అన్నదాతల కుటుంబాలకు రూ.5 లక్షల ప్రభుత్వ స్కీమ్. వెంటనే అప్లై చేసుకోండిలా! Rythu Bima Pathakam: 2024
Rythu Bima Pathakam: రైతులకు హెచ్చరిక . రూ. 5 లక్షల ప్రయోజనం లభించే ఈ స్కీం లో మీరు చేరారా..? లేదంటే మాత్రం వెంటనే చేరిపోండి. ఎలా దరఖాస్తు చేసుకోవాలో..? ఎటువంటి డాక్యుమెంట్లు కావాలో తెలుసుకోండి.
Rythu Bima Pathakam: రైతులకు హెచ్చరిక . ఏంటని అనుకుంటున్నారా. ప్రభుత్వం అదిరే స్కీమ్ అందుబాటులో ఉంచింది. ఈ పథకం కింద ఏకంగా రూ. 5 లక్షల వరకు ప్రయోజనం పొందొచ్చు. ఇంతకీ అది ఏ స్కీమ్? ఎలా బెనిఫిట్ లభిస్తుంది? ఎలా అప్లై చేసుకోవాలి? వంటి అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఒక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి ఒక రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా ప్రయోజనం ఉంది. చాలా మంది ఇప్పటికే ఈ స్కీమ్‌లో చేరారు.
Rythu Bima Pathakam: అయితే ఇటీవల భూములను కొనుగోలు చేసిన వారు ఈ పథకం ప్రయోజనాలను కొత్తగా పాస్ పుస్తకం వచ్చే వరకు ఈ స్కీం బెనిఫిట్స్ ని పొందలేక పోవచ్చు. అలాగే వారసత్వంగా భూములు పొందిన వారికి కూడా ఈ ప్రయోజనం ఉండకపోవచ్చు. అంటే కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారు రైతు బీమా పథకంలో చేరి ఉండకపోవచ్చు.
రేవంత్ సర్కార్ ఇలాంటి వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024 July 28 లోపు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందేవారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందువల్ల ఇలాంటి వారు రైతు బీమా కోసం పథకం కోసం ఇప్పుడు దరఖాస్తులను అప్లై చేసుకోవచ్చు.
2024 ఆగస్ట్ 5 లోపు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించేటువంటి బీమా సౌకర్యం లేని ప్రతి ఒక రైతు కూడా ఈ పథకాన్ని దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మీకు ఈ పథకం కింద అర్హత ఉంటే వెంటనే చేరండి.
అర్హత కలిగిన రైతులు వ్యవసాయ అధికారులకు సంప్రదించండి. వారి నుండి దరఖాస్తు ఫారం తీసుకుని ఫిల్ చేయాలి. అంతేకాకుండా పట్టాదారు యొక్క పాస్ బుక్ , ఆధార్ కార్డ్ జిరాక్స్‌లను ఈ అప్లపికేషన్‌కు జత చేయాలి. అంతేకాకుండా నామినీ ఆధార్ కార్డు జిరాక్స్ కూడా అందించాల్సి ఉంటుంది.
Rythu Bima Pathakam: దేశీ దిగ్గజ బీమా రంగ కంపెనీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న Life Insurance Corporation of India (ఎల్ఐసి LIC) సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ రైతు బీమా పథకాన్ని అమలు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
అర్హులైన ప్రతి ఒక రైతులకు జీవిత బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. తద్వారా ఉచితంగానే రైతులకు బీమా లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ఈ స్కీమ్‌లో చేరిన రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 5 లక్షల బీమా మొత్తం లభిస్తుంది. రైతు కుటుంబానికి ఈ డబ్బులు చెల్లిస్తారు. నామినీకి 10 రోజుల్లోపు డబ్బులు లభిస్తాయి. 18 సంత్సరాలు నిండిన యువ రైతుల నుండి 59 సంత్సరాల లోపు వయసు ఉన్న అన్నదాతలు లేదా రైతులు ఈ పథకంలో చేరొచ్చు.