Spring Onion in Telugu : ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వెంటాడే సమస్య ఫైల్స్.అలాంటి వారికి ఈ ఉల్లికాడలు దివ్య ఔషధమే కాదు.శాశ్వత పరిష్కారం కూడా.
Spring Onion in Telugu ఉల్లి పాయ ప్రతి వంట గదిలో తప్పక ఉంటుంది. దాని రేటు ఎంత ఎక్కువైనా సరే,కచ్చితంగా కొనుక్కోవాలి.దానిని వంటలలో వేస్తేనే, మంచి రుచి ఉంటుందని నమ్ముతారు. ఇదే వాస్తవం కూడా. ఒక్క పవిత్రమైన రోజల్లో అంటే, ఒక్కపొద్దుల్లో పూజచేసిన రోజుల్లో మరియు దీక్ష సమయాలలో మినహా ఉల్లిని ప్రతి రోజూ వాడుతూ, ఉంటారు. ఉల్లిపాయ లేకుండా అసలు ఎవరు కూర చేసుకోవడం అనేది చాలామంది ఇళ్లలో ఉండదు కూడా.ఇలా ఉల్లిపాయ గురించి అందరికీ తెలిసింది. కానీ ఉల్లికాడలతో కూడా ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా..?
Spring Onion Benefits: మన భారతీయ వంటకాల్లో తప్పక ఉండేటువంటి పదార్థం ఉల్లిపాయ. అసలు ఉల్లి లేని ఇళ్లు ఉండదు అన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే , ఉల్లి చేసేటువంటి మేలు తల్లి కూడా చేయదనే ఒక సామెత ఉంది. ఉల్లి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజానలు ఉన్నాయని తెలుసు.అందుకే ఉల్లి ఘాటుగా ఉన్నా అంతేకాకుండా కట్ చేస్తే, కన్నీరు పెట్టించిన సరే ,ఉల్లిని కొంటూనే ఉంటారు ప్రజలు.
Spring Onion in Telugu ఒక ఉల్లిపాయలే కాదు.వాటి మొలకల వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. వాటినే ఉల్లికాడలు అంటారు. వీటిని ఇంగ్లిషులో స్ప్రింగ్ ఆనియన్స్ అని అంటారు. ఉల్లిపాయల్ని వాడలేని వాళ్లకి తక్కువ ఘాటుతో ఉండి , మంచి రుచితో కూడుకున్నటువంటి ఈ ఉల్లికాడలే సరైన Alternative అని చెప్పాలి. ఉల్లికాడల యొక్క రసం ఒక టీ స్పూన్, ఒక టీ స్పూన్ తేనే కలిపి రోజూ తాగితే,శరీర ఇమ్మ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఉల్లి లో కంటే, ఉల్లికాడల్లోనే సల్ఫర్ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఉల్లికాడలను తరచుగా రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే కచ్చితంగా కొలెస్ట్రాల్‌ను అరికడుతుంది. హైబీపీని కూడా చాలా కంట్రొల్ లో ఉంచుతాయి అంట.అందుకే BP ఉన్నవారు కచ్చితంగా ఉల్లికాడలను తీసుకుంటే,తక్కువ టైంలోనే మంచి ఫలితం ఉంటుంది అంటున్నారు.
ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ను కూరలు, సలాడ్స్, సూప్స్ ల్లో బాగా ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొత్తిమీర, కరివేపాకులా వీటిని కూరల్లో వేసుకుంటారు. ఉల్లిపాయలతో పోలిస్తే వీటి ఖరీదు తక్కువగానే ఉంటుంది. కానీ వీటి వల్ల చాలా రకాలా ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే ఇకపై ఉల్లికాడలపైనే కొనుక్కోవడం మంచిందని నిపుణుల సూచన..
శీతాకాలంలో జలుబు, దగ్గుతో ఇబ్బంది పడేవారికి ఉల్లికాడలతో సూప్ సరైన ఔషధం అని చెప్పవచ్చు. ఇవి చలికాలంలోనే విరివిగా లభిస్తాయి కూడా.అందుకే ఉల్లికాడలతో చేసే, సూప్ తాగితే దగ్గు జలుబు నుంచి వెంటనే ఉపశమనం ఉంటుంది అంటున్నారు. ఉల్లికాడల్లో ఉండే Pectin అనే పదార్థం పెద్ద పేగుల్లోని సున్నితమైన పొరలను కాపాడుతుంది. దీంతో పెద్ద పేగు పాడవకుండా, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా కూడా నివారిస్తుంది.
ఉల్లికాడల్లో ఉండేటువంటి గ్జియాంతిన్ అనే పదార్థం కంటిచూపుని మెరుగుపరుస్తుంది అంటారు. అలాగే ఉల్లికాడలను ఎక్కువగా వాడితే రక్తపోటూ, Osteoporosis వంటి ఎముక సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు పూర్తిగా తగ్గుతాయి. స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉన్న Folates హృదయ సంబంధిత జబ్బులని అదుపులో ఉంచుతాయి.
Spring Onion in Telugu అన్నిటికన్నా ముఖ్యంగా ఉల్లి కాడల్లో చాలా వరకు మనకు పీచు పదార్ధం దొరుకుతుంది. తరుచుగా ఉల్లి కాడలు తినే ,వారిలో అసలు బరువు సమస్యే ఏర్పడదు.ఉల్లి కాడల్లో ఉన్న Dietary fiber ఆకలిని అదుపులో ఉంచుతుంది. ఇక ఫైల్స్ తో ఇబ్బందిపడేవారు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా పెరుగు వేసుకుని, అందులో ఉల్లికాడ ముక్కలను కలిపి.రోజుకి రెండుసార్లు తిన్నట్లయితే,పైల్స్ సమస్య వెంటనే పోతుంది అంట.
Spring Onion in Telugu ఉల్లికాడల్లో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా గర్భినీతో ఉన్న స్త్రీలు.అంటే , గర్భందాల్చిన మొదటి మూడు నెలల్లో తరచుగా ఉల్లికాడలను తింటే,కడుపులో బిడ్డకు ఫోలిక్ యాసిడ్ బాగా అందుతుంది. దీని ద్వారా గర్భంలో ఉండేటువంటి శిశువుకు వెన్నెముక సమస్యలను అరికట్టడానికి ఉపయోగపడుతుందని కొందరు వైద్యులు సూచిస్తారు.
గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదేని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే , వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమమైన మార్గం .అని గమనించగలరు.