Gruha Jyothi Scheme : పేదలకు వరుసపెట్టి వరాలిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డీ…!
Gruha Jyothi Scheme : తెలంగాణ రాష్ట్రంలో అంతటా కూడా సంక్షేమ పథకాల జోరు నడుస్తోంది. పేదలకు వరుసపెట్టి వరాలిస్తున్నా సీఎం రేవంత్ రెడ్డీ .ప్రజల నుంచి మెప్పు పొందే కీలక నిర్ణయాలని తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అమలవుతున్న గృహ జ్యోతి స్కీం పై మరో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం.
ఈ సంవత్సరం February 27న 500 రూపాయల గ్యాస్ సిలిండర్‌తో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంటు స్కీం న్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టారు… ఈ తరుణంలో ప్రజల నుంచి అప్లికేషన్స్ సేకరిం 0 జీరో బిల్ వచ్చేలా చేశారు.ఇప్పటికైతే వైట్ రేషన్ కార్డు ఉన్న చాలా కుటుంబాలకు గృహ జ్యోతి స్కీం కింద ఫ్రీ కరెంటు అందుతోంది. సక్సెస్‌ఫుల్‌గా 0 బిల్స్ విడుదల అవుతున్నాయి. ఇప్పటి వరకు అన్ని బాగానే ఉన్నా అర్హత ఉండి కూడా కొందరు ఈ స్కీం కి అప్లై చేసుకోలేదు. అలాంటివారి కోసం తాజాగా గుడ్ న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
గృహజ్యోతి స్కీం కి అర్హత ఉండి గతంలో దరఖాస్తు చేసుకోలేని వారికి తిరిగి అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశించారు డిప్యూటీ సీఎం భట్టి. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి సాంకేతిక పనులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు కీలక విషయాలు వెల్లడించారువిద్యుత్ కేంద్రాల్లో సాంకేతిక సమస్యలు ఎదురైతే అలసత్వం చెయ్యొద్దని అలాగే వెంటనే తన దృష్టికి తేవాలని బట్టి విక్రమార్క పేర్కొనరుకి . అదేవిధంగా తెలంగాణ నగర వ్యాప్తంగా ఎక్కడా కరెంట్లో విద్యుత్ ఆటంకాలు ఉండొద్దని, 24 గంటల పాటు విద్యుత్ ఇవ్వాలని ఆదేశించారు.
ఐతే.. ఇప్పటికే 0 కరెంట్ బిల్స్ తీసుకుంటున్న వారు ఎంతో మంది ఆనందపడుతున్నారు. ఇది పేదలకు ఎంతో ఉపయోగకరమైన పథకం అని అనుకుంటున్నారు. ఈ పథకం ద్వారా నగరంలోని లక్షలాది కుటుంబాలు లబ్ది అందుకుంటున్నాయి.ఇప్పటికి ప్రస్తుతం గృహాజ్యోతి విద్యుత్ బిల్లుల్లో.. విద్యుత్ ఉపయోగానికి సంబంధించి రిపోర్ట్ మొత్తం ఇస్తూనే దానితో పటు బిల్ అమౌంట్ కూడా వస్తోంది. అయితే GJS సబ్సిడీ కింద ఆ మొత్తం జీరో అయినట్లు వెల్లడిస్తుంది.దీంతో పాటు ఆరు గ్యాంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి.Gruha Jyothi Scheme