Skin Care Tips in Telugu : వీటిని పాటిస్తే చాలు మీ చర్మం మెరిసిపోవడం ఖాయం.2024.
Skin Care Tips in Telugu:చర్మం అందంగా మెరుస్తూ కనిపించాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అలాంటప్పుడే చర్మం చక్కగా మెరుస్తూ అందంగా కనిపిస్తుంది. ఆ జాగ్రత్తలు ఏంటో తెలుసుకోండి. వీటిని క్రమ పద్దతిలో ఫాలో అయితే మాత్రం మీ స్కిన్ కచ్చితంగా మెరవడం స్టార్ట్ అవుతుంది.
Skin Care Tips in Telugu:చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, బయట నుంచి మాత్రమే కాదు చర్మాన్ని లోపలి నుంచి కూడా కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అందుకోసం ఏయే చిట్కాలు పాటించాలో చూద్దాం.
పోషకాహారం..
Skin Care Tips in Telugu:ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మంచి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. మనం తీసుకునే ఆహారం కూడా మన చర్మాన్ని కాపాడుతుంది. ఎక్కువ చక్కర తీసుకోవడం వల్ల చర్మ ముడతలు, మొటిమలు వంటి సమస్యలు వస్తాయి. అందుకే వీటికి బదులుగా ప్రోటీన్లు, పీచుపదార్థాలు ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు తీసుకోవడం మంచిది. జంక్ ఫుడ్ తీసుకోవడం ఆరోగ్యానికి , చర్మానికి మంచిది కాదు. కాబట్టి, పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోండి.
నీరు తాగడం..
మెరిసే చర్మానికి నీరు తాగడం కూడా ముఖ్యమే. ఒక రోజుకి కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగాలి. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు మీ చర్మానికి మెరుపును కూడా సొంతము చేసుకోవచ్చు. ఇందుకోసం పుచ్చకాయలు, దోసకాయలు వంటి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి.
సన్ స్క్రీన్..
ఆరోగ్యకరమైన చర్మానికి సన్‌స్క్రీన్ కూడా చాలా ముఖ్యం. సూర్యుని యూవీ కిరణాలు చర్మాన్ని దెబ్బ తీస్తాయి. అందుకే మేకప్ వేసుకునే ముందు కూడా సన్‌స్క్రీన్ అప్లై చేయడం, ఆ తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్ వాడడం మంచిది.
స్కిన్ కేర్ రొటీన్..
చర్మాన్ని కాపాడడంలో స్కిన్ రొటీన్ కూడా చాలా ముఖ్యం. ఇందులో ముందుగా బయటికి వెళ్ళి వచ్చాక ముఖాన్ని కడగడం. దీని వల్ల చర్మ రంధ్రాలపై దుమ్ము లేకుండా ఉంటుంది. పడుకునే ముందు మీ స్కిన్ టైప్ ని బట్టి మైల్డ్ క్లెన్సర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. తర్వాత మంచి మాయిశ్చరైజర్స్, సీరమ్ అప్లై చేయండి. రాత్రి సీరమ్ అప్లై చేయడం వల్ల చర్మం చాలా బావుంటుంది.
సరైన నిద్ర..
మంచి నిద్ర అనేది చర్మాన్ని తాజాగా, హెల్దీగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు 8 గంటల నిద్ర అనేది చాలా అవసరం. సరిగ్గా నిద్రపోకపోతే కంటి చుట్టూ నల్లని వలయాలు వస్తాయి. అందుకే హ్యాపీగా నిద్రపోవాలి.
ఇంట్లోనే మాయిశ్చరైజర్ తయారీ..
సహజ పదార్థాలు..
అదే విధంగా, చర్మాన్ని కాపాడుకోవాలంటే కేవలం కాస్ల్టీ క్రీమ్స్ మాత్రమే కాదు.. సహజంగా దొరికే దోసకాయ, బొప్పాయి, పండిన అరటిపండు, అలోవేరా జెల్, రోజ్ వాటర్ వంటి వాటిని కూడా వాడొచ్చు. ఇవన్నీ మీ చర్మానికి చాలా మంచిది. వీటి వల్ల చర్మం మెరుస్తూ కాంతివంతంగా మారుతుంది.
ఎక్స్‌ఫోలియేషన్..
చర్మానికి ఎక్స్‌ఫోలియేషన్ కూడా చాలా మంచిది. దీని వల్ల చనిపోయిన చర్మ కణాలు తొలగి, స్కిన్ శుభ్రంగా తయారవుతుంది. కాబట్టి, స్కిన్‌ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం వల్ల మాయిశ్చరైజర్ చర్మాన్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది.
గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించడం జరిగింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసము మాత్రమే. అందం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.