Seasonal Fruits: మన భారతదేశంలో ఏ సీజన్‌లో ఏయే పండ్లు, ఏయే కూరగాయలు లభిస్తాయో తెలుసా?
Seasonal Fruits in India:ఇండియాలో విభిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉంటాయి.ఋతువులకు తగినట్లుగా అనేక రకాల పండ్లు మరియు కూరగాయలు లభిస్తాయి. వేసవి కాలం నుంచి చలికాలం వరకు వివిధ రకాల పంటలు పండిస్తూ రైతులు జీవనం సాగిస్తూ ఉంటారు. కాలానుగుణంగా పంటలను వేస్తూ ఉంటారు.
అయితే ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించి, సంవత్సరం పొడవునా సీజన్ తో సంబంధం లేకుండా పండ్లు, కూరగాయలను కూడా పండించే వాళ్ళు ఉన్నారు. కానీ సాంప్రదాయకంగా పండించే కొన్ని పదార్థాలను తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. ఏయే సీజన్ లో ఎటువంటివి పండిస్తారో మీకేమైనా తెలుసా?
వేసవి( మార్చి నుంచి మే వరకు)
Summer Seasonal Fruits:దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున వేసవి వేడిని అధిగమించేందుకు వివిధ రకాల తాజా పండ్లు, కూరగాయలు అందుబాటులో ఉంటాయి. ఈ సీజన్ లో జ్యూసీగా ఉండే పుచ్చకాయలు, నోరూరించేటువంటి మామిడి పండ్లు ప్రధానంగా కనిపిస్తాయి. పుచ్చకాయలోని అధిక వాటర్ కంటెంట్, సహజమైన తియ్యదనంతో ఈ పండ్లు శరీరాన్ని హైడ్రేట్ చేస్తూ, వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇవే కాదు దోసకాయలు, టొమాటోలు, గుమ్మడికాయ, స్నేక్ మిలాన్ లేదా కక్డి, మునగకాయ, జాక్ ఫ్రూట్, దొండకాయ, సొరకాయ, బీరకాయ, కాకరకాయలు పండుతాయి.
seasonal fruits and vegetables:
Summer Seasonal Fruits: సమ్మర్ సీజన్ (Summer Season) ప్రారంభమైంది. మార్చి నెల ప్రారంభం నుండే ఎండల తీవ్రత పెరిగింది. వేడి వాతావరణం, దానితో పాటు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. సాధారణంగా తీవ్రమైన ఎండ వేడికి శరీరంలో పోషకాలు చెమట రూపంలో బయటకు వెళ్లిపోవడం జరుగుతాయి కాబట్టి డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం కూడా ఉంటుంది. అంతే కాకుండా దీంతో మనకు వేడి కూడా చేయవచ్చు.
Seasonal Fruits: కాబట్టి అందుకే ఈ సమస్యలు రాకుండా సమ్మర్‌లో కొన్ని రకాల పండ్లని తినాలి. ఈ సీజనల్ ఫ్రూట్స్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది.కాబట్టి ఇవి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ సీజన్‌లో అందరూ తినాల్సిన సమ్మర్ ఫ్రూట్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.
Seasonal Fruits: ఖర్బూజ: సమ్మర్ ఫ్రూట్‌లలో ఖర్బూజ ఒకటి. ఈ పండులో వాటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవిలో శరీర ఉష్ణోగ్రత పెరగకుండా నిరోధిస్తుంది. విటమిన్ A సమృద్ధిగా లభించేటువంటి ఖర్బూజ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. శరీర కణాల్లో అంతర్గత వాపును తగ్గిస్తూ కణాల మరమ్మత్తులో లో కీలకపాత్ర పోషిస్తుంది. ఎండల తీవ్రత నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. దీంట్లో మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఇవి జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఖర్బూజలో ఉండేటువంటి బీటా కెరోటిన్ కళ్ల కు వచ్చేటువంటి మంటను తగ్గిస్తే, యాంటీ-ఆక్సిడెంట్స్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపుతాయి. ఖర్బూజ పండు హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది.
పుచ్చకాయ: సమ్మర్ ప్రూట్స్‌లో పుచ్చకాయ కూడా ఒక ప్రధానమైనది. ఇందులో 90 % వాటర్ కంటెంట్ ఉంటుంది. వేసవిలో వేడి తాపం నుంచి శరీరానికి ఉపశమనాన్ని కల్పిస్తుంది. అందుకే పుచ్చకాయలకు ఈ సీజన్‌లో డిమాండ్ బాగా ఉంటుంది. వీటిలో విటమిన్ ఎ , విటమిన్ B6, విటమిన్ సి తో పాటు పొటాషియం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇమ్మ్యూనిటీ పవర్ ని పెంపొందిస్తాయి. దగ్గు, జలుబు, అలర్జీలు వంటి వేసవి వ్యాధులను దూరం చేస్తాయి. పుచ్చకాయలోని నీటిశాతం డీహైడ్రేషన్‌ను నివారించడంలో తోడ్పడుతుంది. దీంట్లోని పోషకాలు కండరాలను అనువైనవి గా ఉంచుతాయి, హృదయ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి.
మామిడి: పండ్లలో రారాజు, సమ్మర్ సీజన్‌లో మాత్రమే లభించే పండు మామిడి. వీటిలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. వేసవి తాపంతో శరీరంలో శక్తి నశిస్తుంది. ఆ సమయంలో మామిడి పండ్లు తింటే శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. వీటిలో ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. విటమిన్లు, పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
బొప్పాయి: వేసవిలో రుచిచూడాల్సిన పండ్లలో బొప్పాయి ఒకటి. దీంట్లో విటమిన్ A , విటమిన్ C, ఫోలియేట్, ఫైటోకెమికల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి జీర్ణకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని నివారిస్తాయి. బొప్పాయిలోని బీటా కెరోటిన్ వేసవిలో తరచుగా సంభవించే కళ్ల ఒత్తిడిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది, ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. బొప్పాయిలోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.
జామ: జామ పండ్లలోని పోషకాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ పండు రక్తంలో షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. అందుకే షుగర్ పేషెంట్లకు జామ సూపర్ ఫ్రూట్‌గా చెబుతారు. వేసవిలో జీర్ణ సమస్యలు తలెత్తడం సహజం. అయితే జామ పండ్లను తింటే, అందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపర్చుడంలో సహాయపడుతుంది. సంతృప్తి భావనను పెంపొందిస్తుంది. వేసవిలో తీవ్రమైన ఎండలు చర్మ సమస్యలకు దారితీయవచ్చు. జామ పండు తింటే చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
వర్షా కాలం( జూన్ నుంచి సెప్టెంబర్):
Monsoon Seasonal Fruits in India : ఋతుపవనాల రాకతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఎండిపోయిన భూములకి వర్షంతో నీటిని అందిస్తుంది. సరైన సమయానికి వర్షాలు పడటం వల్ల పంటల సంపద, వృద్ధి పెరుగుతుంది. ఈ కాలంలో బచ్చలి కూర, మెంతి ఆకు, ఉసిరి ఆకు వంటివి చిరించడం మొదలు చెందుతాయి. వీటిలో శరీరానికి అవసరమైనటువంటి పోషకాలు అందటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. భుట్టా అని పిలిచే అందరికి ఫేమస్ అయినటువంటి మొక్క జొన్న ఈ సీజన్ లోనే లభిస్తుంది. తియ్యని లిచీలు, టార్ట్ జామున్, సువాసన కలిగిన జామ పండ్లు కూడా దొరుకుతాయి.
Seasonal Fruits: ప్రస్తుతం మనం వేసవి కాలం ఎండింగ్ లో ఉన్నప్పుడు . జూలై నుంచి వర్షా కాలంలోకి వెళ్లిపోతాము. వేసవిలో ఎండ వేడి తగలకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో, అలాగే వర్షాకాలంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వర్షాకాలంలో పాడేటువంటి చిటపట చినుకుల మధ్య గరం గరంగా ఏమైనా చిరుతిళ్లు తినాలనిపిస్తుంది. కానీ, శరీరానికి పోషకాలు అందించే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం, పండ్లు తినడం అనేది ఉత్తమం.
Monsoon Seasonal Fruits in India : ఇది సీజన్ మారే సమయం కావడంతో జ్వరం, జలుబు, అలర్జీ, ఇన్ఫెక్షన్స్ , అజీర్ణ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటినుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే శరీరానికి శక్తి చాలా అవసరం. వ్యాధినిరోధక శక్తి కూడా అవసరమనే చెప్పాలి. ప్రస్తుతము ఉన్న పరిస్థితుల్లో మన ఆరోగ్యానికి వ్యాధినిరోధక శక్తి ఎంతో అవసరం కూడా. అందుకు తినాల్సిన పండ్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
నేరేడు: సీజనల్ గా వర్షాకాలంలో నేరేడు పండ్లు వస్తాయి. వీటిలో కేలరీలు తక్కువ. ఐరన్, ఫోలేట్, పొటాషియం, విటమిన్స్ ఎక్కువగా ఉండటంతో బరువు తగ్గాలనుకునే వారికి ఇవి మంచి చాయిస్. అజీర్తిని కూడా తగ్గిస్తాయి.
చెర్రీస్: వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే పండ్లలో చెర్రీస్ ఒకటి. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పండ్లు ఇవి. మెదడుపై ఒత్తిడి తగ్గించి ప్రశాంతత కలిగేలా చేస్తాయి. ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
అరటిపండ్లు: విటమిన్స్ ఎక్కువగా ఉండే అరటిపండు ఎంతో ఆరోగ్యం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అజీర్తి సమస్యలను పోగొడుతుంది. పిల్లలకు అరటిపండ్లు చాలా మంచివి. రోజుకో పండైనా తినిపించాలి. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.
యాపిల్: వర్షాకాలానికి తగ్గట్టు శరీరంలో చురుకుదనం కాస్త నెమ్మదిస్తుంది. దీంతో శరీరంలో జరిగే జీవక్రియ వేగం కూడా తక్కువగా ఉంటుంది. వీటిని అధిగమించేందుకు యాపిల్ పండు ఉత్తమం.
ప్లమ్స్: మనలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. ఫ్లూ, జలుబు వంటి ఇన్ ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.
దానిమ్మ: ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. రక్తం పుడుతుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ రోజకొక పండైనా తింటే ఆరోగ్యంగా ఉంటారు.
బొప్పాయి: విటమిన్ ‘C’ అధికంగా లబించే పండు బొప్పాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కాస్త మితంగా తీసుకోవడం ఉత్తమం.
సీతాఫలం:ఈ సీతాఫలం పండులో పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అవి రక్త నాళాలలో ఉంటాయి. కాబట్టి అధిక రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. ఇడే కాకుండా హృదయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో తన వంతు సహాయపడడంలో తోడ్పడుతుంది. అధికంగా ఉండేటువంటి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. Paralysis వంటి వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.
శరదృతువు(అక్టోబర్ నుంచి నవంబర్):
Seasonal Fruits: ఋతుపవనాల నుంచి చల్లటి ఉష్ణోగ్రతలోకి వాతావరణం మారిపోతుంది. ఈ టైమ్ లో కూడా కాలానుగుణంగా పండ్లు పండుతాయి. పియర్స్, దానిమ్మ, యాపిల్, తీపి ద్రాక్ష వంటి పండ్లు ఈ కాలంలో ఎక్కువగా లభిస్తాయి. క్యారెట్, ఎర్ర ముల్లంగి దుంప , ముల్లంగి, చిలగడదుంపతో పాటు క్యాలీఫ్లవర్, బీన్స్ వంటి కూరగాయలు కూడా మార్కెట్ లో దర్శనమిస్తాయి.
శీతాకాలం( డిసెంబర్ నుంచి ఫిబ్రవరి):
Winter Seasonal Fruits in India:మంచుతో కూడినటువంటి వాతావరణం, చల్లని గాలులుతో పాటు నోరూరించే పండ్లు కూడా ఈ సీజన్ లో లభిస్తాయి. ఆరెంజ్ , నిమ్మకాయ, స్వీట్ లైమ్ వంటి సిట్రస్ జాతికి చెందిన పండ్లు అందుబాటులో ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండేటువంటి బచ్చలికూర, మెంతి కూర వంటి ఆకు కూరలు కూడా లభిస్తాయి.
Seasonal Fruits:ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులోని బెల్ పెప్పర్స్, క్యాలీఫ్లవర్, క్యారెట్లు, తాజా బఠానీలు కూడా దొరుకుతాయి. ఈ పదార్థాలు చలిగా ఉండే నెలల్లో మాత్రమే లభిస్తాయి. అందుకే వీటిని చాలా మంది ఫ్రీజింగ్ పద్ధతి ద్వారా ఎక్కువ కాలం నిల్వ ఉంచేలా చూసుకుంటారు.
Winter Seasonal Fruits in India:చలికాలంలో ముఖ్యంగా వ్యాయామానికి వెళ్లడానికి బద్దకిస్తూ, అధిక బరువు సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ బరువును రానున్న వేసవిలో ఎలా తగ్గించాలో? అని ప్రణాళికలు వేస్తుంటాం. అయితే పోషకాహార నిపుణులు మాత్రం బరువు నిర్వహణకు వ్యాయామాలు ఎంత ముఖ్యమో? మంచి ఆరోగ్యకరమైన ఆహారంను తీసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా సీజనల్‌గా దొరికే పండ్లతో పాటు ఆకు కూరలు తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
Seasonal Fruits:సీజనల్ పండ్లల్లో ఉండే అధిక పోషకాల వలన బరువు నిర్వహణలో హెల్ప్ చేస్తాయని వివిధ నివేదికలు వెల్లడిస్తున్నాయి. అలాగే సీజనల్ దొరికేటువంటి పండ్లు ట్రాన్స్‌పోర్ట్ చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవు. కాబట్టి అందులో శరీరానికి అవసరమయ్యేటువంటి పోషకాలను కోల్పోకుండా ఉంటుంది. ప్రస్తుత ఉన్న కాలంలో దొరికే ఏ సీజనల్ ఫ్రూట్స్ తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందో ? ఒకసారి ఇక్కడ తెలుసుకుందాం.
స్ట్రాబెర్రీలు:స్ట్రాబెర్రీలు వేసవి కాలంలో మంచి పోషకాహారంగా కూడా పని చేస్తాయి. వీటిని తరచూ తీసుకుంటే మధుమేహం, క్యాన్సర్, హృదయ జబ్బుల లక్షణాల నుంచి దూరంగా ఉండవచ్చు. ఇవి బాడ్ కొలెస్ట్రాల్‌ను తొలగించి, బరువు నిర్వహణలో అద్భుతంగా సాయం చేస్తాయి.
చెర్రీస్ : చెర్రీస్‌లో క్యాలరీలు తక్కువగా ఉండడంతో శరీరానికి అవసరమయ్యే పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. విటమిన్లుC, A, K వంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటివి శరీరానికి అందుతాయి. బీటా కెరోటిన్, కోలిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉంటాయి. చెర్రీలను తింటే మనస్సు రిలాక్స్ అవ్వడమే కాక నిద్ర సంబంధిత రుగ్మతలను కూడా తొలగించడంలో సాయం చేస్తాయి. రక్తంలో షుగర్ స్థాయిలను, యూరిన్‌లో యూరిక్ యాసిడ్‌ను తగ్గిస్తాయి.
నారింజ: వేసవి కాలం ప్రారంభంలో దొరికే నారింజ వల్ల అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ నారింజ శరీరంలో కణాలను దెబ్బతినకుండా కాపాడడంతో పాటు, కొల్లాజిన్ తయారు చేయడంలో కూడా సాయం చేస్తాయి. నారింజ ప్రధానముగా గాయాలను నయం చేసి, మృదువైన చర్మాన్ని అందిస్తుంది. ఇనుము శరీరంలో సులభంగా సంగ్రహించేలా చేస్తూ, రోగనిరోధక శక్తి మెరుగుదలకు సాయపడుతుంది. ముఖ్యంగా నారింజ సూక్ష్మ క్రిముల నుంచి శరీరాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
బ్లాక్‌బెర్రీస్ :బ్లాక్బెర్రీస్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవిC, A, K మాంగనీస్ వంటి విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉన్నాయి. ఫైబర్ కూడా అధికంగా ఉండడంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయం చేస్తాయి. వాటిలో ఎక్కువ మొత్తంలో విటమిన్లు, ఫైబర్, తక్కువ మొత్తంలో క్యాలరీలు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే మధుమేహాన్ని కూడా నియంత్రించి, జీవక్రియను వేగవంతం చేస్తాయి.
బొప్పాయి: బొప్పాయిలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, సి, ఈ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండి ఆహారం హృదయ జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కొలెస్ట్రాల్ యొక్క ఆక్సీకరణను నిరోధిస్తాయి. బొప్పాయిలు జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడతాయి. ఇవి బరువు తగ్గడాన్ని మరింత వేగవంతం చేస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ అందించడం జరిగింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా నిపుణుల యొక్క సలహాను తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ యొక్క అవగాహన కోసమే.