Pine Nuts in Telugu : చిల్గోజా లో మనకు తెలీని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి…మగ వారు తప్పకుండ తీసుకోవాల్సిన ఆహారం ఇది..!

Pine Nuts in Telugu : చిల్గోజా లో మనకు తెలీని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి…మగ వారు తప్పకుండ తీసుకోవాల్సిన ఆహారం ఇది..!

Pine Nuts in Telugu : చిల్గోజా, వీటినే ఆంగ్లంలో పైన్ నట్స్ అంటారు. రుచికరమైన గింజలంటే జీడిపప్పు, బాదాం, పిస్తాలే అనుకుంటాం. కానీ అంతకుమించిన మధురమైన రుచి ఈ చిల్గోజా ఉంటుంది. తినడానికి క్రీమీగా, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. ఏదో మంచి స్వీట్ తిన్న అనుభూతి వస్తుంది. ఇంతకన్నా మంచి రుచి ఉన్న విత్తనం ఇంకొకటి లేదంటారు దీన్ని తిన్నవాళ్లు. చింతపండుకు ఎలాగైతే గోధుమరంగు తొడుగుంటుందో వీటికీ అలాగే. దాన్ని పగలకొడితే తెల్లటి గింజ బయటికొస్తుంది. అవే పైన్ నట్స్. రోజూ వారి ఆహారంలో వీటిని తినడం వల్ల అనేక లాభాలుంటాయి.

అనేక పోషకాలున్న పైన్ నట్స్ ధర మాత్రం చాలా ఎక్కువ. కిలోకు దాదాపుగా 8000 రూపాయల దాకా ఉంటుంది. అంటే ఓ గ్రాము బంగారం అనుకోండి. ఆరోగ్యం కోసం డబ్బు గురించి ఆలోచించక్కర్లేదు అనుకునేవాళ్లు మాత్రం వీటిని రోజూవారీ ఆహారంలో చేర్చుకోవడం చాలా మంచిది. మీరు మనీ అంత ఖర్చు పెట్టలేం అనుకుంటే, కనీసం ఒక్కసారి 100 గ్రాముల గింజల్ని తెచ్చుకుని తప్పకుండా రుచి మాత్రం చూడండి తర్వాత మీకు నచ్చితే మరిన్ని తెచ్చుకోవచ్చు. మరి ఇంత ధర పెట్టి వీటిని కొనే అవసరం ఏముంది అంటే వీటిలోని ఔషధ గుణాలు ఆలా ఉంటాయి మరి..మరి ఇక్కడ వాటి గురించి వాటిని తినడం వాళ్ళ పొందే లాభాల గురించి క్లుప్తంగా వివరించం చదవండి..!

ఈ గింజల్లో 100 గ్రాములలో 673 కేలరీలు ఉంటాయి. మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. 100 గ్రాముల చిల్గోజా తినడం వల్ల 13.69 ప్రోటీన్లు లభిస్తాయి. అదే సమయంలో, చక్కెర పరిమాణం 3.59గ్రాముల్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా,ఇందులో ప్రతి 100 గ్రాములకి 251 మి.గ్రా మెగ్నీషియం, 16 మి.గ్రా కాల్షియం, 597 గ్రాముల పొటాషియం వంటి పుష్కలమైన పోషకాలు ఇందులో ఉంటాయి. వీటితో పాటే ఫోలేట్, ఐరన్ అధికంగా ఉండటం వల్ల గర్భిణీ స్త్రీలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజు వీటిని తినడం వాళ్ళ కలిగే ప్రయోజనాలు ఇక్కడ వివరించం చదివేయండి..!

చిల్గోజాలో 90 శాతం అసంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీనివల్ల గుండె జబ్బు పడకుండా ఉంటుంది. Pine Nuts ఇతర గింజల కంటే ఎక్కువ కొవ్వు ఆమ్లాలను ఎక్కువ మోతాదులో కలిగి ఉంటాయి

వీటిని తినడం వల్ల కొవ్వులున్న జంక్ ఫుడ్ తినాలనే కోరిక తగ్గుతుంది. ఇవి తిన్నవెంటనే విడుదలయ్యే హార్మోన్లే దానికి కారణం. బరువు తగ్గాలని ఆలోచించే వ్యక్తులు చిల్గోజా తినడం ప్రారంభించాలి. అనారోగ్యకర ఆహారాలు తినాలనే కోరిక తగ్గించడంతో పాటూ బరువు తగ్గడంలోనూ ఇది సాయపడుతుంది.

చిల్గోజాలో ఒమేగా 6, సెలీనియం ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది.Pine Nuts in Telugu

సెలీనియం పరిమాణం సంతానోత్పత్తి సమస్యను తొలగిస్తుంది. చిల్గోజా పురుషుల్లో సెక్స్ శక్తిని పెంచుతుంది. చిల్గోజాలో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది సంతానలేమి వంటి సమస్యను తొలగించడానికి సహాయపడుతుంది.ప్రతి రోజూ చిల్గోజా తినడం వల్ల మగవారిలో స్పెర్మ్ కౌంట్ పెరగడంతో పాటు వీర్యకణాల నాణ్యత కూడా పెంపొందుతుంది. అలాగే, చిల్గోజా ఉత్సాహాన్ని పెంచడంలో సహాయపడుతుంది.

  • చిల్గోజా సాధారణ జలుబు నుండి రక్షించడానికి కూడా సహాయపడుతుంది. జింక్ పరిమాణం గాయం వేగంగా నయం చేయడానికి సహాయపడుతుంది.
  • డిప్రెషన్, చిరాకు, మూడ్ స్వింగ్స్ మొదలైన సమస్యలు ఉన్నవారు నిరాశ సమస్యతో పోరాడతారు. వీరు ఆహారంలో చిల్గోజా చేర్చుకోవాలి. మెగ్నీషియం మోతాదు ఈ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే రాత్రిపూట చిల్గోజా తింటే కండరాలు రిలాక్స్ అవుతాయి.
  • మోనోపాజ్ తరువాత, మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం ప్రారంభమవుతుంది. అలాంటి మహిళలు తప్పనిసరిగా చిల్గోజా తినాలి. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. చిల్గోజాలో ఉండే మెగ్నీషియం మొత్తం శరీరానికి కాల్షియం రవాణా చేయడానికి సహాయపడుతుంది.
  • పైన్ గింజల గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువవ్వడం వల్ల డయాబెటిస్ లో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనివల్ల ఇన్సులిన్ పనితీరు పెరుగుతుంది. చిల్గోజా తినడం వల్ల డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

గమనిక ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ యొక్క అందం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

    Leave a Comment

    Your email address will not be published. Required fields are marked *

    Scroll to Top