Ridge Gourd in Telugu : బీరకాయ తినడం వలన, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం.

Ridge Gourd in Telugu : బీరకాయ తినడం వలన, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతం.

Ridge Gourd in Telugu : చాలామంది బీరకాయలను అంత ఇష్టంగా తినరు. కానీ బీరకాయలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. ఈ బీరకాయలలో ఉండేటువంటి పోషక పదార్థాలు మన శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. బీరకాయలలో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉంటాయి. వాటర్ , ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండి, పోషకాలు కూడా అధికంగా ఉండటం వల్ల బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుంది.

బీరకాయలలో మనకు Vitamin A, Vitamin C, Magnesium, Vitamin B6, Potassium, Sodium మరియు ఐరన్ , జింక్ , రాగి, థయామిన్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. కాబట్టి ఈ పోషకాలు మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇక బీరకాయ తింటే కలిగే ,ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రస్తుతం ఇక్కడ తెలుసుకుందాం.

Beerakaya in Telugu బీరకాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు బీరకాయలో ఉండేటువంటి పోషకాలు మన శరీరంలోని మలినాలను తొలగించి , రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి. బీరకాయ లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరకాయలో ఉండే పుష్కలమైన Vitamin C,ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాల కారణంగా ఇవి మన Immunity Power ని మెరుగుపరుస్తాయి.

Nethi Beerakaya శరీరంలో ఇన్ఫెక్షన్స్ ని తగ్గించడానికి దోహదం చేస్తాయి. బీరకాయలో ఉండే, పీచు పదార్థాల వల్ల మన Digestive system బాగుపడుతుంది. బీరకాయలతో ఈ సమస్యలకు చెక్ ఇక బీరకాయలో ఉండే ఇనుము , ఐరన్ లోపం ఉన్నవారిలో వచ్చేటువంటి Anemia సమస్యను తగ్గిస్తుంది. శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నొప్పి, అలసట వంటి లక్షణాలను లేకుండా చేస్తుంది.

Ridge Gourd in Telugu బీరకాయలలో Dietary ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధక సమస్య తో బాధపడే , వారికి ఆ సమస్యను ఈ బీరకాయ తగ్గిస్తుంది. బీరకాయలో పొటాషియం, మెగ్నీషియం అధికంగా ఉండడం వల్ల మన హృదయం పనితీరును ఇది మెరుగుపరుస్తుంది.

ఊబకాయం తో పాటు, మధుమేహం కు కూడా ఈ బీరకాయతో చెక్ పెట్టవచ్చు. బీరకాయలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి మన హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.ఇందులో ఉండే Vitamin B5 మన బడిలోని బాడ్ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. బీరకాయ బరువు తగ్గడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. బీరకాయల్లో ఉండే పోషకాల కారణంగా డయాబెటిస్ కూడా అదుపులో ఉంటుంది. రక్తంలో మాత్రమే కాదు మూత్రంలో కూడా చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకు బీరకాయ దోహదం చేస్తుంది.

Ridge Gourd in Telugu బీరకాయలు తినడం వలన ఆరోగ్యం మెండు. బీరకాయలలో ఉండే Vitamin A మన కళ్ళ యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బీరకాయ తినడం వలన అల్సర్లతో బాధపడే వారికి శరీరంలోని వేడిని తగ్గించే Cooling agent గా కూడా పనిచేస్తుంది. మూత్ర విసర్జన టైంలో వచ్చే మంటను కూడా బీరకాయ తగ్గిస్తుంది.

ఈ విధంగా ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చేటువంటి బీరకాయలను ఆహారంలో భాగంగా చేసుకుంటే, కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో. కాబట్టి మరెందుకు ఆలస్యం బీరకాయలలో ఉన్న బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకున్న తర్వాత నాకొద్దు అనకుండా ప్రతి ఒక్కరు బీరకాయలను తినడం మొదలుపెట్టండి.

గమనిక : ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు అంతర్జాలం లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని Todayintelugu.com ధృవీకరించలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top