తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన.. ! Telangana Job Calendar 2024 .

తెలంగాణ జాబ్‌ క్యాలెండర్‌ విడుదల. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఆలోచన.. ! Telangana Job Calendar 2024 .


Telangana Job Calendar 2024 : తెలంగాణ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్‌. ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ప్రణాళిక ప్రకారం ఉద్యోగాల భర్తీ చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో, శుక్రవారం (August -2) తెలంగాణ అసెంబ్లీ (TG Assembly)లో జాబ్ క్యాలెండర్ ను ప్రకటించనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వెల్లడించారు. యువతకు హామీ ఇచ్చిన ప్రకారం జాబ్ క్యాలెండర్ (Job Calendar) విడుదల చేస్తామన్నారు. జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు భర్తి చేస్తామని, రెండు రోజుల ముందే మంత్రి శ్రీధర్‌బాబు ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. రెండు లక్షల ఉద్యోగాలు కల్పించినా, మరో 20 లక్షల మంది ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారని, ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని శ్రీధర్‌బాబు తెలపడం జరిగింది.
Telangana Job Calendar 2024 :పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని ఐటీ, శాసన సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. నైపుణ్యాల పెంపుదలపై పారిశ్రామికవేత్తలు, వీసీలు, విద్యార్థులతో చర్చించామని, ‘Young India Skill University’ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామని అన్నారు. నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతోనే ‘Young India Skill University’ స్థాపన జరుగుతోందని.. అన్ని కోర్సులు 50%Practical componentను కలిగి ఉంటాయని స్పష్టం చేశారు.
Telangana Job Calendar 2024 :స్కిల్‌ యూనివర్సిటీ (Skill University) యువతకు ఉపాధి కల్పిస్తుందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పెంచుతుందని మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. తెలంగాణలో మరిన్ని పరిశ్రమల స్థాపనకు స్కిల్‌ వర్సిటీ ఊరటనిస్తోందని తెలిపారు. 2024-25 సంవత్సరంలో 2000 మంది విద్యార్థులకు, వచ్చే ఏడాది 10 వేల మందికి శిక్షణ ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. ముచ్చర్లలో Skill University కోసం శాశ్వత క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతున్నట్లు శ్రీధర్బాబు వెల్లడించడం జరిగింది.

తెలంగాణలో యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లాలోని కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో CM Revanth Reddy, Deputy CM Bhatti Vikramarka, Speaker Gaddam Prasad Kumar తో కలిసి స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారు. యూని వర్సిటీతోపాటు Advanced Technology Centre, Primary Health Centres కు కూడా గురువారం (ఆగస్టు 1) న శంకుస్థాపన చేశారు. ఈ యూనివర్సిటీలో తొలుత సుమారు 17 కోర్సులు ప్రవేశ పెట్టనున్నట్లు సమాచారం. విద్య, ఉపాధికల్పనలు ప్రధాన ధ్యేయంగా ఈ యూని వర్సిటీ నిర్మాణం జరగనుంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top