Pear Fruit in Telugu : కేవలం రుచిలోనే కాదు…ఔషధ గుణంలోనూ ఎక్కువే…!
మన మాతృభాషలో బేరీపండుగా పిలిచే Pear Fruit in Telugu రుచిలో ఎంతో మధురంగా ఉండటమే కాదు. పియర్ పండులో ఎన్నో రకాల అద్భుతమైన పోషకాలు కూడా మెండుగానే ఉంటాయి. ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పియర్ పండు తినడం ద్వారా కలిగే ఆరోగ్య ఉపయోగాలను ఇక్కడ తెలుసుకోండి.
- సాధారణంగా ఈ పండును తింటుంటే ఆపిల్ పండు తింటున్న అనుభూతి కలుగుతుంది.పియర్ పండు చాలా రుచిగా కూడా ఉంటుంది. కొలెస్ట్రాల్ మరియు మలబద్ధకం ఇంకా మధుమేహం అలాగే క్యాన్సర్‌ను కూడా దూరంగా ఉంచడంలో ఈ పియర్ పండులోని పోషకాలు ఉపయోగపడతాయని షకాహార నిపుణుడు లోవ్‌నీత్ బాత్రా తెలియజేసారు.
- బేరిపండులో పెక్టిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. పియర్ పండు LDL, ట్రైగ్లిజరైడ్స్, VLDL స్థాయిలను తగ్గిచడంలో దోహదపడుతుంది, తద్వారా అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది.
- పియర్ ఫ్రూట్ మలబద్ధకం నుంచి ఉపశమనం పొందడంలో ఉపయోగపడుతుంది: పియర్ పండు ద్వారా లభించే పెక్టిన్ కంటెంట్ అనేది ఒక రకమైన ఫైబర్. ఇది జీర్ణవ్యవస్థలో నిండిన కొవ్వు పదార్ధాలను నివారించడంలో దోహదపడుతుంది,వాటి తొలగించడంలో ప్రోత్సహిస్తుంది. అందువల్ల మలబద్ధకం సమస్య మన దరి చేరాదు.
- పియర్ పండులో అధిక మొత్తంలో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. కాబట్టి పియర్ పండు మధుమేహ వ్యాధిగ్రస్తులకు అద్భుతమైన ఆహారం. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది.
- పియర్ పండు యాంటీకాన్సర్ గుణాలను కూడా పుష్కలంగా ఉంటాయి. ఈ పండును రోజూ తీసుకోవడం వల్ల మూత్రాశయం, ఊపిరితిత్తులు, అన్నవాహిక క్యాన్సర్ ప్రమాదాన్ని దరి చేరకుండా నియంత్రిస్తుంది.ఈ పండులో ఉర్సోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, ఇది ఆరోమాటేస్ చర్యను తగ్గిస్తుంది, తద్వారా క్యాన్సర్‌ను నయం చేస్తుంది.పియర్ పండ్లలో ఉండే ఐసోక్వెర్‌సిట్రిన్ DNA సమగ్రతను నివారిస్తుంది.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Pear Fruit in Telugu ను అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు