ ఎంతగానో సహాయపడుతుంది.ఈ రోజ్ వాటర్‌లో చర్మ సౌందర్య నాణ్యతను పెంచే సామర్థ్యం అధికంగా ఉంటుంది.
గులాబీ రేకుల నుంచి తయారు చేసిన రోజ్ వాటర్ సహజ సౌందర్యాన్ని పెంపొందించి చర్మం మరింత యవ్వనంగా, ప్రకాశవంతంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. మార్కెట్లో దొరికే అనేక రకాల సౌందర్య ప్రొడక్ట్స్ సాధనాలు, సుగంధ ద్రవ్యాల్లోనూ రోజ్ వాటర్ ను ఉపయోగిస్తారు. హైడ్రేటింగ్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఇది కలిగి ఉండటం వల్ల చర్మంపై దద్దుర్లు వంటివి రాకుండా చేయడంలో ఈ రోజ్ వాటర్ సహాయపడుతుంది.
మంచి స్మెల్ ని కలిగి ఉండే ఈ రోజ్‌వాటర్ ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి వాటిని కూడా దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మానసిక స్థితిని కూడా మెరుగు పరుస్తుంది అని కొందరు నిపుణులు తేల్చారు.2 చుక్కల రోజ్‌వాటర్ మీ వంటకాలకు, పానీయాలకు కూడా చక్కటి రుచిని అందిస్తుంది. ముఖ్యంగా స్వీట్లు రిఫ్రెషింగ్ డ్రింక్‌లో ఇది వాడితే వాటికి మంచి రుచి, స్మెల్ వస్తాయి. Rose Water for Face తో చర్మానికి కలిగే అద్భుత ప్రయోజనాలను గురించి ఇప్పుడు తెలుసుకోండి.
పీహెచ్ లెవెల్ బ్యాలెన్స్ :
రోజ్ వాటర్ మోకానికి సహజమైన టోనర్ లాగా పనిచేస్తుంది. చర్మ రక్షణకు ఉపయోగపడే పీహెచ్ సమతుల్యతను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుంది. చర్మంపై ఉన్న మొటిమలను తగ్గించి మృదువైన చర్మాన్ని మంచి రంగుని అందిస్తుంది. ముఖం పైన ఉండే బాక్టీరియా ని కూడా ఇది తొలగిస్తుంది..
దురద, వాపు సమస్యలు :
కొన్నిసార్లు మన అనేక కారణాల వల్ల వచ్చే చర్మంపై మరియు దురద వంటి సమస్యలను వాటిని తగ్గించే లక్షణాలు రోజ్ వాటర్ లో ఎక్కువగా ఉంటాయి. ఇవి చర్మాన్ని సున్నితంగా మార్చి దురద సమయస్య నుంచి దూరం చేస్తాయి. ముఖ్యంగా పింపుల్స్ , తామర వంటివి వచ్చినప్పుడు కలిగే ఎరుపు దురద మరియు వాపులను కూడా ఇవి నయం చేస్తుంది.
వృద్ధాప్య లక్షణాలకు…
Rose Water for Face సహజమైన యాంటీ ఏజెంట్‌గా పనిచేస్తుంది. అకాల వృద్ధాప్యానికి కారణమయ్యే ఫ్రీరాడికల్స్ తో ఈ రోజ్ వాటర్ లో ఉండే యాంటియోక్సిడెంట్స్ పోరాడుతాయి కాబట్టి చర్మ సౌందర్యం ఎప్పుడు మృదువుగా ఉంటుంది. అంతే కాకుండా ఒత్తిడిని తగ్గించి ముఖంపై గీతలు, ముడతలు, మచ్చలు వంటివి రాకుండా చేయడంలో సహాయపడుతుంది.ఈ రోజు వాటర్ ని మీరు ఉపయోగించడం వల్ల అందమైన మరియు కాంతి వంతమైన చర్మాన్ని పొందవచ్చు.