Papaya Seeds: బొప్పాయి గింజలు పారేస్తూ ఉన్నారా ? నెలసరి సమయలో ఈ గింజలు చేసే మేలు తెలిస్తే…
హెల్తీ ఫ్రూట్స్ లిస్ట్‌లో మొదట ఉండే పండ్లలో బొప్పాయి కూడా ఒకటి Papaya Seeds. బొప్పాయి తరచుగా తీసుకుంటే.. మన శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి.బొప్పాయిలో విటమిన్-A , B , C , E , K లతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు లోని పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు మన గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ పండ్లు హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. ఈ పండు తినడం వాల్ల మన జీర్ణక్రియకు మేలు చేకూరుతుంది. కడుపు లో ఉబ్బరం మరియు మలబద్ధకం వంటి సమస్యలను పరిష్కరిస్తాయి.ఐతే బొప్పాయి పండు మాత్రమే కాదు.. బొప్పాయి గింజలు మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెబుతున్నారు.సాధారణంగా మనం వేస్ట్ అని బయట పారేసే ఈ పండు గింజలలో.. అనేక అనారోగ్యాల సంబంధిత వ్వ్యాదులను మన దరి చేరకుండా ఈ పండులోని గింజలు రక్షిస్తాయి. బొప్పాయి గింజలు తీసుకుంటే కలిగే ఆరోగ్య ఉపయోగాలు ఇప్పుడు తెలుసుకుందాం.
👉 బొప్పాయిలో ఈ పోషకాలు ఉంటాయి..
బొప్పాయి గింజల్లో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండులో జింక్, ఫాస్పరస్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కాల్షియం వంటి మొదలైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్, పాలీఫెనాల్స్ మరియు మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, ఫ్లేవనాయిడ్స్ మొదలైనవి అధికంగా ఉంటాయి. ఇందులోని పోషకమైన విలువలు మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
👉 బరువు తగ్గడంతో Papaya Seeds
బొప్పాయి గింజల్లో ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు మద్దతు ఉంటుంది అలాగే మెరుగుపరుస్తుంది. మీ శరీరంలో హాని కలిగించే వ్యర్థాలను సులభంగా తొలగిస్తుంది. ఫైబర్ కంటెంట్ మీ జీవక్రియ మెరుగ్గా పనిచేసేలా తోడ్పడుతుంది. మీ శరీరం అధిక కొవ్వును నిల్వ చేయకుండా ఈ పండు గింజలు నిరోధిస్తాయి. బొప్పాయి గింజలు క్రమం తప్పకుండా తీసుకుంటే.. మీ బరువు కంట్రోల్‌లో ఉంచడంలో దోహదపడుతుంది.
👉 గట్ హెల్త్‌కు శ్రేయస్కరం..
ఈ పండు గింజల్లో కార్పైన్ ఉంటుంది. ఇది మీ పేగులలోని పురుగులను మరియు బ్యాక్టీరియాను చంపేస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది మరియు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.ఈ బొప్పాయి గింజలలోని అధిక ఫైబర్ కారణముగా పేగుల కదలికలను నియంత్రిస్తుంది.Papaya Seeds
👉 కొలెస్ట్రాల్ నియంత్రిస్తుంది..
బొప్పాయి గింజల్లోని ఫైబర్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. బొప్పాయి గింజల్లో ఒలీక్ యాసిడ్, ఇతర మోనోశాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది.
👉 క్యాన్సర్ ముప్పు ఉండదు..
ఈ బొప్పాయి పండు గింజల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి, ఇవి మన శరీరానికి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి అనేక రకాల క్యాన్సర్ పెంపొందించే క్రియల నుంచి మనల్ని కాపాడుతాయి.మీరు క్యాన్సర్‌కు దూరంగా ఉండాలంటే.. ఐదు నుంచి ఆరు బొప్పాయి గింజలను పొడి చేసి, దానిని మీ ఆహారంలో లేదా టీ చేసుకుని తాగండి.ఎలా క్రమం తప్పకుండా చేస్తే కాన్సర్ బారిన పడకుండా వుంటారు..
👉 ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది..
బొప్పాయి గింజల్లో విటమిన్ C, ఆల్కలాయిడ్స్, ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి మొదలైన ఇతర సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి యాంటీ ఇన్‌ఫ్లమేటరీలుగా మన శరీరంలో పనిచేస్తాయి. గౌట్, ఆర్థరైటిస్ మరియు కీళ్ల నొప్పులు ఉన్నావారు ఈ బొప్పాయి గింజలు తీసుకోవాలని నిపుణులు చెప్తున్నారు .
👉నెలసరి నొప్పి తగ్గిస్తుంది..
ఈ బొప్పాయి గింజలో ఉండే కెరోటిన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్పత్తిని నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.. బొప్పాయి గింజలు ఋతుక్రమాన్ని ప్రేరేపించడంలో, దాని క్రమబద్ధతను పెంచడంలో తోడ్పడతాయి. నెలసరి సమయంలో నొప్పిని తగ్గించడానికీ.. బొప్పాయి గింజలు ఉపయోగపడుతుంది.
👉 బొప్పాయి గింజలను ఎన్ని తినాలి..
రోజుకి ఒక గ్రాము /ఐదు ఈ బొప్పాయి గింజల కంటే ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ పండు గింజలు పచ్చివి కూడా తినొచ్చు, పొడర్ రూపంలోనూ తీసుకోవచ్చు. కానీ, వీటిని తీసుకునే ముందు డాక్టర్ సూచనని తీసుకోవడం మంచిది…Papaya Seeds
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Papaya Seeds అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు