అటవీ శాఖలో 12th అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు : Forest Department Recruitment 2024.
Department Recruitment 2024 అటవీ శాఖకు సంబంధించిన సెంట్రల్ జూ అథారిటీలో ఇంటర్మీడియట్ అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. 18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోగలరు. ఒక రాత పరీక్ష ద్వారానే ఎంపిక చేసి, ఉద్యోగాలు ఇస్తారు. పోస్టులను అనుసరించి, 30 వేల వరకు జీతం ఉంటుంది . నోటిఫికేషన్ యొక్క మొత్తం సమాచారం చూసి, వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.
🔥 పోస్టుల వివరాలు, అర్హతలు :
లోయర్ డివిజన్ క్లర్కు ఉద్యోగాలను భర్తీ చేయడానికి అటవీ శాఖకు సంబంధించిన సెంట్రల్ జూ అథారిటీ నుండి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు.
🔥 వయస్సు :
18 నుండి 27 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగలరు S.C.S.T అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది.
🔥 ఎంపిక చేసే విధానం :
Department Recruitment 2024 దరఖాస్తు చేసుకున్న వారికి రాత పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఆప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్ , జనరల్ నాలెడ్జ్ నుండి ప్రశ్నలు వస్తాయి . ఇంగ్లీష్ మరియు హిందీలోనే రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఎటువంటి TA,DA చెల్లించడం జరగదు. పరీక్షలో వచ్చిన మెరిట్స్ ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారు.
🔥 దరఖాస్తు చేసుకునే వివరాలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు ఫారం పూర్తి చేసి, గడువులోగా సంబంధించిన అటవీ శాఖ డిపార్ట్మెంట్ వారికి పంపించాలి. గడువు తర్వాత వచ్చిన అప్లికేషన్స్ అంగీకరించబడవు.
🔥 దరఖాస్తు ఆఖరి తేదీ :
31.10 .2024.
🔥 జీతం వివరాలు :
ఎంపిక అయిన అభ్యర్థులకు నెలకు 30 వేల వరకు జీతం చెల్లిస్తారు. ఇతర అలవెన్స్ లు మరియు బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి.
🔥 కావలసిన డాక్యుమెంట్స్ :
అప్లికేషన్ పెట్టుకునే అభ్యర్థులు దరఖాస్తు ఫారం తో పాటు ఈ క్రింద ఉన్న సర్టిఫికెట్స్ కూడా జతపరిచి ఉంచాలి.
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఉండాలి.
ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ సర్టిఫికెట్స్ మరియు కుల ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.
స్టడీ సర్టిఫికెట్స్ అన్నీ ఉండాలి.
🔥 దరఖాస్తు చేసుకునే విధానం:
నోటిఫికేషన్ లోని అర్హతలు ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దరఖాస్తు చేసుకోగలరు.
Notification PDF & Application Form.
మరిన్ని జాబ్ నోటిఫికెషన్స్ గురించి todayintelugu.com ని సందర్శించండి.