డెంగీ ఒక వైరల్ వ్యాధి.ఆడదోమ కుట్టడం వల్ల ఇది వస్తుంది. వైరస్ తేలికపాటి నుంచి తీవ్రమైన లక్షణాలను కలిగిస్తుంది.అలాగే ప్లేట్లెట్స్ తగ్గి నీరసంగా తయారవుతారు.
బొప్పాయి:
బొప్పాయి తినడం వలన ప్లేట్లెట్స్ త్వరగా పెరుగుతాయి. ఇందులో ఉండే ఫ్యబెర్ ,జింక్ మన శరీరానికి కావాల్సిన శక్తిని ఇస్తాయి.
దానిమ్మ:
డెంగ్యూ భారిన పడినవారు ఖచ్చితంగా దానిమ్మను తినాలి. దానిమ్మ రసంలో నిమ్మరసం కలుపుకొని తీసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ఇందులోని పోషకాలు ప్లేట్లెట్స్ ని పెంచుతాయి.
కివి:
ఈ కివిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో ఉండే E ,K , యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని ఇస్తాయి.
అరటి :
అరటిలో ఫ్యబెర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో విటమిన్లు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
జామ:
జామలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. దీనిని జ్యూస్ చేసుకొని తాగడం వలన ఇమ్మ్యూనిటి పవర్ తో పాటు ప్లేట్లెట్స్ ని పెంచుతాయి.
పుచ్చకాయ :
దీనిని జ్యూస్ చేసుకొని తాగడం వలన శరీరం హైడ్రేట్గా ఉంటుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన పలు సమస్యలు దూరం అవుతాయి.
నారింజ :
ఇందులో సిట్రిక్ ఆసిడ్ అధికంగా ఉంటుంది. ఇది మీ శరీరానికి కావల్సిన విటమిన్ సి తో పాటు రోగనిరోధక శక్తిని అందిస్తుంది.
వెజిటేబుల్ సూప్ :
డెంగ్యూ జ్వరం రాకుండా ఉండాలంటే రోజు వెజిటబుల్ సూప్ ని తాగాలి. ఇది నిత్యం శరీరాన్ని హైడ్రేటుగా ఉంచుతాయి. ఇమ్మ్యూనిటీని కూడా పెంచుతుంది.
గమనిక :ఈ సమాచారం నిపుణుల నుంచి మీ అవగాహనా కోసం సేకరించడం జరిగింది.వీటిని తీసుకునే ముందు మీరు డాక్టర్లను సంప్రదించి వారి సలహాలు సూచనలను తీసుకోవడం ఉత్తమం.