KNRUHS Notifications:MBBS BDS అడ్మిషన్స్ 2024 ప్రవేశాలకు KNRUHS నోటిఫికేషన్ విడుదల. రిజిస్ట్రేషన్లు మొదలు. KNRUHS Notifications.
KNRUHS Notifications: తెలంగాణ రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో MBBS BDS కోర్సుల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలకు సంబంధించి Kaloji Narayana Rao University of Health Sciences (KNRUHS) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తుల నమోదుకు సంబంధించి ముఖ్యమైన తేదీలను వెల్లడించింది.
KNRUHS Notifications:ఈ నోటిఫికేషన్ కింద యూనివర్సిటీ పరిధిలోని ఎంబీబీఎస్, డెంటల్ మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లను భర్తీ చేయనున్నారు. NEET UG 2024 అర్హత పరీక్షలో అర్హత సాధించిన రాష్ట్ర అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అర్హత ఉన్న అభ్యర్ధులు August 6వ తేదీ నుంచి August 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు Online లో Registration చేసుకోవచ్చు.
KNRUHS Notifications:దరఖాస్తు సమయంలో సంబంధిత సర్టిఫికెట్స్ ని స్కాన్ చేసి వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ కోసం రూ.3500 చెల్లించాలి. SC, ST అభ్యర్థులు రూ.2900 చెల్లించాలి. ధృవ పత్రాల పరిశీలన అనంతరం తుది మెరిట్ జాబితాను విడుదల చేస్తారు. ఇతర పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://www.knruhs.telangana.gov.in/ ను చూడొచ్చు.
అప్ లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు :
నీట్ యూజీ ర్యాంక్ కార్డు – 2024 పదో తరగతి మార్కుల మెమో ఇంటర్ మార్కుల మెమో టీసీ, స్టడీ సర్టిఫికెట్లు కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ కార్డు లేటెస్ట్ పాస్ ఫొటోలు అభ్యర్థి సంతకం అప్‌లోడ్ చేయాలి
పీజీ డెంటల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ :
పీజీ డెంటల్ సీట్ల భర్తీకి సంబంధించి కూడా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నీట్-ఎండీఎస్ 2024 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఎండీఎస్ కోర్సులో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా, August 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది.
నీట్ఎండీఎస్ పరీక్షలో కట్ ఆఫ్ స్కోర్ కూడా ప్రకటించారు. జనరల్ కేటగిరిలో 800లకు 50శాతం, SC, ST, OBC కేటగిరిలో 40 %, దివ్యాంగులకు 45% గా కటాఫ్ నిర్ణయించారు. కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు NEET MDS పరీక్షలో అర్హతతోపాటు తెలంగాణలోని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తించిన బీడీఎస్ డిగ్రీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.