Tap Cleaning : చిటికెలో వాటర్ ట్యాప్‌లను ఇలా శుభ్రం చేయవచ్చు.. అది ఎలాగంటారా..!
Tap Cleaning Tips : మనం వాడుకోవడానికి వాటర్ ట్యాప్‌ల ద్వారానే వస్తుంది. వాటర్ ట్యాప్‌లపై అనేక మరకలు, మచ్చలు పడుతూ ఉంటాయి. నీటి మరకలు, సబ్బు మరకలు, గిన్నెలు కడిగేటప్పుడు ఇలా వాటిపై మరకలు అలాగే ఉండిపోతాయి. వీటిని వెంటనే శుభ్రం చేయకపోతే, అవి మొండి మరకలుగా అలాగే ఉంటాయి.
Water Tap Cleaning Tips :ఇక వాటిపై దుమ్ము, ధూళి చేరి,మరింత పేరుకుపోయి,జిడ్డుగా తయారవుతాయి. ఎప్పుడో గుర్తుకు వచ్చినప్పుడు శుభ్రం చేస్తారు. దీంతో వాటిపై ఉండే మొండి మరకలు అంత సులువుగా పోవు. ఎంతో కష్ట పడాల్సి వస్తుంది. అందులోనూ స్టెయిన్ లెస్ స్టీల్ ట్యాప్స్ అయితే తుప్పు పట్టేస్తాయి. మరి ఇటువంటి మొండి మరకలను సైతం ఇక్కడ చెప్పే చిట్కాలు ఎంతో చక్కగా పోగొడతాయి. మరి అవేంటో ఇక్కడ చూద్దాం.
వెనిగర్:
వెనిగర్‌తో మనం ఎన్నో రకాల క్లీనింగ్ టిప్స్ తెలుసుకున్నాం. ముఖ్యంగా వెనిగర్ అనేది కిచెన్‌లో ఎంతో చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నె తీసుకుని, అందులో కొద్దిగా వైట్ వెనిగర్, వాటర్ లో కలపండి. ఇందులో ఒక స్పాంజ్ వేసి, ఒక 5 నిమిషాలు అలానే వదిలేయండి. ఆ తర్వాత ఆ స్క్రబర్ లేదా స్పాంజ్ తో ట్యా వాటర్ ట్యాప్‌లను బాగా రుద్ది ఉంచండి. ఒక రెండు నిమిషాలు అలానే వదిలేయండి. మొండి మరకలు పోకపోతే, మళ్లీ రుద్దండి. ఇలా చేయడం వల్ల త్వరగా వాటర్ ట్యాప్స్ శుభ్రం అవుతాయి.
టూత్ పేస్ట్ :
టూత్ పేస్ట్‌తో కూడా వాటర్ ట్యాప్‌లను సులభంగా శుభ్రం చేయవచ్చు. పనికి రాని టూత్ బ్రష్ తీసుకుని దానికి టూత్ పేస్ట్ పెట్టండి. దానితో మురికిగా ఉండే ట్యాప్‌లపై బాగా రుద్దండి. ఆ తర్వాత కడిగేయండి. ఇప్పుడు మీ వాటర్ ట్యాప్స్ తెల్లగా మెరుస్తాయి. టూత్ పేస్టులతో టాప్ లపై ఉండే మొండి మరకలు,దుమ్ము ,ధూళి పోతాయి.
నిమ్మరసం :
నిమ్మరసంతో కూడా బాత్‌రూమ్, సింక్ మరియు బయట ఉండేటువంటి కుళాయిలను శుభ్రం చేసుకోవచ్చు. ఒక గిన్నెలోకి నిమ్మరసం తీసుకోండి. అందులో కొద్దిగా సర్ఫ్ కలిపి మిక్స్ చేయండి. ఈ మిశ్రమంతో ట్యాప్‌లపై స్క్రబర్‌తో రుద్దండి.ఆ తర్వతా కడిగేయండి. ఈ విదంగా చేయడం వల్ల మురికి తో పాటు చేడు వాసన కూడా పోతుంది.
గమనిక : ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను సేకరించి మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు todayintelugu.com బాధ్యత వహించదు.