Poppy Seeds in Telugu : వంటింట్లో ఉండేవే,కదా అని లైట్ తీసుకోకండి.వాటి వళ్ళ కలిగే, ఆరోగ్య ప్రయోజనాలుతెలిస్తే,తప్పక వాడతారు. Gasalu in Telugu.
Poppy Seeds in Telugu : మనం వంటల్లో వాడేటువంటి ఈ గసగసాల్ని తేలికగా తీసుకోవడానికి వీల్లేదు. తప్పనిసరిగా వాడే సుగంధ ద్రవ్యాలలో ఈ గసాలు కూడా ఉన్నాయి. తెల్లగా, చిన్న చిన్నగా ఉండే , గసగసాల్ని ఈ రోజుల్లో మనం వంటల్లోనే వాడుతున్నాంగానీ,పూర్వం వాటిని ఔషదాల తయారీలో వాడేవాళ్లు. మిగతా సుగంధ ద్రవ్యాలలాగే గసగసాలు కూడా చాలా ప్రముఖమైనవి.
Gasalu in Telugu వాటితో కలిగేటువంటి ప్రయోజనాలు తెలియక చాలా మంది వేరే,మసాలా ఐటెమ్స్ కొనుక్కుంటారు కానీ, గసగసాల్ని కొనేందుకు మరియు తినేందుకు అంతగా ఇష్టపడరు. కానీ ఇప్పుడవి కొనకపోతే, కూర రుచి మారిపోతుందా..? అని అనుకుంటారు. అయితే, గసగసాలు కూరలకు ఎంతో రుచిని ఇస్తాయి. కుర్మా లాంటి వాటిలో గసగసాల్ని వేయడం ద్వారా స్పెషల్ రుచి, కమ్మదనం వస్తుంది. ఈ రోజుల్లో ప్రతీదీ కూడా పౌడర్ రూపంలో వస్తున్నాయి. కానీ చిన్నగా ఉండే, ఈ గసగసాలు మాత్రం పౌడర్ లాగా కాకుండా అవి ఎలా ఉన్నాయో, అలాగే ప్యాకింగ్‌లో దొరుకుతున్నాయి. మరి గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
గసగసాలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు :
- కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకుండా చేసేటువంటి శక్తి గసగసాలకు ఉంది. వీటిలో ఉండే ఆక్సలేట్లు,కాల్షియంను గ్రహించి, స్టోన్స్ ఏర్పడకుండా చేస్తాయి.
- మలబద్దకాన్ని తగ్గిస్తాయి. గసగసాల్లో ఫైబర్ (పీచు పదార్థం) ఎక్కువ. ఇది పేగులు బాగా కదిలేలా చేస్తుంది. తద్వారా మలబద్దకాన్ని తగ్గిస్తుంది.
- నిద్రకు మేలు చేస్తాయి. కొంతమందికి సరిగా నిద్ర పట్టదు. అలాంటి వారు గసగసాలు తీసుకోవాలి. రోజు నిద్రపోయే ముందు వేడి పాలలో గసగసాల పేస్ట్‌ను కొద్దిగా కలిపుకొని తాగితే చాలు. చక్కటి మంచి నిద్ర వచ్చేస్తుంది.
- శ్వాస సమస్యలకు చెక్. గసగసాలు ఊపిరితిత్తుల సమస్యలను ఏకకాలంలో నయం చేసే గుణాలు కలిగి ఉన్నాయి. అందువల్ల ఇవి శ్వాస సంబంధిత సమస్యల్ని తగ్గిస్తాయి. దగ్గు, ఆస్తమా వంటివి ఇవి తీసుకోవడం వలన తగ్గుతాయి.
- హృదయ సమస్య ఉన్నవారు గసగసాలు దోరగా ఫ్రై చేసి, చెక్కర కలిపి ఉదయం, సాయంత్రం అర చెంచాడు తీసుకొంటే హృదయం హాయిగా ఉంటుంది.
- గసగసాలు చలవ చేస్తాయి. శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడొచ్చు.
- కడుపులో మంట, Acidity వున్న వారు గసగసాల్ని వాడితే, పేగులలో అల్సర్లు, పుండ్లు వంటివి కూడా తగ్గుతాయి.
గమనిక : గసగసాలతో ఇలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదా, అని వీటిని మరీ ఎక్కువగా వాడటం మాత్రం మంచిది కాదు. గసగసాలు ఎక్కువగా తింటే, మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతుంది. లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటుంది.కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకునే వారు మాత్రం వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.