Soap Nuts in Telugu : కేశసంరక్షణలో కుంకుడుకాయల ఉపయోగాలు…వాడే విధానం….
Soap Nuts in Telugu : పూర్వ కలం లో కుంకుడుకాయలనే షాంపూ గా వాడేవారు…ఆధునిక కాలన్ని అనుసరించి అనేక షాంపు లు మార్కెట్ లోకి వచ్చాయి… నిజానికి చెప్పాలంటే జుట్టు సంరక్షణలో కుంకుడుకాయలు పనిచేసినంతగా ఎంత పెద్ద బ్రాండ్ షాంపూ కూడా పనిచేయవు.ఆయుర్వేదంలో కూడా కుంకుడుకాయలకు మంచి ఉపయోగాలు ఉన్నాయి..
- ఇపుడున్న పరిస్థితిలో అడ మెగా అని తేడా లేకుండా అందరు ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటుంటున్నారు, ఉరుకుల పరుగుల జీవన శైలిలో,ఆహారపు అలవాట్ల కారణంగా మనం ఇప్పటికే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాం. ఈ నేపథ్యంలో లోనే చాలా మందికి తమ ఆరోగ్య అలవాట్ల కారణంగా జుట్టు ఊడిపోవడం, చుండ్రు రావడం వంటివి జరుగుతుంటాయి.అందుకు కారణం జుట్టు రక్షణలో కుంకుడుకాయ చూపించే పనితనమే. ప్రస్తుత కాలంలో జాబ్స్ తో టైం లేకపోడవం మరియు మానుషలలో ఓపిక లేకపోవడం మొదలైనవి అనేక కారణాలు…ఇవ్వని కూడా జుట్టు సమస్యల బారిన పడేలా చేస్తుంటాయి.
- కుంకుడుకాయల నుంచి తీసిన రసం నాచురల్ మరియు ఆయుర్వేద షాంపూగా పని చేస్తుంది. జుట్టుకి అనేక విధాలుగా పోషణనిస్తుంది. దాంతో జుట్టు మెరుస్తూ మరియు ఒత్తుగా పెరుగుతుంది. కుంకుడుకాయల్లో ఉన్న విటమిన్స్ వల్ల పొడిబారిన జుట్టు సమస్యల నుంచి కాపాడుతుంది. ఫలితంగా సిల్కీ మరియు స్మూత్ హెయిర్ అలాగే దృఢమైన జుట్టు మన సొంత మవుతుంది.Soap Nuts in Telugu
- స్కాల్ప్ మీద ఫంగస్ పెరగడం వల్ల చుండ్రు సమస్య మొదలవుతుంది. కుంకుడు కాయలు స్కాల్ప్ పైన వుండే చుండ్రుని పూర్తిగా శుభ్రపరుస్తాయి అలాగే మల్లి చుండ్రు సమస్యలు తలెత్తకుండా చేస్తాయి. దాంతో స్కాల్ప్ మీద ఫంగల్ గ్రోత్ ఆగిపోతుంది .రెగ్యులర్‌గా కుంకుడుకాయలతోనే తలస్నానం చేస్తూ ఉండడం వల్ల చుండ్రు సమస్య పూర్తిగా మాయమైపోతుంది..
- కుంకుడుకాయల్లో ఉన్న Vitamins A , D వల్ల జుట్టు బాగా పెరగడంలో దోహదపడుతుంది. అందులో ఉన్న Vitamins జుట్టు కుదుళ్ళకి బలాన్నిచ్చి జుట్టు పొడవుగా ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ Vitamins కొత్త ఫాలికిల్స్ ఏర్పడడానికి ఉపయోయపడతాయి. సీబమ్ ప్రొడక్షన్‌కి హెల్ప్ చేసి జుట్టుకి నరిష్‌మెంట్‌ని చేస్తుంది .
- స్కాల్ప్‌కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్‌ని కుంకుడుకాయలు పుష్కలంగా పరిష్కరిస్తాయి. చుండ్రు, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ ఫాల్ వంటివన్నీ కుంకుడుకాయలను రెగ్యులర్‌గా ఉపయోగిస్తూవుంటే సమస్యలు దూరమవుతాయి. పైగా, ఒకసారి ఈ ప్రాబ్లంస్ క్లియర్ అయ్యాక మళ్ళీ రాకుండా కుడా ఈ కుంకుడుకాయల యొక్క పవర్ చేస్తుంది.
- కుంకుడు కాయలు మరియు హెన్నా కాంబినేషన్ జుట్టుకి మంచి కండిషనర్‌లా పని చేస్తుంది. దాని వల్ల జుట్టు పొడి గా అవ్వకుండా చేస్తుంది.మరిన్ని జుట్టు సమస్యల నుంచి దూరం పెడుతుంది..
- కుంకుడుకాయల్లో ఉండే యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ వలన జుట్టు పెరుగుదల కంట్రోల్ అవుతుంది.ఆరోగ్యమైన జుట్టు పెరుగుదల కోసం కుంకుడుకాయలను తప్పకుండ ఉపయోగించడం మేలు..
గమనిక : కుంకుడుకాయల నుంచి తీసిన రసం కొంత మందిలో అలర్జీ ని కలిగిస్తుంది..అలంటి వారు స్కిన్ కేర్ డాక్టర్ ని సంప్రదించిన తర్వాత వీటిని వాడటం మేలు…Soap Nuts in Telugu