Pickle in Telugu : పచ్చళ్లు బూజు పడుతున్నాయా? అయితే, ఇలా చేయండి.!

Pickle in Telugu : పచ్చళ్లు బూజు పడుతున్నాయా? అయితే, ఇలా చేయండి! మీకు పచ్చళ్ళు ఇష్టమా..రోజుకి ఎంత తినాలో తెలుసుకోండి..

Pickle in Telugu Preservation Tips : వేడి వేడి అన్నంలో లేదా, రోటీలో గాని ఊరగాయ వేసుకొని తింటే, ఉంటది చూడు, ఆ టేస్టే వేరే లెవల్ లో ఉంటది. అయితే, చాలా మంది ఇళ్లల్లో మాత్రం వర్షాకాలం వచ్చిందంటే చాలు.పెట్టుకున్న ఊరగాయలు, పచ్చళ్లు పాడైపోవటం మనం గమనిస్తూ ఉంటాం. అలా పాడవ్వకుండా ఉండాలంటే, కొన్నిచిట్కాలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు ఇక్కడ చూద్దాం.

Pickle in Telugu : మన ఇళ్లల్లో చాలా మంది కూర వండనప్పుడు ఇంట్లో ఉండే ,ఏదైనా పచ్చడి లేదా ఊరగాయ ఉంటే, చాలు దానితోనే ఆ పూటను గడిపేస్తుంటారు. వాస్తవానికి వేడి వేడి అన్నం లేదా రోటిలో ఊరగాయ వేసుకొని తింటే ఆ రుచి అమోఘంగా ఉంటుంది. అందుకే,చాలా మంది సమ్మర్ లో ఆవకాయ, టమాటా, నిమ్మకాయ వంటి వివిధ రకాల నిల్వ పచ్చళ్లు పెట్టుకుంటుంటారు. అయితే, కొన్నిసార్లు ఈ పచ్చళ్లు (Pickles) వర్షాకాలం రాగానే ఫంగస్ కారణంగా బూజు పట్టి చెడిపోతుంటాయి. కాబట్టి, అలాకాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు ఫాలో కావాలంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఆ చిట్కాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

పచ్చళ్లు చెడిపోకుండా,ఎక్కువకాలం రుచిగా ఉండాలంటే, మీరు చేయాల్సిన మొదటి పని.సరిగ్గా నిల్వచేయడం.అందుకోసం వీలైనంత వరకు ఎప్పుడూ కూడా గాలి చేరని గ్లాసు సీసాలను, జాడీలను వాడాలి. అంతేకానీ,ప్లాస్టిక్ బ్యాగ్స్, కంటెయినర్స్ వాడుకూడదనే విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలంటున్నారు నిపుణులు.

పచ్చడిని తయారు చేశాక అది నిల్వ చేసే జార్ బాగా శుభ్రంగా చేయాలి. అలాగే,జార్​ని తుడిచి,కాసేపు ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత పూర్తిగా తడి ఆరగానే ఊరగాయ లేదా పచ్చడి నిల్వ చేసుకోవాలి. అదేవిధంగా,వీలైనంత వరకు ఇత్తడి, రాగి, ఇనుము, జింక్‌తో చేసిన జాడీలను లేదా పాత్రలను వాడకపోవడం మంచిది. ఎందుకంటే, పచ్చళ్లలోని పులుపు ఈ లోహాలతో చర్య జరిపే అవకాశం ఉంటుందతయారు. ఫలితంగా ఊరగాయ రంగు, రుచి రెండూ కూడా మారేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు.

Pickle in Telugu : నిల్వ పచ్చళ్లను ఎండతగలకుండా నీడ ఉండే ప్లేసులో భద్రపరచుకోవాలి. దీంతో పాటు క్రమం తప్పకుండా పచ్చళ్లని కలుపుతూ ఉండాలి. అదేవిధంగా ఊరగాయ లేదా పచ్చడి ఎక్కువగా పొడిబారకుండా నూనె తగినంతగా ఉండేలా చూసుకోవాలంటున్నారు నిపుణులు.

పచ్చళ్లు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా కొంచెం కొంచెం గానే పెట్టుకోవాలి. ఎందుకంటే,రోజులు ఎక్కువయ్యే కొద్దీ రంగు, టేస్ట్ మారుతుంది. కాబట్టి,వీలైనంత వరకు ఫ్రెష్​గా ఉన్నప్పుడే తినేలా చూసుకోవాలి. అలాగే త్వరగా అయిపోయేలా జాగ్రత్త పడాలి. అంటే, ఎక్కువ పరిమాణంలో కాకుండా తక్కువ పరిమాణంలో కావాల్సిన మొత్తంలో పెట్టుకోవడం చాలా మంచిది అంటున్నారు.

మీరు జాడీలో ఉంచిన ఊరగాయను వడ్డించడానికి ఎప్పుడూ కూడా పొడిగా ఉన్న చెంచానే వాడుతూ ఉండాలి . అలాగే రోజు పచ్చడి నిల్వ ఉన్న పెద్ద జాడీని తెరవడానికి బదులుగా చిన్న జాడీలో కొద్దిగా పచ్చడిని తీసుకుంటూ, అయిపోయిన కొద్దీ మల్లి తీసుకొని వాడుకోవడం మంచిది. అలాగే ,ఊరగాయ తక్కువ పరిమాణంలో ఉంటే మీరు దానిని ఫ్రిజ్‌లోకూడా నిల్వ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు.

Pickle in Telugu : కొంతమందికి పచ్చడి అన్నమే ప్రాణం. వాటిని ఇష్టంగా తింతుంటారు. ఎన్ని కూరలు ఉన్నా సరే, పక్కన అంచుకి పచ్చళ్లు ఉండాల్సిందే. ఆఖరికి బిర్యానీ అయినా సరే పచ్చడితోనే తినడానికి ఇష్టపడుతుంటారు. వాటి రుచి అలాంటిది మరి. అయితే, ఇక్కడ మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి. రోజుకి ఎంత పచ్చడి కలుపుకోవాలి. ఎంత తినాలి అనేది తెలుసుకోవాలి. లేకపోతే లేని పోని ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నది.

వేసవి రాగానే చాలా మంది ఆవకాయ, పచ్చళ్ళు పెడుతుంటారు. వాటి రుచిని ఆస్వాదిస్తుంటారు. ఇక వేడివేడిగా ఉన్న అన్నంలోకి కాస్తంత నెయ్యిని వేసుకొని ఆవకాయ కలుపుకుని తింటే ఆ తృప్తియే వేరు. ఇవి అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ పచ్చడి అన్నం ని చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే, రుచి బావుంటుంది కదా అని పచ్చళ్ళు అతిగా తినడం కూడా మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారు మాత్రం ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఆవకాయ అన్నంను చాల మంది ఇష్టపడతారు. వీటి రుచిని ఆస్వాదించడం మంచిదే. కానీ, అతిగా వీటిని తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఏ ఆహారమైనా అతిగా తినకూడదు. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. లిమిట్‌లో ఉండడం మంచిది. ఆవకాయ విషయంలో కూడా అంతే.

Pickle in Telugu : అంతే కాకుండా , బీపీ, షుగర్ ఉన్నవారు ఆవకాయ, పచ్చళ్లు దదాపు తినకపోవడమే మంచిది అని చెబుతున్నారు నిపుణులు. బీపీ ఉన్నవారు రోజుకి ఓ ఆవకాయ ముక్క తినొచ్చు. అంతకు మించి అస్సలు తినకూడదని చెబుతున్నారు. గ్రేవీ వీలైనంత తక్కువగా తినాలి. ఎందుకంటే ఆవకాయలో ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు, షుగర్ ఉన్వారు కూడా ఒక్క ముక్క కన్నా ఎక్కువ తీసుకోకపోవడమే మంచిది.

గమనిక : అతిగా పచ్చళ్ళను తినకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఏ ఆహారమైనా అతిగా తినకూడదు. అవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. లిమిట్‌లో తీసుకోవడమే మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top