Vepaku in Telugu : వేపాకు సర్వరోగ నివారణి…లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే వేపాకు ఈ విధంగా తీసుకోవాలి…!
మనం వేపాకు పేరు వినగానే ‘అబ్బా చేదు’ అని ముఖం చిట్లేస్తారు Vepaku in Telugu. అయితే ఈ వేపాకు ఆయుర్వేదంలో సర్వరోగ నివారణిగా చెప్తారు. మన తాతలు మరియు తండ్రులు కూడా వేపాకు… విశిష్టతను మనకు అనేక సార్లు చెప్తునేఉంటారు. వేపాకుల్లో యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటి హైపర్ గ్లైసెమిక్, యాంటి అల్సర్, యాంటి మలేరియల్, యాంటి ఫంగల్, యాంటి బ్యాక్టీరియల్, యాంటి వైరల్, యాంటి ఆక్సిడెంట్, యాంటి మ్యుటాజెనిక్, యాంటి కార్సినోజెనిక్ మొదలైన లక్షణాలు అధిక స్థాయిలో ఉంటాయి. వేపలో విటమిన్-A , C , కెరొటినాయిడ్స్, లినోలియిక్, ఒలియిక్ లాంటి మొదలైన సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ ఖాళీ కడుపుతో వేపాకులు తింటే అనేక ఆరోగ్య ఉపయోగాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు.మరి అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…
గట్ను ఆరోగ్యం స్థిరంగా…
మనం రోజు పరగడుపున వేపాకులు తింటే..మన లోపలి పేగుల వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో దోహదపడతాయి, అలిమెంటరీ కెనాల్‌ను వ్యాధికారకాల నుంచి కాపాడుతుంది. ఈరోజుల్లో మన జీవనశైలి, మనం తీసుకునే ఆహారం మరియు మద్యపానం వంటి చెడు అలవాట్ల కారణంగా.. పేగులో అనేక ఇన్ఫెక్షన్లలకు లోనై, చాలామంది ఇబ్బంది పడుతున్నారు.ఉదయానే వేపాకును ఖాళీ కడుపుతో తింటే… ఈ సమస్య నుంచి బైట పడొచ్చు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది…
వేపాకు తీసుకోవడం వల్ల మన శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుందని డాక్టర్లు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక క్రమపద్ధతిలో ప్రోదునే లేవగానే వేపాకులను తిన్నా అలాగే ఈ వేప ఆకులతో కషాయం చేసుకొని త్రాగిన బ్లడ్ లో షుగర్ స్థాయిలు నియంత్రిస్తుందని అంటున్నారు…Vepaku in Telugu
మలబద్ధకం నియంత్రిస్తుంది…
నిశ్చల జీవనశైలి, ఆహార అలవాట్లు, ఒత్తిడి వంటి మొదలైన కారణంగా మలబద్ధకం సమస్యతో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఈ సమస్యతో బాధపడేవారికి.. వేపాకు దివ్య ఔషధంలా పనిచేస్తుంది. వేప ఆకుల్లో ఉండే ఫైబర్ కంటెంట్ ప్రేగుల కదలికలను ఉతేజపరుస్తాయి. కడుపు ఉబ్బరం నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తాయి. మీరు ఈ సమస్య కారణంగా బాధపడుతుంటే…రోజూ పరగడుపున వేపాకులు తినండి…వేపాకు మంచిదని అతిగా తింటే దుష్ప్రభావాలు ఎదురవుతాయని డాక్టర్లు అంటున్నారు…ఐతే ఈ వేపాకు ఆకుల్ని రోజుకు 5 నుంచి 6 మాత్రమే తినాలని చెబుతున్నారు.
లివర్‌కు మంచిది…
పరిగడుపున వేప ఆకులు తింటే…లివర్‌ను ఆరోగ్యంగా ఉంచడంలో…వేప ఆకులలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయి…ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా…లివర్ కణాలు చెడిపోయే అవకాశలు…ఐతే ఈ వేప ఆకులని తీసుకోవడం వల్ల రక్తాన్ని శుద్ధిచేస్తాయి. రక్తంలోని మలినాలను నియంత్రిస్తుంది…దీని ద్వారా లివర్ పనితీరును మెరుగుపరుస్తుంది…
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Vepaku in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు