Prunes in Telugu : రక్త హీనత సమస్యకు ఈ ప్రూనే తో చెక్ పెట్టండి…!
ప్రూనే అంటే ఎండిన ప్లమ్ పండ్లు అని అర్ధం. Prunes in Telugu ఇవి తినడానికి తియ్యగా మరియు రుచిగా ఉంటాయి. ప్రూన్స్‌లో ఫైబర్, విటమిన్ కె, విటమిన్ A, పొటాషియం, మాంగనీస్ వంటి ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ప్రూనేలోని అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను బలోపేతం చేస్తుంది అలాగే మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి దోహదపడుతుంది, బరువు నియంత్రణలో ఉంటుంది, ఎముకలను బలంగా ఉంచుతుంది. ప్రూనే తరచు మన డైట్‌లో తరచు చేర్చుకుంటే ఎన్నో రకాల లాభాలను పొందవచ్చు.. ఎలాంటి ఆరోగ్య ఉపయోగాలు ఉంటాయో ఇక్కడ తెలుసుకుందం రండి…
జీర్ణక్రియ మెరుగుపడుతుంది…
ప్రూనేలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణక్రియను మెరుగుపరచడానికి మరియు మలబద్ధకం సమస్యను నివారించడానికి ఫైబర్ ఉపయోగపడుతుంది. ఫైబర్ ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియా పెరుగుదలను కూడా ప్రోత్సహిస్తుంది అలాగే ఇది గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఎముకలు స్ట్రాంగ్‌గా ఉంటాయి…
ప్రూనేలో కాల్షియం, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. Prunes in Telugu ఇవి ఎముకలు ఆరోగ్యంగా మరియు బలంగా ఉండటానికి దోహదపడుతుంది. అంతేకాదు, ప్రూనేలో ఎముకల నిర్మాణం మరియు మరమ్మత్తుకు అవసరమైన విటమిన్ K మెండుగా ఉంటుంది. మీ ఎముకలను బలోపేతం చేసుకోవడానికి మీ ఆహారంలో ప్రూనే చేర్చుకోండి.
గుండెను ఆరోగ్యనికి …
ప్రూనేలో ఫైబర్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు సమృదిగా ఉంటాయి. ఇవి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి. అంతేకాదు, ఇవి హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచి.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రూనేలో ఫినోలిక్ సమ్మేళనాల్లో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. గుండె సమస్యలు ముప్పును నివారిస్తాయి.
బరువు తగ్గుతారు…
దీనిలో కేలరీలు తక్కువగా ఉంటాయి, ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ కడుపును ఎపుడు నిండుగా ఉంచుతుంది. అతిగా తినకుండా చేస్తుంది. తద్వారా బరువు నియంత్రణలో ఉంటుంది.Prunes in Telugu
బ్లడ్ షుగర్ లెవల్స్ నివారణలో ఉంచుతాయి…
ఈ పండులో గ్రైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇందు వలన చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. షుగర్ పేషెంట్స్ మరియు ప్రీ డయాబెటిక్ స్టేజ్‌లో ఉన్న వ్యక్తులు ప్రూనే తీసుకుంటే.. షుగర్ నియంత్రణలో ఉంటుంది.
కంటి ఆరోగ్యానికి బాగు చేస్తాయి…
ఇందులో బీటా-కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A లా మారుతుంది. విటమిన్ A శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. విటమిన్ A మీ కళ్లను ఆరోగ్యంగా చేస్తుంది. ప్రూనేలోని యాంటీఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి కళ్లను రక్షించడానికి ఉపయోగపడతాయి. వయస్సు సంబంధిత మచ్చల క్షీణత ప్రమాదాన్ని నియంత్రిస్తాయి.
చర్మాన్ని సౌందర్యం ఆరోగ్యంగా ఉంచుతుంది…
ప్రూనేలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మరియు విటమిన్ సి ఆరోగ్యకరమైన చర్మాన్ని నిర్వహించడానికి అవసరం. ఇవి కొల్లాజెన్, ఎలాస్టిన్ విచ్ఛిన్నతను నిరోధించడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన ఛాయను మెరుగుపరుస్తాయి, వృద్ధాప్య ప్రక్రియను మందగిస్తాయి.
ఇమ్యూనిటీ బూస్ట్ …
ప్రూనేలో విటిమిన్ C పుష్కలంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. రోగనిరోధక వ్యవస్థను ఉతేజపరుస్తుంది. అంతేకాదు, జింక్ ఇమ్యూనిటీని బూస్డ్ చేయడంలో దోహదపడుతుంది . వ్యాధిని నివారించడానికి మరియు ఇన్ఫెక్షన్ల నుంచి పోరాడటానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ చాలా ముఖ్యం.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Prunes in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు…