Litchi Fruit in Telugu : ఖాళీ కడుపుతో మరియు భోజనం చేసిన వెంటనే అలాగే పడుకునే ముందు ఈ పండుని తినకూడదు…కారణాలు ఇవే..

Litchi Fruit in Telugu : ఖాళీ కడుపుతో మరియు భోజనం చేసిన వెంటనే అలాగే పడుకునే ముందు ఈ పండుని తినకూడదు…కారణాలు ఇవే..

Litchi Fruit in Telugu : లిచీ పండ్లు ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో ఈ పండ్లు ఎక్కువగా ఉంటాయి. ఆహారంలో సీజన్ పండ్లను ఉంచుకోవడం వలన అనేక ఉపయోగాలు పొందుతారు. వేసవి పండ్లను ఎవరు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఇది చాలా తీపి రుచితో జ్యుసిగా వుంటూ వేసవి కలం లో చల్లదనాన్ని అందించే పండు. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు ఈ పండును తినడానికి ఇష్టాన్ని చూపుతారు.ఐతే చాల వరకు ఈ పండుని తింటారు కానీ ఇందులో ఉండే పోషక విలువలు ఎక్కువగా వారికీ తెలీదు…కానీ ఇందులో ఉన్న పోషక విలువలు తెలిస్తే ఈ పండును మరింత ఇష్టపడుతారు…మరి ఇంకేం ఇందులో పోషక విలువలు వీటిని తినడం వాలా శరీరానికి కలిగే లాభాలను ఇపుడు చూద్దాం.

💕 లిచీ పండు చాలా నీరు శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ పండులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు తక్కువ మోతాదులో ఉంటాయి. లిచీ లో కొవ్వు పదార్థం లేదు. కానీ విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఉదాహరణకు మాంగనీస్ ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాపర్ కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం మొదలైనవి ఈ పండులో ఎక్కువగా ఉంటాయి. అలాగే డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.ఈ పండులో పోషక విలువలు అనేకం.Litchi Fruit in Telugu

💕 పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, లిచీలో అధిక నీటి కంటెంట్ కారణంగా శరీరంలోని నీటి లోటును భర్తీ చేయడంలో ఉపయోగపడుతుంది . ఎండ కలంలో శరీరంలో డీహైడ్రేషన్కి లోనవుతారు. నీరు తాగడమే కాకుండా లిచీ వంటి నీటిశాతం ఎక్కువగా ఉండే పండ్లను తప్పనిసరిగా తీసుకోవాలి.

💕 లిచీలో ఎపికాటెచిన్, రుటిన్ అనే రెండు యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి ఈ వేడిలో వివిధ వ్యాధులను నివారించడంలో ముఖ్య పాత్ర వహిస్తాయి.

💕 లిచీలో లిచిటానిన్ అనే యాంటీ-వైరల్ పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఇది వైరస్‌ల వ్యాప్తిని నియంత్రించడంలో దోహపడుతుంది. లీచీలో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.

💕 లిచీలోని మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, మాంగనీస్, రాగి ఎముకలు కాల్షియంను గ్రహించడానికి ఉపయోగపడతాయి. ఫలితంగా ఎముకలు దృఢంగా మరియు ఆరోగ్యంగా ఉంటాయి.

💕 లిచీలో ఆస్కార్బిక్ యాసిడ్, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. అధిక శరీర బరువును కోల్పోయే సమయంలో ఈ పండును ఆహారంలో కాస్త పరిమాణంలోతీసుకోవడం మంచిది.

💕 లిచీలోని పీచు, నీరు పొట్ట నిండుగా ఉండేలా చేస్తుంది. కొవ్వు లేకపోవడం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. డైటరీ ఫైబర్ శరీరం నుండి టాక్సిన్స్ బయటకు పంపడానికి ఉపయోగపడుతుంది.

💕 వయసు పైబడిన కొద్దీ వచ్చే చర్మ సమస్యలు ముడతలు బారడం పొడి బారిన చర్మం వంటి మొదలైన సమస్యల నుంచి ఇది దూరం పెడుతుంది..

💕 ఇది శరీరంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. అలాగే, లిచీని అధికంగా తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. ఫలితంగా శ్వాసలోపం, మైకం, వికారం, బలహీనత సంభవించవచ్చు. ఈ పండులో ఉండే పొటాషియం కారణంగా, కిడ్నీ సమస్యలు ఉన్న రోగులు దీనిని తినడం మంచిది కాదు.Litchi Fruit in Telugu

💕 ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి రోజుకు 10-12 లిచీలను తినవచ్చు. అయితే ఈ పండుని ఒకేసారి తినే బదులు కాస్త విరామంతో తినడం మంచిది. ఈ పండు సీసన్ ప్రకారం లో దొరుకుతుంది కాబట్టి దీనిని తప్పకుండా తినండి…ఎందుకంటె ఏ సీసన్ లో దొరికే పండు ఆ సీసన్ లో తినడం శరీరానికి ఎంతో మేలు చేస్తాయి..

గమనిక : ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. రోజూ తినవచ్చు. అయితే అతిగా మాత్రం తినకూడదు. ఈ పండు తింటే అలర్జీలాగా అనిపిస్తే మాత్రం నిపుణులను సంప్రదించడం మేలు…Litchi Fruit in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top