Rainy Season: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి. 2024
Rainy Season:వర్షాకాలం వచ్చిందంటే చాలు. బట్టలు ఆరడం అనేది పెద్దపని అని చెప్పొచ్చు. వాటిని ఎంత వాటర్ లేకుండా పిండి ఆరేసినా సరే బట్టలు త్వరగా ఆరిపోవు. అందుకోసం మరి ఏం చేస్తే అయితే, బట్టలు ఈజీగా త్వరగా ఆరతాయో తెలుసుకోండి.
ఒకేసారి అన్నీ బట్టలు వద్దు:
Rainy Season:బట్టల్ని అన్నింటినీ ఒకేసారి ఆరబెట్టద్దు. కొన్ని బట్టలు ఉతికిన తర్వాత, అవి ఆరిన తర్వాత మరికొన్ని బట్టల్ని ఉతకండి. దీంతో బట్టలు త్వరగా ఆరతాయి.
ఐరన్ :
ఐరన్ చేయడం వల్ల కూడా బట్టల్ని ఈజీగా త్వరగా ఆరబెట్టుకోవచ్చు. దీని వల్ల బట్టలు పొడిగా అవుతాయి. అయితే, మరీ తడి బట్టలపై ట్రై చేయొద్దు. అలాగే , తడి బట్టలను ఆరేసేందుకు మీరు టవల్స్‌ని కూడా ఉపయోగించవచ్చు . ఇందుకోసం ముందు టవల్స్ వేసి తర్వాత అందులో ఆరబెట్టే బట్టలు వేయండి. అందులోని నీరు టవల్ పీల్చుకుంటుంది. తర్వాత ఈ రెండింటిని ఆరబెట్టేయండి.
ఫ్యాన్ :
అదే విధంగా, రూమ్‌లో బట్టలు ఆరేసి ఫ్యాన్ వేయడం మరో తెలివైన ఆలోచన. దీనికోసం మీరు కింది ఫ్యాన్, పైన ఫ్యాన్ ఏదైనా వాడొచ్చు. దీంతోపాటు, వర్షం పడినప్పుడు కిటికీలు, తలుపులు తెరవండి. గాలి వస్తుంది. ఆ గాలికి ఎదురుగా బట్టల్ని ఆరేయవచ్చు.
హెయిర్ డ్రైయర్, డీహ్యుమిడిఫైయర్:
హెయిర్ డ్రైయిర్‌ని వాడి కూడా బట్టల్ని ఆరేసుకోవచ్చు. దీని వల్ల చిన్న చిన్న బట్టల్ని ఈజీగా ఆరబెట్టుకోవచ్చు. కానీ, లో టెంపరేచర్‌లో ఆరబెట్టాలి. అదే విధంగా, డీహ్యుమిడిఫైయర్ వాడితే దాని నుండి వచ్చే గాలి తో తేమ త్వరగా ఆరిపోతుంది. దీనిని తడిగా ఉన్నటువంటి బట్టల దగ్గర పెట్టి వాడినా తేమ తగ్గి బట్టలు పొడిగా మారతాయి. కాబట్టి, హ్యాపీగా వీటిని వాడి బట్టల్ని ఆరబెట్టుకోవచ్చు.
ఇండోర్లో:
ఇంట్లోనే బట్టలు ఆరబెట్టాలంటే డ్రైయింగ్ రాక్, క్లాత్ లైన్ వాడొచ్చు. దీనిని మనం ఇంట్లోనే వెలుతురు, గాలి వచ్చే ప్లేస్‌లో పెట్టి వాటిని ఆరేసుకోవచ్చు.