Thippatheega Uses in Telugu: తిప్పతీగ యొక్క ఉపయోగాలు బోలెడు..డయాబెటిస్ తో సహా పలు వ్యాధులకు మంచి ఔషధ ఘణి. 2024.
తిప్ప తీగతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. డయాబెటిస్ నుంచి హృదయ జబ్బుల వరకు ఇది దివ్య ఔషధంగా ఉపయోగపడుతోంది.
Thippatheega Uses in Telugu : తిప్ప తీగ మన పల్లెల్లో విరివిగా లభిస్తుంది. తిప్పతీగ ఇచ్చే ఆరోగ్యప్రయోజనాలు అద్భుతమైనవి అనడంలో అతిశయోక్తి లేదు. మెరుగైన రోగనిరోధక శక్తి కోసం ఆయుర్వేదంలో అందించేటువంటి మరో సూపర్ఫుడ్ ఇది అని చెప్పవచ్చు.
Tinospora Cordifolia Uses:ఆయుర్వేదంలో ‘అమృతం’గా ప్రసిద్ది చెందింది. పురాతన కాలం నుండి ఇండియా వైద్యఉపయోగంలో ఉన్న తిప్పతీగ మొక్కలో పుష్కలంగా ఔషధ గుణాలు ఉన్నాయి. తిప్పతీగ కాండంతో సహా మనకు ఆకు వరకు కూడా అనేక రకమైనటువంటి అనారోగ్య సమస్యలను పరిష్కరించుకోవచ్చు.
తిప్ప తీగతో ఆరు ఆరోగ్య ప్రయోజనాలు:
🍀 తిప్ప తీగతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది
Thippatheega Benefits:హృదయం ఆకారంలో ఉండే ఈ మూలిక సహజంగా యాంటీ ఆక్సిడెంట్స్తో నిండి ఉంటుంది. ఇది free radical వ్యాధిని కలిగించేటువంటి క్రిములతో పోరాడటానికి సహాయపడుతుంది. కాబట్టి ఇది టాక్సిన్స్ను తొలగించడంలో, రక్తాన్ని శుద్ధి చేయడంలోను , కాలేయ వ్యాధిని ఎదుర్కోవడంలోను , యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవడంలో కూడా మన శరీరానికి సహాయపడుతుంది.
యాంటీ-పైరేటిక్ స్వభావంను కలిగి ఉండడం వలన ఇది దీర్ఘకాలికంగా జ్వరాలతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. డెంగ్యూ ఉన్నప్పుడు కూడా సిఫారసు చేస్తారు. తిప్పతీగ మన రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి పని చేస్తుంది.
🍀 డయాబెటిస్ నివారణకు తిప్పతీగ:
మీ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడం ద్వారా డయాబెటిస్ను అదుపు చేయడంలో తిప్పతీగ మీకు సహాయపడుతుంది. వివిధ రకాల ఫైటోకెమికల్స్ శరీరంలో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం, సహజ ఇన్సులిన్ స్రావాన్ని పెంచడానికి పని చేస్తాయి. జర్నల్ ఏన్షియంట్ సైన్స్ ఆఫ్ లైఫ్లో ప్రచురించిన 2010 పరిశోధనా పత్రం కూడా తిప్పతీగ లేదా టినోస్పోరా కాలేయంలో మధుమేహం-ప్రేరిత ఆక్సీకరణ ఒత్తిడిని గణనీయంగా ఎదుర్కొంటుందని పేర్కొంది.
🍀 శ్వాస సంబంధిత సమస్యలతో పోరాడే తిప్పతీగ:
Thippatheega Uses in Telugu:తిప్ప తీగలో కనిపించే అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ శక్తులు తరచుగా మనకు కలిగే దగ్గు, జలుబు మరియు టాన్సిలిటిస్ వంటి ఏవైనా సాధారణ శ్వాసకోశ సమస్యలతో పోరాడటానికి ఇవి సహాయపడతాయి. జలుబు, దగ్గు మాత్రమే కాకుండా, ఇది ఉబ్బసం రోగులకు కూడా మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఛాతీ బిగుతుగా మారడం , శ్వాస ఆడకపోవడం మరియు దగ్గు, గురక వంటి లక్షణాలకు తిప్పతీగ మంచి ఔషధమనే చెప్పాలి.
🍀 ఒత్తిడి, ఆందోళనను తగ్గించే తిప్పతీగ:
తిప్పతీగను అడాప్టోజెనిక్ హెర్బ్గా ఉపయోగించవచ్చు. అడాప్టోజెన్ అనేది ప్రాథమికంగా మన శరీరం ఒత్తిడికి అనుగుణంగా సహాయపడేటువంటి ఒక పదార్ధం. ఈ ఆరోగ్య సిరప్ మన శరీరం నుంచి టాక్సిన్స్ బయటపడటానికి, మన జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అందువల్ల ఇది మనల్ని ప్రశాంతంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది.
🍀 గుండె జబ్బుల నుంచి రక్షణకు తిప్పతీగ:
Thippatheega Uses in Telugu :డయాబెటిక్ ఉన్న ఎలుకలలో తిప్పతీగ ప్రభావాలను Journal of Ethnopharmacology లో ప్రచురించిన ఒక పరిశోధనా పత్రం అధ్యయనం చేసింది. ఇది డయాబెటిక్ ఎలుకలలో సీరం కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా తగ్గించిందని కనుగొనడం జరిగింది. తిప్పతీగ లిపిడ్ జీవక్రియను సక్రమంగా ఉండేలా చేస్తుంది. తద్వారా మీ గుండెకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తుందని మరొక అధ్యయనం కూడా కనుగొంది.
🍀 మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని నివారించే తిప్పతీగ:
Thippatheega Uses in Telugu: తిప్పతీగ కాండం మహిళల్లో బోలు ఎముకల వ్యాధిని ప్రభావితం చేస్తుందని యూరోపియన్ మెనోపాజ్, ఆండ్రోపాజ్ సొసైటీ యొక్క అధికారిక జర్నల్ అయిన మాట్యురిటాస్లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది. తద్వారా బోలు ఎముకల వ్యాధి యొక్క నివారణలో కూడా ఉపయోగపడుతుందని తేల్చింది.
Tinospora Cordifolia Uses:తిప్ప తీగ మొక్కలు మన దగ్గర పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. తిప్ప తీగను రసం రూపంలో అనేక ఆయుర్వేద ఉత్పత్తుల సంస్థలు మార్కెట్లోకి తీసుకు రావడం జరిగింది. వాడే ముందు ఒకసారి ఆయుర్వేద వైద్య నిపుణుడిని సంప్రదించిన తర్వాత వాడడం మంచిది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసము మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.