Pink Salt in Telugu : రక్తపోటుతో సమస్యతో బాధపడుతున్నారా..? అయితే ఈ ఉప్పు మాత్రమే తినండి…
Pink Salt in Telugu : మన రోజు వారి ఉరుకులు పరుగుల జీవితంలో మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంపై ఎంతగానో ప్రభావం చూపుతుంది…. అందుకే పలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండాలంటే అనేక ఆరోగ్య అలవాట్లు చేసుకోవాలి.. మనం రోజు తీసుకునే ఆహారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఈ రోజుల్లో అనారోగ్యకరమైన ఆహారం, ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం వల్ల రక్తపోటు, షుగర్, ఉదరం, అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి…అధిక రక్తపోటు మన గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.. గుండెపోటు వచ్చే ప్రమాదాలను ఎక్కువ చేస్తుంది. ఈ నేపథ్యంలో రక్తపోటు రోగికి ఎక్కువగా హాని కలిగించే ఒక పదార్థం ఎంటంటే.. ఉప్పు.మీకు బీపీ సమస్య ఉంటే మీరు పరిమితంగా ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇంతే కాదు మీరు సాధారణ ఉప్పుకు బదులుగా, రాతి ఉప్పు (Rock Salt) ను తీసుకోవాలి . ఉప్పులో మనకు అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి…ఐతే వాటిలో ఒకటి ఈ పింక్ సాల్ట్…
పింక్ సాల్ట్…ఈ ఉప్పు యొక్క పేరే చెప్తుంది ఇది చూడటానికి పింక్ రంగులో ఉంటుంది…ఈ ఉప్పు ని హిమాలయన్ సాల్ట్ అని కూడా పిలుస్తారు…జీర్ణక్రియ అరుగుదలకి.. చర్మం కాంతివంతం గా మెరువడానికి.. ఎముకల బలం కోసం.. బ్లడ్ ప్లెషర్ .. బిపి .. గుండె ఆరోగ్యం మెరుగుపరచడానికి ఇలా అనేక సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది…Pink Salt in Telugu
ఉపవాసంలో ఉన్నప్పుడు చాలామంది రాతి ఉప్పును వినియోగిస్తారు. ఈ రాతి ఉప్పు (సైంధవ లవణం) స్వచ్ఛమైనదిగా భావిస్తారు. ఈ ఉప్పు ఎలాంటి రసాయన ప్రక్రియ లేకుండా సహజ సిద్ధంగా తయారవుతుంది. అదే సమయంలో, మనం రోజు వాడుకొనే ఉప్పును తయారు చేసేటప్పుడు వివిధ రసాయన ప్రక్రియలతో తయారు చేయడం జరుగుతుంది. ఇందువలన ఉప్పులోని పోషకాలు చాల వరకు తగ్గుతాయి. అందుకే మనం మరింత ఆరోగ్యంగా ఉండాలంటే పింక్ సాల్ట్ వాడటం ఎంతో శ్రేయస్కరం. రాక్ సాల్ట్ వల్ల కలిగే ఉపయోగాలేమిటో ఇప్పుడు ఈ స్టోరీ లో తెలుసుకుందాం రండి…!
- పింక్ సాల్ట్ (రాక్ సాల్ట్) రక్తపోటును నివారించడంలో ఉపయోగపడుతుంది.
- రాతి ఉప్పులో కాల్షియం, పొటాషియం మెండుగా లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
- తొందరగా అలసటగా మరియు బలహీనంగా అనిపించే వారు రాతి ఉప్పును తీసుకోవడం వారి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
- రాక్ సాల్ట్ వాడటం ద్వారా మన శరీరంలో అధిక రక్తపోటును తగ్గిస్తుంది.. దీని ద్వారా మన శరీరానికి విశ్రాంతి భావన కలుగుతుంది.మరియు రాత్రి సమయంలో మంచి నిద్ర మీ సొంతం అవుతుంది…
- పింక్ ఉప్పు మన కళ్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ ఉప్పుని మన రోజు వారి ఆహారంలో తీసుకోవడం ద్వారా కంటి చూపు తగ్గకుండా రక్షిస్తుంది.
- రాక్ సాల్ట్ తినడం వల్ల మన జీర్ణవ్యవస్థ ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది.
- వాంతులు మరియు వికారం సమస్య ఉంటే, మీరు నిమ్మరసంలో పింక్ సాల్ట్ను కలిపి తీసుకుంటే వెంటనే ఆ సమస్య తగ్గిపోతుంది.
- హిమాలయన్ ఉప్పు తీసుకోవడం వల్ల కండరాల తిమ్మిరి సమస్య తొలగిపోయి మంచి నిద్ర మన సొంతం అవుతుంది.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Pink Salt in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు…