కేంద్రం చెప్పిన శుభవార్త…!ఉచితంగా కుట్టుమిషన్ ల పంపిణి. ఇలా దరఖాస్తు చేసుకోండి. Sewing Machine. 2024
Sewing Machine:కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల వృత్తి పనులు చేసుకునే వారికి ప్రత్యేక పనిముట్లు, యంత్రాలను ఇస్తుంది. అయితే , వాటిని నేరుగా కేంద్రం ఇవ్వకుండా, డబ్బులు ఇస్తూ, ఆ డబ్బుతో మనకు కావాల్సిన యంత్రాలను , పనిముట్లను కొనుక్కునేలా చేస్తోంది. కుట్టు మిషన్ కూడా ఇదే రకము. కేంద్రం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన (pradhan mantri vishwakarma yojana) అనే పథకాన్ని అమలులోకి తీసుకొచ్చింది.
Sewing Machine: ఈ పథకంలో భాగంగా. కుట్టుమిషన్ కొనుక్కునేందుకు రూ.15,000 వరకు డబ్బును పొందవచ్చు. ఈ డబ్బును నేరుగా మీ బ్యాంక్ అకౌంట్‌లో వేస్తుంది. అలాగే ఒక వారం డిజిటల్ శిక్షణను కూడా ఇస్తుంది. ఆ సమయంలో రోజుకు రూ.500 చొప్పున డబ్బులను కూడా ఇస్తుంది.
ఉచిత కుట్టు మిషన్ పథకానికి అర్హతలు :
Sewing Machine:ఉచిత కుట్టు మిషన్ యంత్రం పథకం కోసం దరఖాస్తు చేయడానికి, దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరులు అయి ఉండాలి. ఇప్పటికే టైలరింగ్ పని చేస్తున్న వారు మాత్రమే ఉచిత కుట్టు మిషన్ పథకం కింద దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద టైలర్‌గా పనిచేసే ఎవరైనా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కుట్టు యంత్రం పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి , దరఖాస్తుదారుని యొక్క వయస్సు 18 సంత్సరాల పైబడి ఉండాలి.
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం అవసరమైన పత్రాలు:
ఈ పథకం కోసం అప్లై చేసుకునేవారు ఆధార్ కార్డు, చిరునామా రుజువు, గుర్తింపు కార్డు, కుల ధృవీకరణ పత్రం, పాస్‌పోర్టు సైజు ఫొటో, మొబైల్ నంబర్, బ్యాంకు పాస్ బుక్ కలిగివుండాలి.
ఉచిత కుట్టు మిషన్ పథకం కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
ముందుగా అధికారిక https://pmvishwakarma.gov.in లోకి వెళ్లాలి. ఇందులో Register అవ్వాలి. మీరు online లో అప్లై చేయడం కుదరదు అనుకుంటే మీ దగ్గర్లోని మీ సేవా కేంద్రానికి వెళ్లి కూడా చేయించుకోవచ్చు. మీరు పైన చెప్పుకున్న పత్రాలను మీ దగ్గర ఉంచుకోవాలి. మీ దరఖాస్తు అప్లై చేశాక, మీకు రసీదు వస్తుంది. ఆ రసీదును మీ దగ్గర ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని రోజులకు కేంద్రం మీ బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తుంది. తద్వారా మీరు కుట్టు మిషన్ కొనుక్కోవచ్చు.