Rajma in Telugu : రాజ్మాని రోజు తింటే, ఈ ఆరోగ్య సమస్యలు అన్ని పరార్…!
రాజ్మా.. చాలా మంది బాగా ఇష్టంగా తినే ఆహారం Rajma in Telugu. దీనిని ఆంగ్లములో కిడ్నీ బీన్స్ (Rajma) అని పిలుస్తారు. ఎందుకంటే రాజ్మా చూడటానికి సరిగ్గా కిడ్నీ ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఈ రాజ్మా తో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ఇందులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారపదార్థాల్లో మనకు పోషకాలు మెండుగా ఉంటాయి. ప్రోటీన్స్, ఖనిజాలు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాల్లో రాజ్మా ఒకటి. ఇవి..నలుపు, ముదురు ఎరుపు, లేత ఎరుపు ఇలా మొదలైన రంగులలో మనకు లభిస్తుంది.. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి…అవి ఏంటో ఇక్కడ చూద్దాం..
రాజ్మాలో అధిక మొత్తంలో ఐరన్, మెగ్నీషియం, కార్బోహైడ్రెట్, పొటాషియం, పాస్పరస్, ఫైబర్, సోడియం, కాపర్, ఫోలేట్, కాల్షియం వంటి మొదలైన అనేక పోషక విలువలు ఉంటాయి. అంతేకాకుండా…ఇందులో కేలరీలు తక్కువ స్థాయిలో ఉంటాయి. దీంతో ఇది బరువు తగ్గించడంలోనూ సహాయపడుతుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడంలో దోహదపడుతాయి. మలబద్ధకం సమస్యను నియంత్రిస్తుంది. రాజ్మాను రెగ్యూలర్ గా తినడం వలన కడుపు సంబంధిత సమస్యలు రావు. అలాగే మలబద్ధక సమస్య కూడా నియంత్రిస్తుంది. ఈ రాజ్మా లో ఫైబర్ మెండుగా ఉండడం వలన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మన కడుపు శుభ్రంగా ఉంటుంది.
ఎముకల నొప్పిని కూడా తగ్గిస్తుంది. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ రాజ్మా తినడం వలన ఎముకల నొప్పి తగ్గు ముఖం పడుతుంది. అలాగే ఈ రాజ్మా లో కాల్షియం కంటెంట్ ఉండడం వలన ఎముకలను బలంగా చేస్తాయి. క్యాన్సర్ ప్రమాదాన్ని నియంత్రిస్తుంది. దీనిని రోజూ తినడం వలన శరీరం లో బయోయాక్టివ్ సమ్మేళనాలను పెంచుతుంది. దీంతో క్యాన్సర్ ప్రమాదం తగ్గు ముఖం పడుతుంది. ఈ రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని నియంత్రిస్తుంది.
అంతేకాకుండా.. రాజ్మా తీసుకోవడం వలన మన శరీరంలో ఐరన్ లోపాన్ని తగ్గిస్తుంది. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో తొడపడుతుంది…దీనిని మన ఆహారంలో తీసుకోవడం వలన మన రోగ నిరోధక శక్తిని అందించడమే కాకుండా.. ప్రోటీన్ కణాలను పెంచుతుంది… రోగ నిరోధక శక్తిని మాత్రమే కాకుండా.. శరీరానికి బలాన్ని, శక్తిని అందించడానికి రెగ్యూలర్ గా రాజ్మా తీసుకోవడం శ్రేయస్కరం. రాజ్మాలో యాంటీ ఆక్సిడెంట్స్, ఫోలిక్ యాసిడ్, జింక్, ఐరన్ మెండుగా ఉండడం వలన మీరు దృడంగా ఉంటారు.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Rajma in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు