Women Beauty : చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి పాదాలు పగులుతూ ఉంటాయి. ఈ 6 టిప్స్ తో వాటికి చెక్ పెట్టండి.

Women Beauty : చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి పాదాలు పగులుతూ ఉంటాయి. ఈ 6 టిప్స్ తో వాటికి చెక్ పెట్టండి.

Women Beauty Women Beautyచలికాలం వచ్చిందంటే చాలు పాదాల పగుళ్లు మొదలవుతాయి. పోలీసులు రాళ్లతో బరుకగా తయారవుతాయి. ఆ పగుళ్ళని నిర్లక్ష్యం చేస్తే రక్తస్రావమయి సమస్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల కాళ్ల పగుళ్లు వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మరియు ఏ చిట్కాలు పాటించాలో ఇక్కడ ఇప్పుడు తెలుసుకుందాం.

👉 నువ్వుల నూనెలో రెండు, మూడు చుక్కల గ్లిజరిన్ కలిపి పాదాలను మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు తేమాంది పగుళ్లు తగ్గుతాయి. అదేవిధంగా ఒక టబ్లో సగం వరకు గోరువెచ్చని నీళ్లను పోసి అందులో రెండు రెండు టీ స్పూన్ల గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ కలపాలి. దింట్లో కొద్దీ సేపు పాదాలను ఉంచి, ఆ తర్వాత మసాజ్ చేసి, మాయిశ్చరై జర్ ను రాయాలి. ఇలా 15 రోజులకి ఒకసారి చేస్తే పగుళ్లు తగ్గుతాయి.

👉 పెరుగు, వెనిగర్ ని సమపాళ్లలో తీసుకొని మసాజ్ చేస్తే, పాదాలు మెత్తగా మారుతాయి. రాత్రి పడుకునే సమయంలో హ్యాండ్ క్రీమ్ తీసుకుని అందులో కాస్త నిమ్మరసం కలిపి పాదాలకు రాసి మృదువుగా మసాజ్ చేస్తే ఈ సమస్య దూరం అవుతుంది.

👉 ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని పాదాలకు రాసి కొద్దిసేపటి తర్వాత చల్లని నీటిలో కడిగి, మాయిశ్చరై జర్ రాయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే, పాదాల మీద పగుళ్లు పోయి చర్మంతుగా ఉంటుంది. రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపి పాదాలకు రాసి మసాజ్ చేసినా కూడా ఫలితం ఉంటుంది.

👉 రోజ్ వాటర్, గ్లిజరిన్ సమపాళ్లలో తీసుకుని పగుళ్లున్న చోట దూదితో రాసి, కొద్దిసేపటి తర్వాత కడగాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే, పగుళ్లు సక్రమంగా తగ్గుముఖం పట్టి పాదాలు మృదువుగా సాఫ్ట్ గా అవుతాయి.

Women Beauty అరటి పండు యొక్క గుజ్జుని తీసి పాదాలకు రాసి, 10 నిమిషాల తర్వాత మంచిగా మసాజ్ చేయాలి. కాలి వేళ్ళు, వాటి సందుల్లోనూ కూడా మసాజ్ చేయాలి. అనంతరం ఒక 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కాళ్లపగుళ్ళ సమస్య నుండి దూరం అవ్వచ్చు.

అరటిపండు నేచురల్ స్కిన్ మాయిశ్చరై జర్ పగిలిన, పొడి బారిన పాదాలను సున్నితంగా మార్చడంలో అరటిపండు బాగా పనిచేస్తుంది. కాబట్టి పగుళ్ల సమస్య ఉన్న వాళ్లకి ఈ పండు మాస్క్ బాగా పని చేస్తుంది. కేవలం పండు మాత్రమే కాదు. తొక్కలోను అమ్మేను ఆసిడ్స్ ఉంటాయి.

కాబట్టి దీనితో పాదాలను రుద్దడం వల్ల పాదాల మృదువుగా మారుతాయి. చర్మాన్ని హైడ్రేషన్ చేయడంలో అరటిపండు బాగా పనిచేస్తుంది. కాబట్టి పగుళ్ల సమస్య ఉన్నవారు వారానికి ఒకసారి ఈ మాస్క్ వేయడం వల్ల ఉపశమనం లభిస్తుంది.

రాత్రిళ్ళు సాక్సులు వేసుకొని పడుకోవాలి. దీనివల్ల పగుళ్ల సమస్య త్వరగా తగ్గుతుంది. ఆ సాక్సులను రెగ్యులర్ గా వాష్ చేయాలి. పగుళ్ళు ఎక్కువగా ఉన్నవాళ్లు హై హీల్స్ వేసుకుంటే, పాదాల చర్మం దెబ్బతింటుంది. వెన్ను నొప్పి వస్తుంటుంది. అందువల్ల చలికాలంలో ఆయిల్ వేసుకోవడం మానేయాలి.

అలాగే ప్రతిరోజు పాదాలకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. పాదాలను నేలపై ఉంచి, గుండ్రంగా రెండు వైపులా తిప్పాలి. అదేవిధంగా కాలివేళ్లపైనే నిలబడాలి. ఈ విధంగా చేయడం వల్ల పాదాలకు మంచి వ్యాయామం అంది, అందంగా, ఆరోగ్యంగా తయారవుతాయి. కాలివేళ్ల గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి.

గమనిక: ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీకు ఈ పగుళ్ల సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమమైన మార్గం అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top