Sapota in Telugu : రోజు చూసే పండే కదా అని తేలిగ్గా తీసుకోకండి…ఇందులోని పోషకాలు అద్భుతం…
సాధారణంగా అని రకాల పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి…Sapota in Telugu ముఖ్యంగా ప్రతి వాతావరణంకి అనుగుణంగా వచ్చే పండ్లను మన డైట్‌లో కచ్చితంగా చేర్చుకోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. వేసవికాలం లో మామిడి తర్వాత మనం ఎక్కువగా ఇష్టపడి తినే పండ్లలో సపోటా ఒకటి అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ఈ పండులో ఉన్న తియ్యటి గుజ్జు నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.. ఈ పండుతో చేసే మిల్క్ షేక్స్, ఐస్ క్రీమ్స్, జ్యూస్‌లను తీసుకుంటు జనాలు ఎంతో ఇష్టంగా ఈ పండుని ఆస్వాదిస్తారు.
ఈ పండు కేవలం టేస్టేలోనే కాదు పోషకాలలోనూ అద్భుతః అంటున్నారు నిపుణులు. సపోటాలో ఐరన్, పోటాషియం, కాపర్, క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్, విటమిన A , B ,C , యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ మెండుగా ఉంటాయి. ఈ పండులో ఆస్ట్రింజెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ పారాసైడ్ లక్షణాలతో కూడిన పాలీఫెనాల్ మొదలైన సమ్మేళనలు టానిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండును మన డైట్‌లో చేర్చుకుంటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో ఇక్కడ వివరించం చదవండి…!
ఎముకలకు బలోపేతం…
సపోటాలో కాల్షియం, ఐరన్, ఫాస్పరస్ మెండుగా ఉంటాయి. ఈ పండ్లు మన ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ పండ్లు తినడం వల్ల మీ ఎముకలకు బలోపేతంగా ఉంచుతాయి, ఆస్టియోపోరోసిస్ ముప్పును నియంత్రిస్తుంది.
ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తుంది…
ఈ పండులోని విటమిన్ C , కాపర్ అధికంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో ఉపయోగపడతాయి. ఈ పోషకాలు శరీరంపై ఫ్రీ రాడికల్స్ ప్రభావానికి నియంత్రిచడంలో పోరాడతాయి Sapota in Telugu. మీరు జలుబు మరియు ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే.. సపోటా తింటే.. నాసికా మార్గం, శ్వాసకోశం సమస్య నయం అవుతుంది.
బీపీ కంట్రోల్‌లో ఉంచుతుంది…
సపోటా హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్ ఉంచడంలో దోహద పడుతుంది. ఈ సపోటాలో సమృద్ధిగా ఉండే పొటాషియం, మెగ్నీషియం.. సోడియం స్థాయిలు నియంత్రిస్తాయి. రక్త ప్రసరణను ప్రోత్సహించి మరియు మీ బ్లడ్ ప్రెజర్ స్థాయిలను మెయింటేన్ చేస్తాయి. ఇది స్ట్రోక్, గుండెపోటు వంటి గుండె సంబంధిత సమస్యల ముప్పును నియంత్రిస్తాయి….పొటాషియం మూత్రం ద్వారా శరీరం నుండి సోడియంను తొలగిస్తుంది. ఇది హైపర్‌టెన్షన్ కంట్రోల్‌లో ఉంచడానికి దోహదపడుతుంది. సపోటాలో ఐరన్ కూడా మెండుగా ఉంటుంది, ఇది రక్తహీనతను నయం చేస్తుంది…
క్యాన్సర్కు చెక్…
ఈ పండులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వివిధ రకాల క్యాన్సర్ల నుంచి కాపాడతాయి. సపోటాలోని విటమిన్ A , B శరీరంలోని శ్లేష్మ పొరలను నిర్వహించడానికి ఉపయోగపడతాయి. ఇది నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సపోటాలో డైటరీ ఫైబర్ మెండుగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను నియంత్రించడంలో ఉపయోగపడతాయి. పెద్దప్రేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.Sapota in Telugu
శరీరంకి తక్షణ శక్తిని ఇస్తుంది…
ఎక్కువ మొత్తంలో కెలొరీలుండే ఈ సపోటా తక్షణ శక్తిని అందిస్తుంది. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చేస్తుంది . ఈ పండులో విటమిన్ A పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాల మేలు చేస్తుంది.
చర్మానికి మేలు చేస్తుంది…
ఈ పండు లో ఆరోగ్యకరమైన, మెరిసే చర్మానికి ఉపయోగపడుతుంది. ఈ పండు లో ఉండే విటమిన్ E మీ చర్మానికి తేమనందిస్తుంది. మెరిసే చర్మాన్ని మీ సొంతం చేస్తుంది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి యాంటీ ఏజింగ్ కాంపౌండ్‌గా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు త్వరగా రాకుండా చేస్తుంది.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Sapota in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు…