Cheque Rules:చెక్ కు వెనుకవైపు కూడా ఎందుకు సంతకం చేయాలో తెలుసా? అసలు రహస్యం ఇదే!
Cheque Rules: ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్ చెల్లింపులు పెరిగినప్పటికీ,కొన్ని ముఖ్యమైన లావాదేవీల కోసం ఇంకా చెక్కులు ఇప్పటికీ ఉపయోగించబడుతున్నాయి. Bank లో చెక్కును Deposit చేసేటప్పుడు, చెక్కు వెనుక సంతకం చేయాలి. దీని వెనుక అసలు కారణం ఏంటో తెలుసా?
చెక్ బుక్ చాలా మంది వాడుతూనే ఉంటారు. ఎక్కువ మొత్తంలో Transactions నిర్వహించాలంటే చెక్ బుక్ (Cheque Book) ఖచ్చితంగా ఉండాల్సిందే. చెక్ బుక్ ఉన్న వారు చెక్ ఇష్యూ చేసేటప్పుడు చాలా కేర్ గా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
చెక్కు రాసేటప్పుడు, దానిపై తేదీ, పేరు, ప్రతిదీ రాస్తాము. దీనితో పాటు, చెక్ క్రింది కుడి సేడ్ చివర్లలో కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. దీని తర్వాత చెక్ Bank లేదా ఇతర వ్యక్తికి జారీ చేయబడుతుంది.
మీ స్వంత ఖాతా కోసం చెక్కును ఇష్యూ చేసేటప్పుడు, చెక్కు వెనుక వైపు కూడా సంతకం చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు చెక్కు వెనుక వైపు సంతకం చేయడం మరిచి పోతే,కొన్నిసార్లు బ్యాంక్ సిబ్బంది దీనిపై సంతకం చేయమని మీకు గుర్తు కూడా చేస్తారు. కానీ,చెక్ బ్యాక్ సైడ్ ఎందుకు సంతకం చేయాలి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా?
చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లిన తర్వాత చెక్కును క్యాషియర్‌కు ఇస్తారు. అప్పుడు అతను కస్టమర్‌కు చెల్లిస్తాడు లేదా డబ్బులు ఇస్తాడు. దీని తర్వాత కస్టమర్ వెళ్లిపోతాడు. ఇలా అయితే సరే. కానీ,కస్టమర్ కొంత సమయం తర్వాత మల్లి తిరిగి వచ్చి, క్యాషియర్‌ని మళ్లీ రీఫండ్ కోసం డబ్బులు అడిగితే? కాబట్టి క్యాషియర్ రుజువు కోసం చెక్ వెనుకాల సంతకం చేయమని లేదా లావాదేవీ పూర్తయినట్లు చూపమని మిమ్మల్ని అడుగుతాడు. ఇది నియమం కోసం మాత్రమే చేయబడుతుంది.
Cheque Rules: అలా చేయడానికి మరో కారణం కూడా ఉంది. ఎందుకంటే, Tokenize చేసిన తర్వాత మీ చెక్కు నిజానికి పోయిందని అనుకుంటే, ఒక తెలియని వ్యక్తి మీ చెక్ తో బ్యాంకుకు వచ్చి , డబ్బు విత్‌డ్రా చేయడానికి వచ్చిన సమయంలో ఆ వ్యక్తి చెక్ పైన ఉన్నట్టుగా సమ్ సంతకం చేయకపోతే, దొంగ పట్టుబడతాడు.
చెక్కును చెల్లించే వ్యక్తి తర్వాత దానిని క్యాష్ చేసుకోవడానికి తిరస్కరించినప్పుడు, ఈ గుర్తు వాస్తవాన్ని వెల్లడిస్తుంది. క్యాషియర్, PAN కార్డులో అతని సంతకాన్ని అతని PAN నంబర్‌తో సరిపోల్చిన తర్వాత మాత్రమే బేరర్ చెక్కును చెల్లిస్తాడు. మీ డబ్బు భద్రత కోసం బ్యాంకు ఇవన్నీ చేస్తుంది.