అతి తక్కువ ధరకే ఈ సోలార్ కారుని మీ సొంతం చేసుకోండి. 330 కి.మీ. రేంజ్ తో దూసుకెళ్తోంది… Solar Cars in India :2024
Low Price Cars: Wave Mobility Company 2 రకాల సోలార్ ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తుంది. 3 సీటర్ ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారుని ఒకటి , అలాగే 5 సీటర్ గల సీటీ5 సోలార్ కారుని తీసుకొస్తుంది. ఇవా సోలార్ ఎలక్ట్రిక్ కారు గురించి ఇది వరకే చెప్పి ఉండడం జరిగింది. ఆ కారు పూణేకి చెందిన వేవ్ మొబిలిటీ కంపెనీ సీటీ5 సోలార్ ఎలక్ట్రిక్ సిటీ ట్యాక్సీని తయారు చేస్తుంది. ఇది సౌర శక్తితో నడుస్తుంది.
Solar Cars in India:ట్యాక్సీ డ్రైవర్ల కోసం ప్రత్యేకంచి ఈ Commercial వాహనాన్ని తయారు చేసింది. భారత్ లో తొలిసారిగా ట్యాక్సీ డ్రైవర్ల కోసం తయారు చేయబడిన సోలార్ ఎలక్ట్రిక్ కారు ఇదే అని చెప్పవచ్చు. ఇది సౌర శక్తితో మరియు కరెంట్ మీద రెండిటి పవర్ తో నడుస్తుంది. కారు పైన సోలార్ ప్యానెల్ ఇచ్చారు. దీని వల్ల ఛార్జింగ్ అవుతుంది. ఇది ఫుల్ ఛార్జ్ తో 330 కి.మీ. ప్రయాణిస్తుంది. ఇది 5 మంది కూర్చునే సీటింగ్ కెపాసిటీతో వస్తుంది. బూట్ స్పేస్ 400 లీటర్లు ఇచ్చారు. ccs 2 ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది.
Solar Cars in India: ఈ కారు బ్యాటరీ కెపాసిటీ మీద 3 సంత్సరాలు అంటే లక్ష 50 వేల కిలోమీటర్లు వరకు వారంటీని ఇవ్వడం జరిగింది కంపెనీ. బలమైన ఉక్కు రోల్ పంజరం(Robust steel roll cage material) మెటీరియల్ తో తయారు చేశారు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు. కారులో ఉన్న ఐదు సీట్లకు ఐదు సీటు బెల్ట్స్ ను కూడా ఇచ్చారు. స్పీడ్ లిమిట్ వచ్చేసి 70 కి.మీ.గా ఉంది. రిమోట్ ఫ్లీట్ హెల్త్ మానిటరింగ్ ఫీచర్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు కారు హెల్త్ ని దాని కండిషన్ ని చూసుకోవచ్చు. ఏడాదికి 4 వేల కిలోమీటర్లు సోలార్ పవర్ తో ఉచితంగా జర్నీ చేయవచ్చు.
ఈ కారుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ కారు వెనుక భాగం మీద డిజిటల్ యాడ్స్ ఇచ్చుకోవచ్చు. అది కూడా ప్లేస్ ని లేదా లొకేషన్ బట్టి మారేలా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అంటే ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఎక్కడ ఏ యాడ్ ప్లే అవ్వాలనేది డిసైడ్ చేసుకునేలా ఇందులో ఒక ఫీచర్ కూడా ఇచ్చారు. దీని వల్ల ఇలా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. దీనికి విలువలను జోడించిన ఫీచర్స్ కారణంగా ఈ కారు మీద పెట్టిన పెట్టుబడి మొత్తము వెంటనే వచ్చేస్తుంది.
Solar Cars in India: ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్, ఏసీ, రేర్ ఏసీ వెంట్, ఎల్ఈడీ క్యాబిన్ లైట్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎల్ఈడీ బ్రేక్ లైట్ వంటివి ఇచ్చారు. ఇందులోని సీట్లను చాలా సులభంగా శుభ్రం చేసుకునేలా వీటిని అపోస్టరీ మెటీరియల్ తో డిజైన్ చేశారు.
Solar Cars in India: ఇది లైట్, ఎస్టీడీ, ప్లస్ మూడు వేరియంట్లలో వస్తుంది. Light variant 215 కి.మీ. రేంజ్ ఇవ్వగా, STD variant రూ. 260 కి.మీ., Plus variant లో రూ. 330 కి.మీ. రేంజ్ ఇస్తుంది. Light variant లో 17 kilo watt battery ఇవ్వగా, STD variant లో 21 Kilo gate battery ఇచ్చారు. Plus variant లో 26 kilo watt battery ఇచ్చారు. ఏసీ ఛార్జింగ్ విషయానికొస్తే, లైట్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 5 గంటలు, ఎస్టీడీ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 6.5 గంటలు, ప్లస్ వేరియంట్ ఛార్జ్ అవ్వడానికి 8 గంటల సమయం పడుతుంది. డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికొచ్చినట్లయితే , ఎస్టీడీ వేరియంట్ 35 నిమిషాల్లో, ప్లస్ వేరియంట్ 45 నిమిషాల్లో ఛార్జ్ అవుతుంది. ఇక ఈ కమర్షియల్ వెహికల్ ని 2025లో లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ తెలిపడం జరిగింది.
దీంతో పాటు ఇవా సోలార్ కారుని కూడా 2025లోనే తీసుకొస్తుంది. ఈ కారుని టెస్ట్ డ్రైవ్ కూడా చేయవచ్చు. ఇక రేట్ విషయానికొస్తే, వేరియంట్ ని బట్టి ఆరు లక్షల నుంచి పది లక్షల వరకూ ఉంటుందని సమాచారం ఇవ్వడం జరిగింది. ఈ బడ్జెట్ లో ట్యాక్సీ డ్రైవర్లకు ఈ కమర్షియల్ కారు అందుబాటులోకి తీసుకొస్తే నిజంగా వాళ్ళకి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకువాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.