Kidney Good Health Food : మీ కిడ్నీల ఆరోగ్యం బాగుండాలంటే,వీటిని తప్పక తినాల్సిందే..!
Kidney Good Health Food : మన శరీరంలో మూత్రపిండాలు కీలకమైన పాత్రను పోషిస్తాయి. శరీరంలోని వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇవి శరీరంలోని ద్రవాలను, రసాయనాలను సమతుల్యం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి సరిగ్గా పనిచేయకపోతే, బయటకు పోవాల్సిన మలినాలు రక్తంలో చేరడంతో, మనకు అనేక రకాల రోగాలు వస్తాయి. అందుకే వీటిని ఎప్పుడు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్స్ ను తీసుకోవాలి. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఐదు రకాల కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్ వివరాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
కాలీఫ్లవర్ :
కిడ్నీ ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కానీ, కిడ్నీ సమస్యలను నివారించడంలో గాని క్యాలీఫ్లవర్ ఒక్క మంచి ఫుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది శరీరంలోనే టాక్సిన్స్ ను బయటకు పంపించేయడానికి ఎంతో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ మూత్రపిండాల అధిక పోటును నియంత్రించే హార్మోన్లను ఉత్పత్తి చేయడానికి సహాయపడే వివిధ పోషకాలను అందిస్తుంది. కాలిఫ్లవర్ లో కార్బోహైడ్రేట్స్, ఫెర్రస్ రకాల మూలకాలు ఉన్నాయి.
Kidney Good Health Food : ఇంకా వీటిలో Vitamins A, B, C మరియు అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, భాస్వరం మరియు ప్రోటీన్లతో పాటు కొద్ది మొత్తంలో కాపర్ కూడా ఉంటుంది. క్యాలీఫ్లవర్ కిడ్నీ జబ్బులతో పాటు మధుమేహం, హృదయ జబ్బులు, ఇన్ఫెక్షన్స్ మరియు అధిక బరువు, శరీరంలో వాపు వంటి ఆరోగ్య సమస్యలను కూడా నివారిస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. కాలిఫ్లవర్ లో ఉండే విటమిన్ సి పోలేట్, ఫైబర్ కిడ్నీ ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి. అలాగే ఈ క్యాలీఫ్లవర్ ను కిడ్నీ సమస్యలకు ఒక న్యాచురల్ రెమెడీగా పేర్కొంటారు.
బెండకాయ:
దీనిని ఇంగ్లీషులో లేడీస్ ఫింగర్ అని అంటారు. ఇందులో ఫైబర్ తో యూక్లినా అనే మూలకం ఉంటుంది. ఇది మూత్రపిండాలను శుభ్రపరిచేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పార్టీ అనే పోషకం శరీరంలోని అదన తొలగించడంలో సహాయపడుతుంది.
పొట్లకాయ:
Kidney Good Health Food : ఇది మంచి నీటి వనరు. ఇందులో 96% నీరు ఉండడం వల్ల, డీహైడ్రేషన్ సమస్య నుండి కాపాడుతుంది. దీని లోపల కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు, ఫైబర్, మెగ్నీషియం, క్యాల్షియం, కాపర్, ఇనుము, ఫాస్ఫరస్, సల్ఫర్, విటమిన్ బి మరియు విటమిన్ సి వంటి అనేక పోషకాలు అందుబాటులో ఉంటాయి. దీని ఔషధ గుణాల కారణంగా, పొట్లకాయ అనేక వ్యాధుల నుండి రక్షిస్తుంది.కిడ్నీ వ్యాధితో బాధపడేవారు దీనిని తినడం వలన ఇందులో ఉండే పాస్పరస్ కిడ్నీ బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది.
రెడ్ క్యాప్సికం:
కిడ్నీ వ్యాధికి రెడ్ క్యాప్సికం కూడా మంచి ఔషధం. ఇందులో లైకోపీన్ ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్ లో మూత్రపిండాల వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఇందులో విటమిన్ సి మరియు విటమిన్ ఏ అలాగే విటమిన్ b6, పోలిక్ యాసిడ్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులను తగ్గించడంతో పాటు, రెడ్ క్యాప్సికం హృదయ సమస్యలు, కంటి శుక్లాలను నయం చేయడానికి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.
నీరు :
Kidney Good Health Food : ఇది ఆహారం కాకపోయినా, కిడ్నీలో ఆరోగ్యంగా ఉండాలన్న, అవి సరిగ్గా పని చేయాలన్నా, సరిగ్గా నీరు త్రాగాలి. సింపుల్ గా చెప్పాలంటే, మహిళలు అయితే రోజుకు 8 గ్లాసులు, పురుషులు అయితే రోజుకు 13 గ్లాసుల నీరు తాగాల్సి ఉంటుంది. నీరు త్రాగపోవటం వల్ల వచ్చే డిహైడ్రేషన్ తో కిడ్నీ ఫెయిల్ ఫెయిల్యూర్ కి కారణం అవుతుంది. కిడ్నీల సమస్యలకు కారణమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కిడ్నీ ఆరోగ్యానికి మీరు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు.
ఆపిల్ పండ్లు:
Kidney Good Health Food : ఈ ఆపిల్ పండ్లలో కిడ్నీకి హాని కలిగించే సోడియం, పొటాషియం మరియు పాస్ఫరస్ చాలా తక్కువగా ఉంటాయి. అందుకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఆపిల్ పండును తినాలి. ఇవి కిడ్నీలో బ్యాక్టీరియా పెరగకుండా నియంత్రిస్తాయి. వీటిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ లక్షణాలు కిడ్నీ సమస్యలను తగ్గిస్తాయి. ఇంకా ఆపిల్ పండులో ఉండే విటమిన్లు, ఫైబర్, మినరల్స్ వంటి మంచి పోషకాలు శరీరానికి అందిస్తాయి. ఈ కారణాల వల్ల కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఆపిల్స్ తినడం మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కేల్ :
ఇది ఆకుకూరల్లో ఒక రకం లాంటిది. ఈ ఖేల్ కూర తక్కువ పొటాషియం ఉన్న ఫుడ్ అవ్వటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్న కూడా తినవచ్చు. దింట్లో ఉండే Vitamin A, Vitamin C మరియు కాల్షియం తో సహా ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉండడం వలన కిడ్నీ మెరుగ్గా పనిచేయటంలో దోహదపడతాయి. అలాగే కిడ్నీ సమస్యలకు ముఖ్య కారణం మధుమేహం. ఈ ఆకు కూర షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాయపడి మధుమేహంపై ప్రభావం చూపుతుంది.
ముల్లంగి :
Kidney Good Health Food : ముల్లంగి అనేది ఒక మంచి డిటాక్స్ ఫుడ్. ముల్లంగిలో తక్కువగా పొటాషియం, ఫాస్ఫరస్ ఉండడం వల్ల ఇది మంచి కిడ్నీ ఫ్రెండ్లీ ఫుడ్ అవుతుంది. ముల్లంగిలో ఇండోల్-3-కార్బినాల్ మరియు 4-మిథైల్థియో, 3-బ్యూటే నిల్-ఐసోథియోసైనెట్ ఉండడం వల్ల శరీరంలోని మలినాలను బయటకు పంపించడానికి అలాగే కిడ్నీ సరిగ్గా పనిచేయడానికి బాగా సహాయ పడగలదు. పచ్చి ముల్లంగి కంటే, ఉడకబెట్టిన ముల్లంగి లోనే తక్కువ పొటాషియం ఉంటుంది. కాబట్టి ఈ ముల్లంగిని ఉడకబెట్టుకొని,కర్రిలా చేసుకొని , తింటేనే కిడ్నీ హెల్త్ కి చాలా మంచిది.
గమనిక: ఈ పైన తెలిపిన సమాచారం అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు ఎవరైనా వీటిని అతిగా తినాలి అనుకునేవారు వైద్యుల సలహా తీసుకొని పాటించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.