Kitchen Tips in Telugu : నేటి వనితల కోసం ఆనాటి మహిళలు చెప్పిన కొన్ని ఈజీ టిప్స్..! ఇలా చేస్తే.., అరగంట పట్టే పని కూడా క్షణాల్లో కంప్లీట్..!2024.

Kitchen Tips in Telugu: నేటి వనితల కోసం ఆనాటి మహిళలు చెప్పిన కొన్ని ఈజీ టిప్స్..! ఇలా చేస్తే.., అరగంట పట్టే పని కూడా క్షణాల్లో కంప్లీట్..!2024.

Kitchen Tips in Telugu: వంటంటే ఇష్టం ఉండే వాళ్లు చాలా మంది ఉంటారు. వంటనే వృత్తిగా ఎన్నుకునేవాళ్లు కూడా అనేకమందే. రోజూ కంప్యూటర్లతో కుస్తీ పట్టేవాళ్లలో కూడా మంచి నలభీములు ఉండవచ్చు. అలాంటి వారి కోసమే ఈ ఆసక్తికరమైన చిట్కాలు. అవునండి ఈ చిన్న చిన్న ఇంట్రెస్టింగ్ టిప్స్ , మీకు మరిన్ని విషయాలు తెలిసేలా చేస్తాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని కూడా అందిస్తాయి.

Kitchen Tips in Telugu: మహిళలు వంటింటి మహారాణులు. కదా..! ఒక దేశాన్ని ఏలే అధినేత అయినా ఒక ఇంటికి ఇల్లాలే. తన కుటుంబ సభ్యులను ప్రేమగా చూసుకోవడం, భాద్యతగా ఉండడం, ప్రతి మహిళలకు ఇష్టమే, అయితే అన్ని రంగాల్లో ముందు ఉండే నేటి మహిళలకు ఓ వైపు ఇంట్లో పని భారము , మరోక వైపు విధి నిర్వహణ, దీంతో టైం ఆదా చేసుకోవడానికి ప్రతి మహిళ కూడా ఆసక్తిని చూపిస్తుంది.

Kitchen Tips in Telugu:ఎంత బిజీగా ఉన్నా సరే తన వారి కోసం స్వయంగా వండి పెట్టడంను ఇష్టపడుతుంది. అయితే అరగంట పట్టే పనులను క్షణాల్లో ఐతే చాలు అని అనుకుంటారు. అయితే కొన్ని పనులు అనుకున్నట్లు జరగవు.కదా.. కూరల్లో ఉప్పు కారం ఎక్కువ కావడం. మాంసం త్వరగా ఉడకపోవడం , ఉల్లిపాయలు కొస్తే కంటి నుండి నీళ్లు రావడం. పచ్చిమిర్చిని కట్ చేస్తే చేతులు మండడం వంటి అనేక సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతుంటాయి. అయితే కొన్ని టిప్స్ తో మీ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.ఈ అద్భుతమైన టిప్స్ పరిష్కారం చూపించడమే కాదు. మీ టైంని కూడా ఆదా చేస్తాయి.

Kitchen Tips in Telugu:

*పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత కొందరికి చేతులు విపరీతంగా మండుతాయి.అటువంటి వారు పంచదార చేతులకు రుద్దుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
*ఉల్లిపాయలను కట్‌ చేసేటప్పుడు కళ్ళ నుంచి నీరు వస్తుంది. కళ్ళు మండుతాయి. అందుకని ఉల్లిపాయలు కట్ చేసే ముందు వాటిని కొంచెం సేపు చల్లని నీటిలో ఉంచాల. లేద, కాసేపు వాటిని ఫ్రీజర్‌లో ఉంచితే సరిపోతుంది.
*పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపు చేర్చి ఒక సీసాలో నిలువ చేస్తే అవి ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి.
*ఉల్లిపాయలు కట్ చేసిన అనంతరం చేతులు ఉల్లి వాసన రావడం సహజం. ఫ్రెష్ నిమ్మరసం చేతులకు పట్టిస్తే ఉల్లి వాసన తొలగిపోతుంది.
*చీమలు ఇంట్లో ఇబ్బంది పెడుతుంటే, మిరియాల పొడిని వేస్తే, చీమలు ఇక దరిచేరవు.
*అప్పుడప్పుడు సాల్ట్ షేకర్‌లోని ఉప్పు గడ్డలుగా మారి బయటికి సరిగా రాదు. అలాంటప్పుడు దానిలో కొన్ని బియ్యం గింజలు వేస్తే ఉప్పు ఈజీగా బయటికి వస్తుంది.
*మాంసాన్ని వేయించేటప్పుడు అది గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వస్తే మంచి లుక్ ఉంటుందని అందరూ కోరుకుంటారు. అయితే మాంసంపై మిరపకాయ ముక్కలను చల్లితే చాలు.
*అన్నం పొడి గా ఉంటె చాలా మందికి ఇష్టం. అటువంటివారు ఉడకబెట్టిన అన్నంలో కొన్ని నిమ్మ రసం చుక్కలు వేస్తే., అన్నం పొడిపొడిగా వస్తుంది. తెల్లగా మల్లెపూవు లా ఉంటుంది.
*అన్నం తేలిగ్గా జీర్ణం కావాలంటే, బియ్యాన్ని వేయించి వండుకోవాలి .

Kitchen Tips in Telugu:

  • ఓవెన్ లో బ్రెడ్‌ని కాల్చే సమయంలో, బ్రెడ్‌తో పాటు చిన్న గిన్నెలో నీరు ఉంచిత, బ్రెడ్‌ గట్టిగా అవదు. మంచి రంగులో ఉంటుంది.
    *వేడిగా ఉన్న నూనె త్వరగా చల్లబడకుండా ఉండాలంటే, నూనెను వేయించడానికి ముందే పాన్‌లో కొద్దిగా ఉప్పు లేదా పిండిని చల్లితే నూనె ఎక్కువ సేపు వేడిగా ఉంటుంది.
    *చేపలు, క్యాబేజీ వంటివి ఉడికించేటప్పుడు వాసన వస్తుంటాయి. ఇలా వాసన రాకుండా ఉండాలంటే వంట చేసేటప్పుడు స్టవ్ పక్కన ఒక గిన్నెలో వెనిగర్ వేసి ఉంచితే సరి. వెనిగర్ వాటి వాసనని గ్రహించి మనకి ఆ వాసన రాకుండా చేస్తుంది.
    *గ్లాస్ లు, స్టీల్ గిన్నెలు ఒకదాంట్లో ఒకటి ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పెడుతుంటాయి. ఆ సమయంలో పై గ్లాసును చల్లటి నీటితో నింప్పి వేడి నీటిలో కాసేపు ఉంచితే ఇరుక్కున్న గ్లాసు ఈజీగా వచ్చేస్తుంది.
  • పాస్తా ఉడికించినప్పుడు ముద్దలా అవుతోందా.. అయితే అవి ఉడికించే గిన్నెలో ఓ చెక్క స్పూన్ కానీ ఫోర్క్ కానీ వేస్తే సరి.. *కోడిగ్రుడ్లను ఉడికించే నీళ్ళలో కాస్త ఉప్పు వేసినా, ఉడికించిన వెంటనే గ్రుడ్లను చన్నీళ్ళలో వేసినా పెంకు సులభంగా వస్తుంది.
    *టమోటాలు వాడిపోయినట్లయితే వాటిని ఉప్పునీటిలో ఒక రాత్రంతా ఉంచితే అవి తాజాగా మారతాయి.
    *వేసవి కాలం వచ్చేసినప్పుడు ,ఐస్ క్యూబ్స్ ఫ్రిజ్ లో పెడుతున్నారా? అయితే ఐస్ క్యూబ్ ట్రే నీరు వేసే ముందు ఆ నీటిని కాచి, వడపోసి వేయండి. ఇలా చేస్తే అందులోని కనిపించని మలినాలు పోతాయి. ఐస్ క్యూబ్స్ క్రిస్టల్ క్లియర్ గా వస్తాయి. రెగ్యులర్ వాటర్ తో తయారైన ఐస్ క్యూబ్స్ తెల్లగా ఉంటాయి.

*గుడ్లు వండే ముందు వాటిని ఓసారి చెక్ చేయండి. వాటి వయసు సులువుగా తెలిసిపోతుంది. ఎలా అంటే.,ఓ జగ్గులో నీళ్లు నిండా వేయాలి. తరువాత గుడ్డుని ఆ నీటిలో వేయాలి. గుడ్డు తేలిందో అది చాలా రోజులు నిలవచేసినదని అర్థం. అలా కాకుండా అది నీటి అడుగుకు చేరి అడ్డంగా పడినట్లైతే ఆ గుడ్డు తాజాదని అర్థం.

*మీకు తెలుసా గుడ్లును ఓవెన్ లో కూడా వండొచ్చు. 160 డిగ్రీస్ వద్ద వాటిని 15 నిమిషాలు పెట్టి, తీసి తింటే బాగుంటాయి.
*నిమ్మ పండుని కోసేముందు బలంగా చేతులతో నలిపి.ఆ తరువాత కోసి పిండితే దాని రసం సులువుగా వస్తుంది.
*ఐస్ క్రీమ్ కొని Deep freeze లో పెడితే,తినే సమయానికి గడ్డకట్టేస్తుందా? అయితే ఒక పని చేయండి. ఐస్ క్రీమ్ బాక్సు ను ఒక కవర్ లో చుట్టి Deep freeze లో పెడితే ఐస్ క్రీము గడ్డకట్టకుండా ఎప్పుడైనా తినేందుకు వీలుగా ఉంటుంది.
*చేపలు గ్రిల్ చేస్తున్నప్పుడు గ్రిల్ పై ముందు నిమ్మకాయ ముక్కల్ని పరిచి, దానిపై చేప ముక్కలు పెట్టి గ్రిల్ చేయాలి. ఇలా చేస్తే చేపకి మంచి రుచి వస్తుంది.Kitchen Tips in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top