ఉసిరికాయ రోజూ తింటే,  ఎన్ని లాభాలు ఉన్నాయో, తెలుసా..?

కార్తికమాసంలో ఉసిరి సందడి మొదలవుతుందనే చెప్పాలి . ఉసిరిలో, షడ్ రసాలలో  ఉన్నటువంటి గుణాలను కలిగి ఉంటుంది. ఒక ఉప్పును తప్పించి మిగిలిన అన్ని  రుచులూ ఉంటాయి.

ఉసిరిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని పిలవచ్చు.దీనిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణుల చెబుతున్నారు.

డయాబెటిస్ కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది.

బరువు తగ్గుతారు.అధిక బరువుతో బాధపడేవారికి.. ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. ఉసరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.ఉసిరిలో విటమిన్-C అధికంగా ఉంటుంది. ఉసిరి రోజువారి మన డైట్లో చేర్చుకుంటే, దీని వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది.

ఉసిరి జ్యూస్ తయారు చేసుకోండి.ఉసిరిని మిగతా కూరగాయలతో పాటు కలిపి జ్యూస్లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు.

ఉసిరిని ఎలా తీసుకోవాలి..? ఉసిరిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. కొందరు ఉసిరి కాయను పచ్చిగా కూడా  తింటారు.

మరికొందరు ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకుని, నిల్వ పచ్చడిని కూడా చేసుకుని  తింటుంటారు. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉసిరిని తింటూవుంటారు.