Quail Farming : రోజుకు రూ. 4,000 వరకు సంపాదించుకునే గొప్ప వ్యాపారం ఇదే…
Quail Farming : సాధారణంగా వ్యాపారం అంటే మనం పెట్టిన మొత్తానికి ఎక్కువ రాబడి రావాలని ప్రతి ఒక వ్యాపారుడు ఆశ పడుతు ఉంటారు…కొన్ని వ్యాపారలు సీజన్ కి అనుగుణంగా నడుస్తాయి….మరి కొన్ని వ్యాపారాలు మొత్తం ఏడాది పొడవునా మంచి వ్యాపార లాభాలను ఇస్తాయి…ఐతే ఇందులో మనం మొదట తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ వ్యాపారం ఐనా సరే కొంత మన సమయ స్ఫూర్తి ని అనుసరించి ముందుకు సాగుతూ మంచి లాభాలను మనకు చేకూరుస్తాయి…గత కొన్ని సంవత్సరాలుగా రైతు తమ సేవలను ఏదో ఒక పంట ద్వారా ఈ దేశానికి కడుపు నిండా అన్నం పెడుతున్నాడు…కానీ ఆ రైతులకు 6 నెలల తర్వాతే తమ పంట చేతికి రావడం జరుగుతుంది…మరి 6 నెలల వరకు పంట డబ్బుల కోసం ఎదురు చూడకుండ తమ రోజు వారి ఆదాయం ఎంతో కొంత పెరిగేలా చేసే మంచి ఐడియని ఇక్కడ మేము మా todayintelugu.com వెబ్సైటు లో తెలియజేసాం…మరిన్ని రైతు శ్రేయస్సుకోరే వ్యాపార ఐడియా ల కోసం మా వెబ్సైటు ను నిరంతరం ఫల్లౌ చేయండి…!
కేవలం రైతులకే కాదు ఈ వ్యాపారం ఎవరైనా మొదలు పెట్టొచ్చు…మనకు సాధారణంగా మన పల్లెటూర్లలో రోజు కనిపించే కంజు పిట్టలు అంటే ప్రతి ఒకరికి బాగా తెలుసు…ఐతే వీటిని ఈ మధ్య కాలంలో ఇందులోని పోషక విలువలు వల్ల వీటిని ఎక్కువ మంది తినడానికి ఇష్టపడుతున్నారు…వీటి మార్కెటింగ్ కోళ్లకంటే ఎక్కువ జరుగుతుంది అనడం లో ఎలాంటి సందేహం లేదు….ఈ కంజు పిట్టల వ్యాపారం ఎలా మొదలు పెట్టాలి…వాటికీ ఎలాంటి ఆహారం ఇవ్వాలి…వీటి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఇలా అనేక సందేహాలను ఇపుడు ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం రండి…!
ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ముక్కలేనిదే ముద్ద దిగదు మనకు… అలాంటిది కంజు పిట్టలను కూరగా వండి పెడితే దానిని మాత్రం లొట్టలేసుకుని మరి తింటాం. మనం రోజూ తినే దాని కన్నా రెట్టింపుగా లాగించేస్తుంటాం.ఈ కంజు పిట్టా కేవలం రుచికోసమే కాదు ఇది తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది మరి అలాంటి కౌజు పిట్టలను తీసుకువచ్చివ్యాపారంగా చేసుకుంటే ఇంకా లాభాలు మన ఊహకు కూడా అందవేమో కదా..ఇప్పటికే చాల ప్రాంతాలలో కౌజుపిట్టలనే విక్రయిస్తు లాభాలు పొందుతున్నారు చాల మంది నవ రైతులు….Quail Farming
జంతువులను పక్షులను మాంసాహారం కొరకు పెంచడము మన పూర్వీకుల తరంనుంచి ఆచారంగా వస్తున్న సంగతి మన అందరికి తెసిందే కదా. ఇందులో భాగంగా కోళ్ళను మరియు బాతులను కూడా పెంచుతుంటారు. ఇవే కాకుండా ఈ మధ్య కాలంలో కౌజు పిట్టల పెంపకం కూడా ఎక్కువగా జరుగుతుంది. ఈ పిట్టలనే ఎంచుకొని తమ వ్యాపారాలని కొనసాగిస్తున్నారు కొందరు.ఇక్కడ కంజు పిట్టల పెంపకం మరియు వాటికీ కావాల్సిన ఆహారం తెలుసుకుందాం రండి…!
కౌజు పిట్టల పెంపకం…
జంతువులను పక్షులను మాంసాహారం కొరకు పెంచడము మన పూర్వీకుల తరంనుంచి ఆచారంగా వస్తున్న సంగతి మన అందరికి తెసిందే కదా. కోళ్ళలో బ్రాయిలర్ కోళ్ళు, గ్రుడ్లు పెట్టే కోళ్ళు, గినీ కోళ్ళు, సీటీ కోళ్ళు, ఈము పక్షులు, కౌజు పిట్టల ఇలా అనేక పక్షుల పెంపకం ఇటీవల జోరుగా సాగుతుంది. ఐతే ఈ కౌజు పిట్టల పెంపకం మాత్రం కొంచెం కొత్తగా చూస్తున్నం సాధారణంగా మన పూర్వికులు వీటిని దొరికినపుడు మాత్రమే తినేవారు ఇపుడు వీటిని చాల వరకు పెంచి అముతున్నారు. బ్రతికి ఉన్న కౌజు పిట్టలో 70 – 73 శాతం బరువు మరియు కౌజు పిట్ట మాంసం కలిగి ఉంటాయి. సాధారణంగా,ఒక 140 గ్రాముల బరువు ఉన్న కౌజు పిట్ట నుంచి 100 గ్రాముల కౌజు పిట్ట మాంసం వస్తుంది…Quail Farming
కౌజు పిట్టల పెంపకం వైపు మొగ్గు చూపడానికి కారణాలు…
- అతి తక్కువ స్థలం, తక్కువ పెట్టుబడి సరిపోతుంది.
- తక్కువ వయసులోనే అనగా 5 వారాల వయసులోనే ఎదుగుతాయి.
- ఆరు నుండి ఏడు వారాల వయసులోనే గుడ్లు పెట్టడం మొదలుపెడతాయి.
- ఎక్కువ సంఖ్యలో గుడ్లు పెడతాయి అనగా ఏడాదికి 280 గుడ్లు వరకు ఈ కంజు లు పెడతాయి.
- కోడి మాంసం కంటే కూడా కౌజు పిట్ట మాంసం రుచిగా ఉంటుంది అని చాల మంది భావిస్తారు. అంతేకాక కొవ్వు పరిమాణం కూడా తక్కువగా ఉంటుంది. పిల్లలలో ఈ మాంసం, శరీర, మెదడు అభివృద్ధికి బాగా దోహదపడుతుంది.
- పోషకపరంగా చూస్తే, కౌజు గుడ్లు, కోడి గుడ్లతో సమానంగా బలవర్ధకమైనవి. అంతేకాకుండా కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది.
- గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, కౌజు పిట్ట మాంసం, గుడ్లు ఒక పౌష్టికాహారం
పెంపకం, నిర్వహణ పంజరం పద్ధతి…
రెల్లుగడ్డి పరచిన స్థలం 6 కౌజు పిట్టలను 1 చదరపు అడుగు స్థలంలో పెంచవచ్చు. రెండు వారాల తరువాత, కౌజు పిట్టలను, పంజరాలలో పెట్టి పెంచవచ్చు. అనవసరంగా పక్షులు, అటూ యిటూ తిరగలేక పోవడం వలన, మంచి శరీర బరువు వస్తుంది.
పంజరం పద్ధతి…
కౌజు పిట్టల పంజరంలో పెట్టి పెంచే విధానం
- ప్రతీ పంజరం సుమారు 6 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి, తిరిగి ఆరు చిన్న పంజరాలుగా విభజింపబడుతుంది.Quail Farming
- స్థలం ఆదా చేయుటకు, పంజరాలను 6 అరలుగా ఏర్పాటు చేయవచ్చు. 4 లేదా 5 పంజరాలు ఒక వరుసలో వచ్చేటట్లు నిర్మించుకోవాలి.
- పంజరం అడుగుభాగం, చెక్కపలకతో అమర్చబడి, పక్షుల రెట్టలను శుభ్రపరచడానికి వీలుగా ఉంటుంది.
- పొడవైన, సన్నని మూతిగల మేత తొట్టెలను పంజరాల ముందు ఏర్పాటు చేస్తారు. నీటి తొట్టెలను, పంజరం వెనుకభాగం వైపు ఏర్పాటు చేస్తారు.
- వ్యాపారానికి పనికి వచ్చే, గుడ్లు పెట్టె పక్షులను, సాధారణంగా, 10 – 12 పక్షులను ఒక పంజరానికి చొప్పున సముదాయంగా పెంచుతారు. సంతానోత్పత్తి కోసం, మగ కౌజు పిట్టలను పంజరంలోనికి ఒక మగపక్షి, మూడు ఆడ పక్షుల నిష్పత్తిలో ప్రవేశపెట్టాలి.Quail Farming
మేత (ఆహారం)…
మేతలోని పదార్ధాలు (feed ingedicuts) 1.పక్షిపిల్ల (కూనకు) కావలసిన గుజ్జుమేత (chick mash) /2.పెరుగుతున్నపక్షిపిల్లకు కావలసిన గుజ్జుమేత .మేత తయారు చేయుటకు కావలసిన ముడి పదార్థములు స్వల్ప తేడాలో తయారు చేయ వలసి వుంటుంది. 1.మొక్కజొన్నలు (maige) 2.జొన్నలు (sorghum) 3.నూనె తీసివేసిన ధాన్యపు పొట్టు (deoiled bran) 3.వేరు శనగ పిండి (ground nut cake) 4.పొద్దుతిరుగుడు పిండి (sunflower cake) 5.సోయా పిండి (soya meal) 6.చేపల మేత (fish meal) 7.ఖనిజ లవణాల మిశ్రమం (mineral mineral mix) 8.గుల్లల పొట్టు (shell grill)
మేత చిన్న రేణువులుగా చేయాలి. ఒక 5 వారాల వయసు ఉన్న పిట్ట, సుమారు 50 గ్రాముల మేత తింటుంది. 6 మాసాల వయసు ఉన్న కౌజు పిట్టలు, ఒక రోజుకు సుమారు 30 – 35 గ్రాముల ఆహారాన్ని తీసుకుంటాయి. కౌజు లకు 12 గుడ్లును పెట్టడానికి సుమారు 400 గ్రాముల మేత అవసరం పడుతుంది. మాంసం కొరకు పెంచే పక్షులకు ముందు మేతలో, 5 కేజీల తెలగ పిండి కలిపి 75 మేతలను పక్షులకు ఇవ్వవచ్చు. మేతలో ఉండే రేణువులను మరియు ఇంకొకసారి నూరితే ఇంకొంచెం మెత్తగా చేయవచ్చు.
కౌజు పిట్టల పెంపక నిర్వహణ…
6 వారాల వయసు లో, ఆడ కౌజు పిట్టలు, సామాన్యంగా 175 – 200 గ్రాముల బరువు అలాగే మగ కౌజు పిట్టలు 125 – 150 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. ఆడ కౌజు పిట్టలు, 7 వారాల నుండి గుడ్లను పెట్టడం మొదలు పెట్టడం జరుగుతుంది, 22 వారాల వయసు వచ్చే వరకూ కూడా ఈ పక్షులు గుడ్లను పెడుతూనే ఉంటాయి . సాధారణంగా రోజు లోని సాయంత్రం సమయ కాలంలో ఈ పక్షులు గుడ్లు పెడ్తాయి. ఈ పక్షి గుడ్లు సామాన్యంగా సుమారు 9 – 10 గ్రాముల బరువు కలిగి ఉంటాయి. సాధారణంగా కంజు పిట్టలు, మగ పక్షి ఛాతీ చిన్నగా ఉండి, గోధుమ రంగు, తెల్లటి ఈకలతో సరిసమానంగా కప్పబడి ఉంటుంది. కాని, ఆడ కౌజు పిట్ట ఛాతీ వెడల్పుగా ఉండి, గోధుమ రంగు ఈకలు, వాటిపై నల్లని చుక్కలతో ఈ పక్షి రూపురేఖలు ఉంటాయి . ఆడ, మగ కౌజు పిట్టలు, 4 వారాల వయసులో వేరు చేయాలి . గుడ్లు పెట్టె కౌజు పిట్టలకి, రోజుకు 16 గంటల వెలుతురు కావాల్సి ఉంటుంది.Quail Farming
కౌజు పక్షుల పిల్లల పెంపకం…
సామాన్యంగా, 1 రోజు వయసు గల కౌజు పిట్ట పిల్ల 8 – 10 గ్రాముల బరువు కలిగి ఉంటాయి . అందువలన, కౌజు పిట్ట పిల్లలకు ఎక్కువ ఉష్ణోగ్రత అవసరం పడుతుంది . సరిపోయినంత ఉష్ణోగ్రత లేకపోవడం మరియు వేగంగా వీచే చల్లటి గాలులకు గురికావడం వలన, పిల్లలు గుంపుగా చేరతాయి. దీని వలన అధికంగా చనిపోయే అవకాశాలు ఉంటాయి.
పునరుత్పత్తి…
7 వారాల వయసులో నుంచే ఈ కౌజు పక్షులు గుడ్లు పెట్టడం మొదలు పెడతాయి. ఎనమిది వ వారం వయసులోనే 50 శాతం గుడ్లు ఉత్పత్తి చేసే స్ధితికి ఈ పక్షులు చేరుకుంటాయి. శ్రేష్టమైన గుడ్ల ఉత్పత్తి కోసం, 8 – 10 వారాల వయసు గల మగ కౌజు పిట్టలు, ఆడ కౌజు పిట్టలతో పాటు పెంచాల్సి ఉంటుంది. మగ మరియు ఆడ కౌజు పిట్టల నిష్పత్తి 1 : 5 కౌజు పిట్టలతో గుడ్లు పొదగ బడే సమయం 18 రోజులు 500 ఆడ కౌజు పక్షులతో , మనం వారానికి 1500 కౌజు పిట్టల పిల్లలను ఉత్పత్తి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.Quail Farming
కౌజు పిట్టల వ్యాధులు, నివారణ…
సంతానోత్పత్తి దశలో ఉన్న కౌజు పక్షులలో ఖనిజలవణాలు, విటమిన్లు లోపం ఉంటే, వాటి గుడ్ల నుండి పొదగబడిన పిల్లలు సాధారణంగా సన్నగా మరియు బలహీనమైన కాళ్ళతో ఉంటాయి. ఈ విధంగా జరగకుండా ఉండాలంటే, గుడ్లు పెట్టబోయే ఆడ పిట్టలకు సరిపడినంత ఖనిజలవణాలు మరియు విటమిన్లను మొదలైనవి అధిక స్థాయిలో మేతలో కలిపి పోషక విలువలు నిండిన ఆహారాన్ని వాటికీ ఇవ్వాల్సి ఉంటుంది…Quail Farming
కోడి పిల్లల కంటే సాధారణంగా కౌజు పిట్టలకు రోగనిరోధక శక్తిని ఎక్కువ స్థాయిలో కలిగి ఉంటాయి. అందువలన, రోగనిరోధక టీకాలు కౌజు పిట్టలకు వేయవలసిన పని లేదు. కౌజు పిట్టల పిల్లలను సక్రమంగా పెంచడం మరియు పెంపక నగరంలో వచ్చే అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తపడడం, పరిశుభ్రమైన త్రాగునీరు, మంచి ప్రమాణాలు గల మేతను అందచేయడం వలన, కౌజు పిట్టల పెంపకం నగరంలో వ్యాధులు ప్రబల కుండా ఉంటాయి.Quail Farming
కౌజు పిట్టల పెంపకంలో ఎదురయ్యే సవాళ్ళు…
మగ కౌజు పిట్టలు సామన్యంగా, విచిత్రమైన శబ్దాలని చేస్తుంటాయి. అవి మనుష్యులకి చికాకు కలిగిస్తాయి. మగ మరియు ఆడ కౌజు పిట్టలను కలిపి పెంచినప్పుడు, మగ పక్షులు ఆడ పక్షులను ముక్కుతో పొడిచి గుడ్డి వాటిని చేసే ఆస్కారం కూడా ఉంటుంది అలాగే కొన్ని సమయాల్లో కౌజు పిట్టలు చనిపోవడం కూడా సంభవిస్తుంది అందుకు కంజు పిట్టలను ఎప్పటికపుడు గమనిస్తూ ఉండాలి…Quail Farming
గమనిక : కంజు పిట్టల యొక్క పూర్తీ సమాచారం అంతర్జాలంలో మరియు నిపుణుల ద్వారా తీసుకోవడం జరిగింది…వీటి గురించి మీకు మరింత సమాచారం కావాలి అనుకునే వారు లేదా ఈ వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారు మీ సమీపంలోని నిపుణుల సలహా తీసుకోవడం మేలు….Quail Farming