Lucky Plants For Home: మీ ఇంట్లో ఈ మొక్కలు పెంచారంటే పాజిటీవ్ ఎనర్జీ తో పాటు మీ సంతోషం రెట్టింపు అవుతుంది.2024.
Lucky Plants For Home: మీ ఇంటి నుండి ప్రతికూలతను తొలగించడానికి, సానుకూల వాతావరణం పెంచడము తో పాటు మీకు పాజిటివ్ వైబ్స్ ని కలిగిస్తాయి. ఈ ఐదు మొక్కలు చాలా ఉపయోగపడతాయి. ఈ మొక్కలని పెంచడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అవి చూడడానికి చాలా అందంగా కూడా కనిపిస్తాయి. ఇంటికి అందంతో పాటూ అదృష్టాన్నీ కూడా మీకు తెస్తాయి.
Lucky Plants For Home: ఇంట్లో చెట్లు నాటడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, ఇంటికి కళ తీసుకురావడంలో పచ్చని మొక్కలు సాయపడతాయి. ఆరోగ్యంతో పాటే వీటితో అలంకరణ కూడా పూర్తవుతుంది. అయితే కొన్ని మొక్కలు నాటడం ద్వారా ఇంట్లో ప్రతికూలతలు తొలిగిపోయి, సానుకూల వాతావరణం నెలకొంటుంది. అలాంటి మొక్కలను మీ ఇంటి అలంకరణలో సులువుగా భాగం చేసుకోవచ్చు.
🌿 తులసి :
మన హిందూమతంలో తులసి మొక్కను చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఇంటి ఆవరణలో తులసి మొక్కను నాటాలనే సాంప్రదాయం మనకు ఎప్పటినుంచో ఉంది. ఈ మొక్క ఇంటిలోని నెగిటివ్ ఎనర్జీ ని తొలగించి, ఇంట్లో మనకు పాజిటివ్ ఎనర్జీని పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. దీంతో పాటే తులసి మొక్క ఔషధ గుణాల గురించి ప్రత్యేకంగా కూడా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ఇది మనకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
🌵 స్నేక్ ప్లాంట్ :
స్నేక్ ప్లాంట్ మీ ఇంటి అలంకరణలో ఉపయోగించగల మంచి ఇండోర్ మొక్క. ఈ మొక్క చాలా అందంగా కనిపిస్తుంది కూడా. అంతేకాకుండా గాలిలో ఉండేటువంటి టాక్సిన్స్ ను తొలగించి శుద్ధి చేయడంలో బాగా సహాయపడుతుంది. ఇంట్లో ఈ మొక్కను నాటుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి ఇంట్లో మనకు సానుకూల వాతావరణం ఏర్పడుతుందని చెబుతారు.
🌾 పీస్ లిల్లీ :
దాని పేరు ఉన్నట్టుగానే , పీస్ లిల్లీ ఉన్నవాళ్ళ ఇళ్ళలో ఆనందం, శాంతి వాతావరణం నెలకొంటుంది. ఈ మొక్క చూడటానికి అందంగా ఉండటంతో పాటు గాలిని ఫిల్టర్ చేస్తుంది. ఇది గాలిలో ఉండే టాక్సిన్స్ ను తొలగిస్తుంది. ఇంతే కాకుండా, మీరు దీన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే ఇంటి వాతావరణాన్ని సానుకూలంగా మార్చడానికి కూడా దోహదపడుతుంది.
🍀 మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ వివిధ సంస్కృతులలో చాలా పవిత్రమైన మొక్కగా భావిస్తారు. ఈ మొక్క పెరుగుతూ ఉన్న ఇంట్లో సుఖసంతోషాలకు కొరత ఉండదని చెప్తూ ఉంటారు. ఈ మొక్కను అదృష్టానికి గుర్తుగా కూడా భావిస్తారు. ఈ మొక్క పెంచడానికి ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం కూడా అక్కర్లేదు. తక్కువ సూర్యరశ్మి, తక్కువ నీటిలో కూడా ఈ మొక్కను సులభంగా పెంచుకోవచ్చు.
🌱 అలోవెరా
తులసి, మనీ ప్లాంట్ తరువాత, ఇది మన భారతదేశంలో దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించేటువంటి మొక్క కలబంద లేదా అలోవెరా. అనేక ఆరోగ్య ప్రయోజనాలతో పాటు, కలబంద ఇంటిలోని ప్రతికూలతను తొలగించడానికి కూడా పనిచేస్తుంది. తక్కువ సంరక్షణలో సులభంగా పెరిగే ఈ మొక్క చెడు శక్తి నుండి మీ ఇంటిని కాపాడుతుంది.Lucky Plants For Home: