Ration Dealer : రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ అందించిన తెలంగాణ సర్కార్…సన్నబియ్యంతో పాటు అవి కూడా…2024

Ration Dealer : రేషన్ కార్డుదారులకు గుడ్‌న్యూస్ అందించిన తెలంగాణ సర్కార్…సన్నబియ్యంతో పాటు అవి కూడా…

తెలంగాణలోని Ration Dealer కార్డు దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎప్పుడెప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని ప్రజలు ఎదురుచూస్తున్న సమయలో… పాత రేషన్ కార్డు దారులకు మాత్రం తీపి కబురు అందించారు…ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం.. రేషన్ కార్డుదారులందరికీ సన్న బియ్యం ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సన్నబియ్యంతో పాటు గోధుమలు కూడా ఇవ్వనున్నట్టు వెల్లడించారు.అయితే.. ఈ సన్నబియ్యం ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి అంటే … ?

తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త చెపింది.వారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం.. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. అయితే.. సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో .. సన్నబియ్యం పంపిణీతో పాటు రేషన్ బియ్యం సరఫరాలో అక్రమాలు లాంటి కీలక విషయాలపై చర్చజరిపారు. అయితే.. ఎన్నికల్లో ఇచ్చిన మాట మేరకు.. సన్న బియ్యం కచ్చితంగా ఇస్తామమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేసారు. వచ్చే సంవత్సరం జనవరి నుంచే తెల్లరేషన్‌ కార్డు లబ్ధిదారులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. Ration Dealer

మరోవైపు.. రేషన్‌ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయని ఆఫీసర్ల ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రేషన్ బియ్యం సరఫరాలో వైరుడైన అక్రమాలకు పాల్పడితే.. డీలర్‌షిప్‌ రద్దు చేయటమే కాకుండా కఠిన చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యం లో.. రేషన్ కార్డు వినియోపగదారులకు సన్నబియ్యంతో పాటు.. గోధుమలు కూడా ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ఉత్తమ్ తెలియజేసారు . ఐతే గోధుములను బియ్యంలా మొత్తం ఫ్రీగా కాకుండా.. సబ్సిడీతో ఇవ్వాలని తెలంగాణ సర్కార్ ఆలోచిస్తున్నట్టు వెల్లడించారు. మరోవైపు.. తెలంగాణలో ఖాళీగా ఉన్న 1629 రేషన్ డీలర్ల భర్తీకి చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించడం జరిగింది…

ఈ సంగతి ఇలా ఉంటే.. ఇక తెలంగాణ వాసులకు ఎప్పుడెప్పుడా అని వేచిచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీపై ఇప్పటికే సబ్ కమిటీ కీలక ప్రకటన విడుదల చేసిన విషయం అందరికి తెలిసిందే. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అయితే..తెలంగాణ రాష్ట్రంలోని అర్హులైన అందరికీ తెల్ల రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించటంతో పాటు.. పాత రేషన్ కార్డుల స్థానంలోనూ కొత్తగా స్వైప్ కార్డుల తరహా రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. Ration Dealer

అయితే.. కొత్తగా మంజూరు చేసే రేషన్ కార్డుల విషయంలో పలు ఆంక్షణాలను పెట్టాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే.. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి సంవత్సర ఆదాయం లక్షన్నరగానూ.. మాగాణి మూడున్నర ఎకరాలు, చెలక ఏడున్నర ఎకరాలు ఉండాలని… ఇక పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నవారి సంవత్సర ఆదాయం 2 లక్షలు ఉన్నవారికే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ నిర్ణయంపై ఇంకా అధికారిక ప్రకటన ఇంతవరకు రాలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top