Self Help Groups : డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్తను అందించింది. ఒక కీలక ప్రకటన కూడా విడుదల చేసింది..!
Self Help Groups :డ్వాక్రా సంఘాల్లో ఉన్న మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఏంటని అనుకుంటున్నారా.. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అందించింది. కీలక అంశాన్ని వెల్లడించింది.
రాష్ట్ర ఆర్టీసీకి అవసరమైన కొత్త బస్సులను మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగోలు చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
self help groups upsc:పొన్నం ప్రభాకర్ శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో నియోజకవర్గంలోని మహిళా స్వయం సహాయక సంఘాల అధ్యక్షురాళ్లు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
మొదటి దశలో 600 మహిళా సంఘాల ద్వారా 600 కొత్త బస్సులు కొనుగోలుకు చర్చలు జరుగుతున్నాయని ఆయన వివరించడం జరిగింది. ఈ చర్చలు సఫలీకృతం అయితే అప్పుడు మహిళలు బస్సుల యజమానులుగా మారిపోతారని ఆయన తెలిపారు.
మరీముఖ్యంగా స్త్రీశక్తి ద్వారా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వపు మహాలక్ష్మి పథకం ద్వారా అంటే ఉచిత బస్ ప్రయాణం రూపంలో 270 రోజుల్లో 85 కోట్ల మంది రూ.2500 కోట్ల విలువైన ఉచిత ప్రయాణాలు చేశారన్నారు.
ఒకేసారి రాఖీ పండుగ రోజున రికార్డు స్థాయిలో 64 లక్షల మంది ఈ స్కీమ్ బెనిఫిట్స్ పొందారని గుర్తు చేశారు. RTC కి మహాలక్ష్మి ద్వారా లక్ష్మీ కళ ఉట్టిపడిందని అభిప్రాయపడ్డారు.
కాగా ఈ కార్యక్రమంలో సిద్దిపేట, కరీంనగర్ జిల్లాల కలెక్టర్లు మనుచౌదరి, పమేలా సత్పతి, ఇంకా మత్స్యశాఖ డైరెక్టర్ ప్రియాంక అలా, అదనపు కలెక్టర్ గరిమా అగ్రవాల్ పాల్గొనడం జరిగింది. Self Help Groups